కైట్ 5 కాంపాక్ట్ సెడాన్‍ను ఆటో ఎక్స్ పోలో కొలువుదీర్చిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ వారు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా మొదటి సారిగా కైట్ 5 అనే పేరుతో కాంపాక్ట్ సెడాన్ ను ఆవిష్కరించింది. మరియు ఇది టాటా మోటార్స్ వారి ఇండిగో ఇసిఎస్ కారు స్థానంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నాలుగు మీటర్లు పొడవు మాత్రమే ఉన్న ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.
AUTO EXPO NEWS: ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి వితారా బ్రిజా: విడుదల వివరాలకు
స్లైడర్స్ మీద క్లిక్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి...

డిజైన్
కైట్ సెడాన్ కారు డిజైన్ టాటా మోటార్స్ వారు ఇప్పటికే పరిచయం చేసిన జికా హ్యాచ్‌బ్యాక్ కారును పోలి ఉంది. అయితే ముందు వైపున గల ఫ్రంట్ గ్రిల్ కొత్తగా మరియు వెనుకవైపున గల బూట్ (డిక్కీ) కొంచెం పొడిగించారు.

కైట్ 5 సెడాన్ ఇంజన్ వివరాలు
టాటా మోటార్స్ వారు తమ మొదటి కాంపాక్ట్ సెడాన్ కారులో రెండు రకాల ఇంజన్‌లను అందుబాటులో ఉంచారు. 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ మరియు 1.05-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్.

పవర్
కైట్ 5 సెడాన్ కారులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 84 బిహెచ్‌పి పవర్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 69 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టార్క్
టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్‌లోని పెట్రోల్ ఇంజన్ 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 115 ఎన్ఎమ్ టార్క్ మరియు డీజల్ ఇంజన్ 1,800 నుండి 3,000 ఆర్‌పిఎమ్ మధ్యన 140 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ మరియు గేర్ బాక్స్
రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉన్నాయి. అయితే టాటా మోటార్స్ సంస్థ వీటిని ఆప్షనల్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

పోటి
కైట్ 5 సెడాన్ కారు ఆటో ఎక్స్ పో వేదిక నుండే దీనికి సరితూగే వాటితో పోటికి సిద్దమైంది. ఇందులో ముఖ్యంగా హ్యుందాయ్ జెంట్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మరియు వోక్స్‌వ్యాగన్ సంస్థ క్రొత్తగా ప్రవేశ పెట్టిన అమియో వంటి కార్లకు పోటిగా నిలిచింది.

నాలుగు మీటర్ల పొడవు
టాటా మోటార్స్ వారు మొదటి సారిగా ఈ నాలుగు మీటర్ల సబ్ కాంపాక్ట్ సెడాన్ కారును అందించినట్లు ఈ సంధర్భంగా తెలిపారు.

అందుబాటులోకి
టాటా మోటార్స్ వారు ఈ కైట్ 5 సెడాన్ కారును ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి విక్రయాలకు సిద్దం చేయనున్నారు.

- దిల్లీలో జరుగుతున్న 2016 ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ వారు ప్రదర్శిస్తున్న మరిన్ని వాహనాల గురించి తెలుకోండి.
- 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడుతున్న అన్ని టూ వీలర్లు మరియు ఫోర్ వీలర్ల గురించి తెలుసుకోండి.



Click it and Unblock the Notifications








