టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్: డ్రైవర్లంతా మనోళ్లే మొదటిసారిగా
టాటా మోటార్స్ వారి 2016 టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ పోటీ అట్టాహాసంగా ఈ నెల 20 న విజయవంతంగా ముగిసింది. అయితే ఇందులో ఓ ప్రతేకత ఉంది. ఎందుకంటే మొదటి టాటా మోటార్స్ నిర్వహించిన ఈ పోటిలలో మొదటి సారిగా దేశీయ డ్రైవర్లకు అవకాశం కల్పించారు.

టాటా మోటార్స్ వారు నిర్విహించిన ఈ ట్రక్ రేసింగ్ మూడవ సీజన్‌కు చెందినది. ఎలాగైతేనేం ఈ రేసింగ్‌లో భారతీయ డ్రైవర్లు విదేశీ డ్రైవర్లతో పాటు రేస్‌లో పాల్గొన్నారు. అయితే అంతర్జాతీయ డ్రైవర్లతో పోల్చుకుంటే ఇండియన్ డ్రైవర్ల రేసింగ్ ధోరణిలో చాలా వ్యత్యాసం కలదు ముగిసిన ట్రక్ రేసింగ్‌లో ఇది స్పష్టంగా అవగతం అయ్యింది.
ప్రో క్లాస్‌లోని 8-ల్యాప్ రేసులో క్యాస్ట్రోల్ వెక్టన్ టీమ్‌లోని మ్యాట్ సమ్మఫీల్డ్ విజయం సాధించాడు. బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో 3.1 కిలోమీటర్లు దూరాన్ని 1:50:691సెకండ్ల వ్యవధిలో చేరుకున్నాడు
ఇందులో పాల్గొన్న 12 ఇండియన్ డ్రైవర్లకు గుర్తుగా వారి ట్రక్కులను నలుపు రంగులో ఉండగా మరియు విదేశీ రైడర్లకు అదే ఇంజన్ ఆప్షన్లు గల వివిద రకాల రంగులు గల ట్రక్కులను అందుబాటులో ఉంచారు.
చివరిగా ఫలితాలు
ఇండియన్ డ్రైవర్ల రేస్- I (సూపర్ క్లాస్)
1.జగత్ సింగ్
2. మల్కీట్ సింగ్
3. రాజ్‌కుమార్ మహతో
ఇండియన్ డ్రైవర్ల రేస్ - II (సూపర్ క్లాస్)
1. నాగార్జున ఎ
2. భాగ్ చంద్
3. ఆనంద్
అంతర్జాతీయ డ్రైవర్ల రేస్ - I (ప్రో క్లాస్)
1.మ్యాట్ సమ్మర్ ఫీల్డ్
2. గ్రాహమ్ పావెల్
3. రిక్ కల్లెట్
అంతర్జాతీయ డ్రైవర్ల రేస్ - II (ప్రో క్లాస్)
1. డేవిడ్ జెన్‌కిన్
2. రిక్ కల్లెట్
3. గ్రాహమ్ పావెల్


Click it and Unblock the Notifications















































































