పండుగసీజన్ నాటికి మరో ఫీచర్‌తో టియాగో
టాటా మోటార్స్ సరిగ్గా రెండేళ్ల సమయం తరువాత టియాగో ద్వారా విజయాన్ని అందుకుంది. గత రెండేళ్ల నుండి అంతతమాత్రంగానే అమ్మకాలు సాధిస్తూ ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో విడుదలైన టియాగో హ్యాచ్‌బ్యాక్ ద్వారా అమ్మకాలు అమాంతం పెరిగాయి.
టియాగో అమ్మకాలను మరింతగా పెంచడానికి టాటా మోటార్స్ ఒక అద్బుతమైన నిర్ణయం తీసుకుంది. టియాగో ఆటోమేటిక్‌ట్రాన్స్‌మిషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తే. అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

టాటా మోటార్స్ ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కేవలం పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే అందిస్తోంది. ప్రారంభంలో టాప్ ఎండ్ మరియు మధ్య స్థాయి వేరియంట్లలో అందించనుంది.

అయితే డీజల్ వేరియంట్లలో ఆటోమేటిక్ ఇప్పట్లో లేనట్లే, తరువాత స్టేజ్‌లో డీజల్ వేరియంట్లలో కూడా ఆటోమేటిక్‌ను పరిచయం చేయనున్నారు.

ప్రస్తుతం టియాగో పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 3.20 లక్షలు ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా ఉంది మరియు టియాగో డీజల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.95 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢి(ల్లీ)గా ఉంది.

ఆటోమేటిక్ ఫీచర్ పరిచయం కానున్న వేరియంట్ల యొక్క ధరలు సుమారుగా 30,000 నుండి 40,000 పెంపుతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం మారుతి సుజుకి లోని సెలెరియో మరియు హ్యుందాయ్ లోని గ్రాండ్ ఐ10 లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు. ఈ రెండు మోడళ్లు దీనికి పోటీగా ఉన్నాయి.

టాటా మోటార్స్ ఈ టియాగో ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌ను వచ్చే పండుగ సీజన్ నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.

ఊహించని ఫలితాలను సాధించిన టియాగోలో ఆటోమేటిక్ పరిచయంతో అంచనాలు మరింత పెరిగి ఈ హ్యాచ్‌బ్యాక్‌కు మరింత విలువ చేకూరనుంది.

ఏం చేద్దామని చైనా దీనిని సృష్టించింది
అమెరికా మిలిటరీలో అద్భుతం


Click it and Unblock the Notifications