ఉత్పత్తికి సిద్దమైన టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్
టాటా మోటార్స్ 2014 లో జరిగిన 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో కైట్ 5 కారును ప్రదర్శించింది. వెనుక వైపున కొంచెం నూతన మార్పులతో వస్తున్న దీనిని టాటా మోటార్స్ పరీక్షల కోసం ఇండియన్ రోడ్ల మీదకు తెచ్చింది. ఇది దాదాపుగా అన్ని రకాల అభివృద్ది పనులను ముగించుకుని ఉత్పత్తికి సిద్దమైపోయింది. పరీక్షలు విజయవంతమైతే ఇక దీనిని ఉత్పత్తి చేయడమే తరువాయి.

ఇక్కడ ఉన్న ఫోటోలో గల కైట్ కారును పరిశీలించినట్లయితే ఇది 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ ప్రదర్సించిన కైట్ ను పోలి ఉంది.

దీనిని స్పెసిఫికేషన్లలో భాగమైన కొలతలను పరిశీలించినట్లయితే ఇది సబ్ నాలుగు మీటర్ల విభాగానికి చెందిన కాంపాక్ట్ సెడాన్ రూపంలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఇండిగో ఇసిఎస్ స్థానంలో ఇది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ముందు వైపు ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు ఇతర డిజైన్ పోలికలను గమనిస్తే ఇది టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను జిరాక్స్ తీసినట్లు ఉంటుంది. టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును తయారు చేసిన ఫ్లాట్ మీదనే దీనిని కూడా రూపొందించారు.

ఇక వెనుక వైపు దీనికి బూట్ స్పేస్‌ను అనుసంధానించడం ద్వారా ఇది కాంపాక్ట్ సెడాన్ విభాగంలోకి చేరిపోయింది. టాటా మోటార్స్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న ఈ సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్ మిగతా ఏ ఇతర ఇండియన్ కాంపాక్ట్ సెడాన్‌లతో పోల్చితే ఎంతో భిన్నంగా ఉంటుంది.

దీని వెనుక వైపు డిజైన్‌లో వోక్స్ వ్యాగన్ జిటి లీనియేజ్ కారులోని పోలికలు కొన్ని పాళ్లలో కలిసినా ఇది కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఉండటం వలన దీనిని వెంటనే గుర్తించలేరు. అయితే వెనుక వైపున ఆకర్షణీయమైన స్పాయిలర్ దీనిని మరింత స్పోర్టివ్‌గా కనబడేలా చేస్తుంది.

టాటా మోటార్స్ ఈ కైట్ 5 ధరను నిర్ణయించే విషయంలో టియాగో కారుకు నిర్ణయించిన ధోరణిలోనే ఉన్నట్లు తెలిసింది. అత్బుతమైన ఇంజన్ ఆప్షన్లతో టియాగో కారుకు సరైన ధరలను నిర్ణయించింది. అందరికీ అందుబాటులో ధరలో దీనిని సరైన ధరలకు విడుదల చేయనున్నారు.

ఇంజన్ వివరాలు పరంగా చూస్తే టాటా మోటార్స్ కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ కారులో వినియోగించిను ఇంజన్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం టియాగోలో వినియోగించిన రివట్రాన్ పెట్రోల్ మరియు రివట్రాక్ డీజల్ ఇంజన్‌లను వినియోగించనున్నట్లు తెలిసింది.

అతి త్వరలో విడుదల కానున్న టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ కారు గురించి మరిన్ని వివరాలు కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌తో కలిసి ఉండండి.

రోడ్డు ప్రమాదాలకు దారితీసే 25 కారణాలను వెల్లడించిన డ్రైవ్‌స్పార్క్
ఇండియన్ మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా విడుదల: ధర రూ. 13.84 లక్షలు
Source


Click it and Unblock the Notifications








