టాటా వారి దీపావళి ఆఫర్: 10 లక్షలు రుపాయలు గెలుపొందే అవకాశం
పండుగ సీజన్‌లో కస్టమర్లను వలలో వేసుకోవడానికి దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఆద్భుతమైన భారీ ఆఫర్లను ప్రకటించింది. హర్ వీక్ దీపావళి (ప్రతి వారం దీపావళి) అనే ఆఫర్‌ను పరిచయం చేస్తూ టాటా లోని కేవలం ప్యాసింజర్ వాహనాల మీద మాత్రమే ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

టాటా మోటార్స్ ఈ హర్ వీక్ దీపావళి ఆఫర్‌ను సెప్టెంబర్ 16, 2016 నుండి ప్రారంభించింది. టాటా సఫారీ స్టార్మ్ ఎస్‌యువి మీద గరిష్టంగా లక్ష రుపాయల వరకు లాభాలను అందించారు.

జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ మీద గరిష్టంగా 20,000 వరకు ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచారు.

దేశ వ్యాప్తంగా ఉన్న టాటా డీలర్లు వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులో ఉంచారు. ఉచిత ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నారు.

ఈ దీపావళి సందర్భంగా వినియోగదారులు సుమారుగా 10 లక్షల రుపాయలు గెలుపొందే అవకాశం కల్పిస్తున్నారు. ఏడు మంది లక్కీ విజేతలు ఒక్కొక్కరు 10 లక్షల రుపాయలు గెలుపొందే అవకాశం టాటా మోటార్స్ అందిస్తోంది.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల లైనప్‍లో ఉన్న సఫారీ స్టార్మ్ ఎస్‌యువి, టాటా జెస్ట్ మరియు టియాగో హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి.

- దీపావళికి ఇంట్రెస్టింగ్ మోడల్‌తో సిద్దమైన యమహా
- ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక


Click it and Unblock the Notifications








