జికాకు బదులుగా టియాగొ పేరును పెట్టిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ వారు తమ హ్యాచ్‌బ్యాక్ కారుకు జికా కు బదులుగా టియాగొ అనే పేరును నిర్ణయించించిది. టాటా ముందు టియాగొ, సివెట్ మరియు అడోర్ వంటి పేర్లలో ఏదో ఒక దానిని దీనికి నిర్ణయించాలని అనుకున్నారు. అయితే జికాకు టియాగొ అనే పేరుతో నామకరణం చేశారు.
Also Read: టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి
కారణం ఎందుకో తెలుసా ? ప్రపంచ వ్యాప్తంగా జికా వైరస్ మృత్యు ఘంటికలు మ్రోగిస్తున్న నేపథ్యంలో టాటా వారు జికాకు బదులుగా ఇలా మరో పేరును వెతుక్కోవాల్సి వచ్చింది. టాటా టియాగొ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.

టాటా టియాగొ ఇంజన్ వివరాలు
టాటా వారి టియాగొ కారు రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది.
- 1.2-లీటర్ పెట్రోల్
- 1.05-లీటర్ డీజల్ ఇంజన్
- టాటా టియాగొ టెస్ట్ డ్రైవ్ వివరాలు

డ్రైవ్ మోడ్స్
టాటా వారు ఈ సెగ్మెంట్లో మొదటి సారిగా తమ టయాగొ కారులో రెండు డ్రైవ్ మోడ్స్‌ను అందించారు. అవి మైలేజ్ కోసం సిటి మోడ్ మరియు చక్కటి పనితీరు కోసం ఎకో మోడ్‌ను అందించారు.

యువత కోసం
టాటా మోటార్స్ వారు ఈ టియాగొ కారు ముందు వైపు డిజైన్‌ను ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. అయితే భారతీయ రోడ్ల మీద ఇది భారీ స్థాయిలో కనపడనుంది.

ధర
టాటా మోటార్స్ వారు దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తే దీని ధర దాదాపుగా రూ. నాలుగు లక్షల నుండి ప్రారంభం కానుంది.

పోటి
టాటా మోటార్స్ వారు టియాగొ కారు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సెలెరియో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి కార్లకు పోటీగా నిలవనుంది.

అందుబాటులోకి
టాటా తమ టియాగొ హ్యాచ్‌బ్యాక్ కారును ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

టియాగొ ప్రస్థానం
టాటా మోటార్స్ వారు దీనిని ప్రారంభంలో కైట్ అనే కోడ్ పేరుతో ప్రదర్శించారు, తరువాత దీనిని జికా అనే పేరుతో మార్పు చేశారు. కాని ప్రపంచ వ్యాప్తంగా జికా అనే వైరస్ ప్రబలడంతో టాటా జికా కాస్త టాటా టియాగొ పేరుగా మార్పు చెందింది.

టాటా టియాగొ ఆశలు
టాటా మోటార్స్ వారు గత కాలంలో విడుదల చేసిన బోల్ట్, జెస్ట్ మరియు జెన్ ఎక్స నానో కార్లు అమ్మకాల పరంగా పెద్దగా విజయం సాధించలేదు. అయితే టాటా వారి టియాగొ కారు ఆశించిన ఫలితాలు సాధిస్తుందని నమ్మకాలు పెట్టుకుంది.



Click it and Unblock the Notifications