విడుదలకు ఆసన్నమైన టాటా నెక్సాన్ అసలు రూపం ఇదే

టాటా మోటార్స్ మరోసారి రహస్యంగా తమ అప్ కమింగ్ క్రాసోవర్ నెక్సాన్ ను పరీక్షించింది. అయితే ఈ ప్రొడక్షన్‌కు సిద్దమైన ఉత్పత్తిగా దర్శనమిచ్చింది.

By Anil

టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న తమ అప్ కమింగ్ క్రాసోవర్‌కు మరోసారి అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహించింది. అక్కడక్కడ ఎరుపు వర్ణాన్ని పులుముకున్న నెక్సాన్ ప్రొడక్షన్ రెడి మోడల్‌గా పరీక్షలకు రోడ్డెక్కింది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

టాటా తమ నెక్సాన్ ఎస్‍‌యువిని పూనే నగర సమీపంలో రహస్యంగా పరీక్షింస్తుండగా మీడియా కంటికి చిక్కింది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

టాటా మోటార్స్ తమ హెక్సా ఎస్‌యువి మరియు కైట్ 5 కార్లను విడుదల చేసిన అనంతరం ఈ నెస్సాన్‌ను విడుదల చేయనుంది. కాబట్టి వీటి బుకింగ్స్ 2017 తొలి సగం తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

ప్రస్తుతం రహస్య పరీక్షలకు గురైన నెక్సాన్ మోడల్ ఈ శ్రేణిలోని టాప్ ఎండ్ వేరియంట్‌. దీని ముందు టాటా సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్‌ను గుర్తించవచ్చు.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

నెక్సాన్ ముందు వైపు డిజైన్‌లో ప్రొజెక్ట్ హెడ్‌ల్యాంప్స్, సిరామిక్ సైడ్ ఫినిషర్, ప్రకాశవంతమైన రూఫ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్‌ఇడి టెయిల్ లైట్లు మరియు పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు కలవు.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

ముందువైపున ఫాగ్ ల్యాంప్స్ మరియు గ్లాస్ బ్లాక్ పూత పూయబడిన విశాలమైన గ్రిల్‌ రానుంది. టాటా మోటార్స్ ఈ నెక్సాన్‌ను ఇంపాక్ట్ డిజైన్ భాషలో రూపొందించింది. టాటా డిజైన్ ముఖ్యులు ప్రతాప్ బోస్ నేతృత్వంలోని బృందం దీనిని రూపొందించింది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

టాటా వారి ఇండికాను అభివృద్ది చేసిన ఎక్స్1 వేదిక ఆధారంగా ఈ నెక్సాన్‌కు భారీ మార్పులు చేశారు. 2017 లో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానుంది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

నెక్సాన్‌లోని 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ సుమారుగా 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

ఇందులోని డీజల్ ఇంజన్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పరిచయం కానుంది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

నెక్సాన్‌ డీజల్‌తో పాటు 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

హెక్సా లోని వివిధ రకాలు డ్రైవింగ్ పద్దతులు నెక్సాన్ ఎస్‌యువి లోని టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చే అవకాశం ఉంది. టాటా మోటార్స్ దీని విడుదలకు సంభందించిన ఏవిధమైన ప్రకటన చేయలేదు. అయితే 2017 మలి సగంలో ఇది అమ్మకాలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి

  • దీపావళి కానుక: ఆ సంస్థలో ఉద్యోగులకు 1,260 కార్ల పంపిణీ
  • మార్కెట్‌కు గుబులుపెట్టిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ కొత్త రూపం
  • బైకులతో పోల్చుకుంటే స్కూటర్లే సంచలనాలు సృష్టిస్తున్నాయి

Article Published On: Friday, October 28, 2016, 18:07 [IST]
English summary
Read In Telugu: Tata Nexon Spied Testing With Berry Red Body Colour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+