టియాగో లో మరో వేరియంట్‌ను పరిచయం చేస్తున్న టాటా: పూర్తి వివరాలు

టాటా మోటార్స్ 2017 ఏడాదిలో తమ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను ఆటోమేటిక్ వేరియంట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

By Anil

భారతీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ అత్యంత విజయవంతమైన హ్యాచ్‌బ్యాక్‌ టియాగోను ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) వేరియంట్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. టాటా మోటార్స్ ఇప్పటికే ఈ టియాగో ఆటోమేటిక్ వేరియంట్‌ను పూనేలోని తమ ప్రొడక్షన్ ప్లాంటులో పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.

టాటా టియాగో ఆటోమేటిక్

ఈ ఏడాది టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేసిన టియాగో భారీ సక్సెస్ అందుకుంది. అయితే ఈ మోడల్‌ను ఇప్పుడు ఆటోమేటేడె మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో పరిచయం చేసి అమ్మకాలను పెంచుకునేందుకు టాటా ప్రయత్నిస్తోంది.

టాటా టియాగో ఆటోమేటిక్

ప్రస్తుతం సమాచార వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు టాటా మోటార్స్ ఈ ఏఎమ్‌టి టియాగో మోడల్‌ను వచ్చే 2017 నాటికి విడుదల చేసి పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది.

టాటా టియాగో ఆటోమేటిక్

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లలో గేర్లను చేతితో మార్చాల్సిన పనిలేదు. వేగాన్ని బట్టి గేర్లు వాటంతట అవే మారుతూ ఉంటాయి. దేశీయంగా ఇప్పుడు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ బదులు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లను ఎంచుకోవడంలో ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు.

టాటా టియాగో ఆటోమేటిక్

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్లు మంచి అమ్మకాలు సాధిస్తున్న నేపథ్యంలో టాటా ఈ టియాగోను ఆటోమేటిక్ వెర్షన్‌లో ప్రవేశపెడుతోంది. అయితే మారుతి సుజుకి సెలెరియో మరియు గ్రాండ్ ఐ10 మోడళ్లు ఏఎమ్‍‌టి వేరియంట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ టియాగో ఆటోమేటిక్ వీటితో గట్టి పోటీనే ఎదుర్కోనుంది.

టాటా టియాగో ఆటోమేటిక్

టాటా మోటార్స్ మొత్తం అమ్మకాల సంఖ్య ఈ మధ్య కాలంలో భారీగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో. నవంబర్ 2016 లో టియాగో మంచి అమ్మకాలను నమోదు చేసుకున్న నేపథ్యంలో టాటాతో పోల్చితే మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు కాస్త పడిపోయాయి.

టాటా టియాగో ఆటోమేటిక్

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2016 లో 12,736 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా 12,707 యూనిట్ల విక్రయాలు జరిపింది.

టాటా టియాగో ఆటోమేటిక్

టియాగో అమ్మకాలు కలిసిరావడంతో టాటా మోటార్స్ విక్రయాల్లో భారీ వృద్ది నమోదవుతోంది. అంతే కాకుండా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో కూడా చోటు సాధించింది. ధృడమైన మరియు నూతన డిజైన్ అంశాలతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా టియాగో ఆటోమేటిక్

సాంకేతికంగా టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును అదే విధంగా ఇందులోని 1.05-లీటర్ సామర్థ్యం డీజల్ ఇంజన్ గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు

టాటా టియాగో ఆటోమేటిక్

2017 ఏడాదిని వేదికగా చేసుకుని టాటా మోటార్స్ పలు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అందులో టియాగో ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్, హెక్సా, కైట్ 5 లతో పాటు టాటా తమ కాంపాక్ట్ ఎస్‌యువి నెక్సాన్‌ను కూడా విడుదల చేయనుంది.

టాటా టియాగో ఆటోమేటిక్

  • ఆరు ఎయిర్ బ్యాగులతో అందుబాటులో ఉండే అత్యంత చౌకైన కారు...

More from DriveSpark

Article Published On: Friday, December 23, 2016, 11:35 [IST]
English summary
Tata Tiago AMT To Be Launched In India Next Year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+