ధరల పెంపును ప్రకటించిన టాటా మోటార్స్

వివిధ రకాల స్థూల ఆర్థిక కారణాల వలన టాటా మోటార్స్ దేశ వ్యాప్తంగా ఉన్న తమ విభిన్న వాహనాల మీద ధరల పెంపు చేపట్టింది.

By Anil

భారత దేశపు అతి పెద్ద వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయంగా తమ లైనప్‌లో ఉన్న అన్ని వాహనాల మీద ధరల పెంపు చేపట్టనట్లు అధికారికంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశీయంగా ఉన్న స్థూల ఆర్థిక సమస్యల కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు టాటా స్పష్టం చేసింది.

ధరలు పెంచిన టాటా మోటార్స్

తమ శ్రేణిలోని ఉత్పత్తుల మీద ధరల సవరణ ప్రభావం రూ. 5,000 నుండి 25,000 రుపాయల వరకు ఉంటుందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది చివరి టాటా గతంలో ప్రకటించిన ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ధరలు పెంచిన టాటా మోటార్స్

నూతన ధరలు 201 జనవరి నుండి అమల్లోకి రానున్నాయి. మిగతా వాహన సంస్థల యొక్క ధరల పెంపుతో పోల్చితే టాటా స్వల్పంగా ధరల పెంపు చేపట్టింది.

ధరలు పెంచిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనల మార్కెటింగ్ విభాగాధిపతులు మయాంక్ పరీకర్ మాట్లాడుతూ, ముడి వస్తువులైన స్టీల్, అల్యూమినియం, కాపర్ మరియు రబ్బర్ వంటి వాటి ధరలు గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తుల ధరలు వీలైనంత వరకు తక్కువగా ఉండేట్లు జాగ్రత్త వహిస్తూ వచ్చామని, అయితే ధరల పరంగా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్న తరుణంలో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని ఆయన తెలిపాడు.

ధరలు పెంచిన టాటా మోటార్స్

గత రెండు మాసాల నుండి టాటా మోటార్స్ అమ్మకాల్లో మంచి వృద్దిని నమోదు చేసుకుంటున్నట్లు పరీకర్ గారు తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో హెక్సా విడుదలతో తమ ఈ సక్సెస్‌ను కొనసాగించడానికి సిద్దమవుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

ధరలు పెంచిన టాటా మోటార్స్

తయారీ రంగం మీద కలగే అసమాన పెట్టుబడులను సమం చేయడానికి వాహన తయారీ సంస్థలు ప్రతి ఏడాది కూడా ధరల పెంపు బాట పడుతుంటాయి. ఇప్పటికే ఈ ఏడాది ధరల పెంపును ప్రకటించిన వాటిలో వరుసగా హ్యందాయ్, రెనో, నిస్సాన్, డాట్సన్, టయోటా మరియు హోండా వంటివి ఉన్నాయి.

ధరలు పెంచిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ మరియు మిగతా నాలుగైదు సంస్థలు మాత్రమే కాదు, చాలా వరకు వాహన తయారీ సంస్థలు మరియు వాటి అనుభంద సంస్థలు ధరల సవరణల పనులలో తలమునకలై ఉన్నాయి. తాజా ఆటోమొబైల్ సమాచారాన్ని తెలుగులో పొందడానికి డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

ధరలు పెంచిన టాటా మోటార్స్
  • విమానంలో కూర్చోవడానికి అత్యంత సురక్షితమైన చోటు ఏది ?
  • మారుతున్న ఇండియన్ రైల్వే
  • టాటా నుండి అద్బుతమైన మోడల్ విడుదలకు ముహూర్తం ఖరారు

More from DriveSpark

Article Published On: Wednesday, December 14, 2016, 18:08 [IST]
English summary
Tata Motors Hikes Price Throughout Range — Read More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+