టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు కోసం

By Anil

టాటా మోటార్స్ టియాగో ఆధారంతో సరికొత్త కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ కారును అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం టియాగో హ్యాచ్‌బ్యాక్‌ విజయంతో ఉరకలు వేస్తోన్న టాటా మోటార్స్ ఇదే సందర్భంలో కైట్ 5 అనే కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. అయితే తాజాగా దీనికి కొన్ని రహదారి పరీక్షలు నిర్వహించారు. వాటికి సంభందించిన వివరాలు క్రింది కథనంలో...

టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

అత్యంత రహస్యంగా నిర్వహించిన కైట్ 5 రహదారి పరీక్షల్లో దీనికి సంభందించిన ఫోటోలు వెలువడ్డాయి. దీనిని ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

కైట్ 5 రహస్య పరీక్షలకు చెందిన స్పై ఫోటోలను తీక్షణంగా పరిశీలించినట్లయితే ఇది సన్‌బరస్ట్ ఆరేజ్ రంగుల్లో ఉన్నట్లు అవగతం అవుతుంది.

టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

టాటా మోటార్స్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన కైట్ 5 కారుకు వెనుకున్న టెయిల్ ల్యాంప్స్‌నే ఈ టెస్ట్ కారు పోలి ఉంది. అంటే డిజైన్‌కు సంభందించి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదన్నమాట.

టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

టాటా మోటార్స్ ఈ కైట్ 5 ఉత్పత్తిని దేశీయంగా ఉన్న సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్ విభాగంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ విభాగంలోకి జెస్ట్‌ కారును అందించింది.

టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ సాంకేతిక వివరాల పరంగా చూస్తే ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ మరియు టియాగో హ్యాచ్‌బ్యాక్‌లోని 1.05 లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించనున్నారు.

టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

డీజల్ ఇంజన్‌కు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అదే విధంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను కూడా అనుసంధానం చేయనున్నారు.

టాటా కైట్ 5 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

టాటా మోటార్స్ మరియు ఆటోమొబైల్ సమాచారం కోసం తెలుగు‌డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి. మా మరిన్ని అప్‌డేట్స్‌ కోసం.....

ఎక్కువ మంది చదివిన కథనాలు మీ కోసం....

టాటా హెక్సా గురించి మీకు తెలియని విషయాలు

క్రూయిజ్ నౌకల ప్రయాణాల వెనకున్న ఆసక్తికరమైన విషయాలు

Article Published On: Wednesday, June 15, 2016, 11:54 [IST]
English summary
Spied: Tata Kite 5 Spotted Testing; Reveals Its Colours
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+