రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

By Anil

టాటా మోటార్స్ తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి వాహనాన్ని 2016 ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. నాలుగు మీటర్లు పొడవున ఈ కాంపాక్ట్ ఎస్‌యువికి టాటా మోటార్స్ నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. గత వారంలో టాటా మోటార్స్ దీనికి పూనేలోని జాతీయ రహదారిలో పరీక్షలు నిర్వహించారు. దీనికి చెందిన ఫోటోలు మరియు ఇతర వివరాలు క్రింది కథనంలో...

రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యు

రోడ్ల మీద పరుగులు పెడుతున్నపుడు ఈ నెక్సాన్ కారుకు సంభందించి హెడ్ లైట్లు మరియు టెయిల్ లైట్ల యొక్క లైటింగ్ మరియు డిజైన్ తీరును టాటా మోటార్స్ ఇంజనీర్లు పర్యవేక్షించారు. కాబట్టి విడుదల నాటికి నెక్సాన్ బాహ్య డిజైన్‌లో మరిన్ని మార్పులు చేసుకునే అనకాశాలు ఉన్నాయి.

రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యు

ఇంత రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఈ టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా ? 2017 మధ్య భాగంలోపు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యు

టాటా మోటార్స్ ఇందులో 1.2-లీటర్ రివట్రాన్ టర్భో ఛార్జ్‌డ్ మరియు 1.5-లీటర్ రివోటార్క్ డీజల్ ‌ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది.

రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యు

అయితే మునుపటి టాటా ఉత్పత్తులైన జెస్ట్, టియాగో మరియు బోల్ట్ వంటి కార్లలో ఇదే తరహా ఇంజన్‌‌లను వినియోగించారు.

రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యు

టాటా మోటార్స్ ఈ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిలో వినియోగించే రెండు రకాల ఇంజన్‌లకు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేయనుంది.

రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యు

భద్రత అంశాల పరంగా టాటా మోటార్స్ ఈ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు తాజాగా టాటా మోటార్స్ పేటెంట్ పొందిన ఇంజన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కూడా ఇందులో పరిచయం చేయనుంది.

రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యు

నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి మార్కెట్లోకి విడుదలైతే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా టియువి300 మరియు మారుతి సుజుకి వారి వితారా బ్రిజా వంటి వాటికి పోటీగా నిలవనుంది.

ఎక్కువ మంది చదివిన కథనాలు....

పెట్రోల్, డీజల్ కార్ల కన్నా ఇవి ఎంతో నయం

ఎక్కువ మంది చదివిన కథనాలు....

హోండా బిఆర్‌-వి కొనుగోలు చేసే ముందు ఈ ఫోటోలను చూడండి

భారత్‌లో ఉన్న ఉత్తమ ట్రాక్టర్ తయారీ సంస్థలు


Source

More from DriveSpark

Article Published On: Monday, May 9, 2016, 17:47 [IST]
English summary
Tata Nexon Compact SUV Spied Testing Ahead Of 2017 Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+