టియాగో విజయం: ఈ దీపావళికి టాటా కైట్ 5 పటాస్ పేలడం డౌటే!
ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి అందుబాటులోకి రానున్న కైట్ 5 విడుదల ఆలస్యానికి కారణం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టియాగో హ్యాచ్‌బ్యాక్ అని టాటా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.
కైట్ 5 విడుదలకు టియాగో హ్యాచ్‌బ్యాక్‌కు సంభందం ఏముంది అనుకుంటున్నారా ? దీపావళికి గాను ప్రస్తుతం వినియోగదారుల నుండి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీని వలన కైట్ 5 ని విడుదల చేసే ఘట్టాన్ని టాటా మోటార్స్ వాయిదా వేసుకుంది.

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద నాలుగు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. అవి జికి (ప్రస్తుతం టియాగో గా పిలవబడతోంది), కైట్ 5, హెక్సా మరియు నెక్సాన్.

టాటా మోటార్స్ తమ నాలుగు ఉత్పత్తులను దేశీయ విపణిలోకి వరుసగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. అందులో భాగంగా మొదటగా టియాగోను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇక తరువాత విడుదల కావాల్సిన హెక్సాను వచ్చే ఏడాది జనవరి నాటికి వాయిదా వేసింది. టియాగో ఆధారంతో రూపొందించబడిన కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ విడుదలను కూడా వాయిదా వేసింది.

ప్రస్తుతం దేశీయంగా కాంపాక్ట్ సెడాన్‌ల అమ్మకాలు నిలకడగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కైట్ 5 విడుదలైతే టియాగో తరహా అమ్మకాలు సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే విజయ పథంలో దూసుకెళ్తున్న టియాగో కారణంగానే కైట్ 5 విడుదల ఆలస్యం అని తెలిసింది.

సమాచార వర్గాల కథనం మేరకు, టాటా ప్యాసింజర్ వాహనాల ప్రోగ్రామ్ ప్లానింగ్ మరియు ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ వాఘ్ స్పందిస్తూ కైట్ 5 విడుదల ఆలస్యం కావడానికి టియాగో హ్యాచ్‌బ్యాక్ కారణం అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం టియాగో మీద వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. వెయిటింగ్ పీరియడ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించి వినియోగదారులకు త్వరగా డెలివరీ ఇవ్వాలనే కైట్ 5 విడుదల ఆలస్యం చేసినట్లు తెలిపాడు.

కైట్ 5 కూడా టియాగో తరహా అత్యంత ఆశ్చర్యకరమైన ఉత్పత్తి అని తెలిపాడు. కైట్ 5 ను టియాగోతో పాటు సనంద్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు.

ప్రస్తుతం 50,000 టియాగో హ్యాచ్‌బ్యాక్‌ల బుకింగ్స్ నమోదు కాగా అందులో కేవలం 25,000 మందికి మాత్రమే డెలివరీ ఇచ్చినట్లు తెలిసింది.

విశేష స్పందనకు గురైన టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్‌లు కలవు.

టాటా మోటార్స్ ఇవే ఇంజన్‌లతో అందుబాటులోకి తీసుకువస్తున్న కైట్ 5 ను మార్చి 2017 వో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రారంభంలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదలై, తరువాత ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పరిచయం కానుంది.

- జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికాపై ఆరోపణలు
- భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
- ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్ కాదు: AP లోని ఒక APSRTC బస్టాండ్


Click it and Unblock the Notifications








