టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ టెస్టింగ్ : ఫోటోలు మరియు ఇతర వివరాలు
టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద చాలా వరకు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. అందులో కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ కూడా ఒకటి. టాటా ప్రదర్శించిన అన్ని ఉత్పత్తుల్లో కన్నా ముందుగా ఈ కైట్ 5 ను విడుదల చేయనుంది. అందుకోసం ఈ కాంపాక్ట్ సెడాన్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంభందించిన ఫోటోలు మరియు ఇతర వివరాలు

టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ టాటా వారి టియాగో ఆధారంతో రూపొందించబడింది. టియాగోలోని కొన్ని డిజైన్ అంశాలను ఈ కైట్ 5 పంచుకుంది.

ఈ రెండింటిని పోల్చినపుడు మనం గుర్తించే వాటిలో వెనుక వైపు బూట్ ఈ కైట్ 5 లో ఉంటుంది, టియాగోలో ఉండదు. దీనిని మినహాయిస్తే మరే మార్పులు చోటు చేసుకోలేదు. ముందు వైపు డిజైన్ మరియు హెడ్ ల్యాంప్స్ ఆకృతి దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది.

ఇందులో మరో ముఖ్యమైన అంశం అత్యధిక బూట్ స్పేస్. అవును దీనికి పోటీగా ఉన్న మరే ఇతర ఉత్పత్తులతో పోల్చుకున్నా కూడా ఇందులో గరిష్టంగా 420 లీటర్ల వరకు బూట్ స్పేస్ కలదు. లాంగ్ డ్రైవ్ మరియు ఫ్యామిలీ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సాంకేతికంగా ఈ కైట్ 5 కాంపాక్ట్ సెడాన్‌లో టియాగోలో ఉన్న ఇంజన్‌లను అందించనున్నారు. ఇందులో వినియోదారులు ఎంచుకునే విధంగా 1.05-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు కలవు.

రెండు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తున్నారు. మరియు తర్వాతి కాలంలో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

టాటా మోటార్స్ ఈ కైట్ 5 కాంపాక్ట్ సెడాన్‌ను వచ్చే 2016 పండుగ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో టాటా జెస్ట్ అమ్మకాల్లో ఉంది, ఇదే సెగ్మెంట్లో వస్తోన్న కైట్ 5 పెద్దగా అమ్మకాలు సాధించలేదని ప్యాసింజర్ వాహనాల ప్రముఖుల అంచనా వేస్తున్నారు.

శిథిలమైన నానో జీవితం: ఊహించిన చిత్రాలతో టాటా నానో ప్లాంట్
టాటా హెక్సా గురించి మీకు తెలియని విషయాలు


Click it and Unblock the Notifications








