టాటా కైట్ 5 కోసం సిద్దం చేసిన వియాగో మరియు ఆల్టిగో లలో ఏ పేరు బాగుంది..?
టాటా అప్ కమింగ్ కాంపాక్ట్ సెడాన్ కైట్ 5 యొక్క ప్రొడక్షన్ వేరియంట్‌కు వియాగో లేదా ఆల్టిగో అనే పేరును ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత కాంపాక్ట్ సెడాన్ కైట్ 5 ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. కాన్సెప్ట్ మరియు టెస్టింగ్ దశలో ఉన్న ఈ కాంపాక్ట్ సెడాన్ ఇంతకాలం కైట్ 5 గానే కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రొడక్షన్ దశకు వచ్చిన దీనికి ఇప్పుడు పేరును ఖరారు చేసే పనిలో టాటా నిమగ్నమైంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ కు వియాగో లేదా ఆల్టిగో అనే పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.

టాటా ఈ సెడాన్‌ను ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంది. అయితే టియాగో విజయాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో దీని విడుదలను 2017 నాటికి వాయిదా వేసింది.

టాటా మోటార్స్ ఈ కైట్ 5 కారుకు పెట్టే పేరుకు చివరి గో (go) వచ్చే విధంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వియాగో మరియు ఆల్టిగో అనే పేర్లను గమనిస్తున్నారు. ఇందులో మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ రూపంలో క్రింద గల కామెంట్ బాక్స్‌లో వ్రాయండి...

అచ్చం ఇదే రూపంతో విడుదలైన హ్యాచ్‌బ్యాక్ పేరు టియాగో, అయితే దీని ఆధారిత సెడాన్ కూడా అదే పేరుతో ఎండ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కైట్ 5 కాన్సెప్ట్ పేరు చివర్లో గో వచ్చే పేరుతో మార్చనుంది.

టాటా కైట్ కాన్సెప్ట్ ప్రొడక్ట్ ప్రకారం ముందు వైపున డ్యూయల్ చాంబ్లర్ హెడ్ ల్యాంప్స్ వరకు పొడగించబడిన క్రోమ్ హ్యుమానిటీ లైన్, వెనుక వైపున ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, మరియు అగ్రెసివ్ షోల్డర్ లైన్లు కలవు.

సాంకేతికంగా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు కలవు.

పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 83.8బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ గరిష్టంగా 69బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

ఇంటీరియర్ పరంగా 5-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూ టూత్ కనెక్టివిటి, ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

భద్రత పరంగా టాటా మోటార్స్ ఈ టియాగో ఆధారిత సెడాన్ లో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కార్నర్ స్టెబిలిటి కంట్రోల్ వంటి ఫీచర్లు రానున్నాయి.

టాటా కైట్ 5 సెడాన్ పూర్తి స్థాయిలో విడుదలైతే వీటి ఆన్ రోడ్ ధరలు ప్రారంభపు వేరియంట్ రూ. 4.8 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.3 లక్షలు(అంచనా)గా ఉండే అవకాశం ఉంది.

- స్కూటర్ల రాజ్యం: మార్కెట్లోకి దూసుకొస్తున్న స్కూటర్లు
- బజాజ్ నుండి మరో సంచలనాత్మక మోడల్
- ఆ రహదారి పై వాహనాలు వెళ్లచ్చు, విమానాలు ల్యాండవచ్చు


Click it and Unblock the Notifications








