టాటా సింగూర్ ప్లాంటుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు: అసలేమైంది ?

By Anil

ఎలాగైనా తమ కంటూ ఒక కారు ఉండాలి అనే సామాన్యుల కల నెరవేర్చడానికి భారత దేశపు ఆటోమొబైల్స్‌లో దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా గారు కలలుగన్నారు. అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌక కారును తానే దగ్గరుండి అభివృద్ది చేయించాడు. ఇక ఉత్పత్తి చేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్‌లో సుమారుగా 1000 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పాడు.

అయితే తరువాత కాలంలో అక్కడి ప్రాంత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడ నుండి ప్లాంట్‌ను గుజరాత్‌లోని సనంద్‌ జిల్లాకు తరలించారు. అయితే ఆ భూముల్ని రైతులకు అందజేయనవసరం లేదంటూ కలకత్తా హై కోర్టు టాటా మోటార్స్‌కు అనుగుణంగా తీర్పునిచ్చింది. అయితే మమతా బెనర్జీ గారి చొరవతో కేసు కాస్త సుప్రీం కోర్టును చేరింది. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రైతులకు 12 వారాల్లోపు భూముల్ని తిరిగివ్వాలని ఖంగుతినే తీర్పును వెలువరించింది. టాటా సింగూరు ప్లాంటు గురించి పూర్తి వివరాలు

టాటా నానో సింగూరు ప్లాంటు

టాటా మోటార్స్‌కు పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నానో కార్ల ఉత్పత్తికి సుమారుగా 1000 ఎకరాలను కేటాయించింది. ప్లాంటు నిర్మాణం పూర్తయ్యి త్వరలో ఉత్పత్తి ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు మరియు ఆ ప్రాంత ఎమ్ఎల్ఎ సమక్షంలో ప్లాంటులో ఉత్పత్తికి వ్యతిరేకతను సృష్టించారు. వీరికి వంతుగా సిపిఐ(ఎమ్) పార్టీలు కూడా జై అన్నాయి.

1894 చట్టం ఎంతో కీలకం

1894 చట్టం ఎంతో కీలకం

1894 నాటి భూ అక్రమణల చట్టం ప్రకారం పంటలు పండే సుమారుగా 997 ఎకరాల భూమిలో ప్లాంటు ఏర్పాటు తిరస్కరించింది అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. అయితే సింగూరులోని ఈ ప్లాంటు మీద తీవ్రమైన విమర్శలు రావడంతో ఎట్టకేలకు ప్లాంటును మూసేశారు.

రవీంద్ర భట్టాచార్య

రవీంద్ర భట్టాచార్య

సింగూరు ప్లాంటు ఉన్న ప్రాంతానికి ఎమ్‌ఎల్‌ఎగా ఉన్న అప్పటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీంద్ర భట్టాచార్య ఈ ప్లాంటును అక్కడి నుండి తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఎప్పటికప్పుడు ప్రజలను ఉత్తేజపరుస్తూ సింగూరు ప్లాంటు వ్యతిరేక ఉద్యమాలు చేశాడు.

ప్లాంటు తరలింపు

ప్లాంటు తరలింపు

సింగూరులో నానో ఉత్పత్తి ప్లాంటు మీద రాజకీయ నాయకుల నుండి మరియు ప్రాంతీయ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్లాంటును గుజరాత్‌లోని సనంద్ జిల్లాకు తరలించింది టాటా మోటార్స్. అయితే ఆ భూములను రైతులకు తిరిగివ్వలేదు, దీనికి తోడు అప్పటి కలకత్తా హై కోర్టు టాటా మోటార్స్‌కు మద్దతుగా తీర్పును వెలువరించింది.

టాటా నానో సింగూరు ప్లాంటు

అయితే మమతా బెనర్జీ దీని గురించి ఎక్కువ చొరవ తీసుకోవడంతో కేసు కాస్త దేశ సర్వోన్నత న్యాయ స్థానానం చెంతకు చేరింది. అయితే సుప్రీం కోర్టు టాటా మోటార్స్ మీద ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ సుమారుగా 1000 ఎకరాల వ్యవసాయ భూముల్ని రైతులకు 12 వారాల్లోపు అందజేయాలని తీర్పునిచ్చింది.

ఉపాధి

ఉపాధి

సింగూరులో నానో ఉత్పత్తి ప్లాంటు ప్రారంభమయ్యింటే అక్కడ యువతకు ఉపాధి లభించేది. అయితే ఆ ప్రాంతంఎప్పటిలాగే నిరుద్యోగ సమస్యను మళ్లీ ఎదుర్కుంటోంది.

పశువుల పాకగా

పశువుల పాకగా

భారీ వ్యయంతో తయారైన నానో సింగూరు ప్లాంటు ఎన్నో అనర్థాలకు కారణం అవుతుందనే నెపంతో వచ్చిన వ్యతిరేకతకు ఇలా నిరూపయోగంగా ఇంకా చెప్పాలంటే పశువుల పాకగా మారిపోయింది.

 భారీ ధన నష్టం

భారీ ధన నష్టం

టాటా మోటార్స్ భారీ పెట్టుబడితో తమ ప్లాంటు కార్యకలాపాలకు భారీ షెడ్డులను నిర్మించింది. దీని మీద పెట్టిన సొమ్ము ఎటూ వినియోగంలోకి రాకుండా పోయింది.

నిరుపయోగంగా

నిరుపయోగంగా

సుమారుగా ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ప్లాంటును మూసేశారు, దీనిని టాటా వినియోగించుకోలేకపోయింది మరియు ఇక్కడ ప్రాంతీయ రైతులు వ్యవసాయానికి వినియోగించుకోలేదు. ఏడాదికి మూడు పంటలు పండే ఈ ప్రాంత పరిసరాలు నిర్జీవంగా మారిపోయాయి.

ప్రపంచ స్థాయి నిర్మాణం

ప్రపంచ స్థాయి నిర్మాణం

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌక కారును అభివృద్ది చేసిన టాటా మోటార్స్. ప్రత్యేకంగా నానో కార్ల కోసం మాత్రమే ఈ ప్లాంటును నిర్మించుకుంది. ఇందులో ప్రపంచ స్థాయి సాంకేతికతో, ఆధునిక సదుపాయాలతో, ఆధునిక శైలిలో సింగూరు ప్లాంటును నిర్మించారు.

టాటా నానో సింగూరు ప్లాంటు

  • ప్రపంచ దేశాలన్నీ ఇండియా మీదనే ఆధారపడనున్నాయి...
  • మీరు ఊహించని ఉత్పత్తులు మా వద్ద ఉన్నాయంటున్న మారుతి
  • ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

More from DriveSpark

Article Published On: Thursday, September 1, 2016, 14:13 [IST]
English summary
Tata Motors Suffers Defeat In West Bengal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+