టాటా మోటార్స్‌లో నెం.1 కారు టియాగోకు భారీ డిమాండ్
టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల విభాగంలో అక్టోబర్ నెలకు గాను అత్యుత్తమ అమ్మకాలు సాధించే ఉత్పత్తిగా మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. భారీ అమ్మకాలు కారణంగా మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది.
టాటా మోటార్స్ ఈ ఏడాది ఏప్రిల్ లో తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా మోటార్స్ తమ నూతన డిజైన్‌ను టియాగో ద్వారా తొలిసారిగా తమ లైనప్‍లోకి పరిచయం చేసింది. ఆ దెబ్బతో అమ్మకాలు భారీగా నమోదవుతున్నాయి. చాలా ఎళ్ల తరువాత టాటా మోటార్స్ యొక్క ఉత్పత్తికి ఇండియాలో భారీ స్పందన లభించింది.

గడిచిన అక్టోబర్ అమ్మకాల్లో టాటా లైనప్‌లో అత్యుత్తమ విక్రయాలు నమోదు చేసుకున్న వాటిలో టియాగో మొదటి స్థానంలో నిలిచింది.

అక్టోబర్ విక్రయాల్లో 6,108 టియాగో కార్లు అమ్ముడుపోయాయి. గత మూడేళ్ల కాలం వరకు ఈ తరహా అమ్మకాలను టాటా ఎప్పుడూ చవిచూడలేదు. ఈ విధమైన స్పందన రావడం ఇదే మొదటి సారి.

టాటా ప్యాసింజర్ కార్ల విభాగం అక్టోబర్ 2016 లో మొత్తం 16,311 యూనిట్ల విక్రయాలు చేపట్టింది. గతంతో పోల్చుకుంటే 28 శాతం వృద్ది నమోదయ్యింది.

టాటా మోటార్స్ విడుదల చేసిన టియాగో మీద అతి తక్కువ కాలంలో 50,000 యూనిట్ల బుకింగ్స్ జరిగాయి మరియు వాటిలో 25,000 యూనిట్లను డెలివరీ కూడా చేసింది.

తాజా సమాచారం ప్రకారం టాటా మోటార్స్ గుజరాత్ ప్లాంటులో టియాగో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలిసింది. తద్వారా వెయింటింగ్ పీరియడ్ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బుక్ చేసుకున్న వారికి మూడు నుండి నాలుగు నెలల కాలపరిమితితో డెలివరీ ఇస్తున్నారు.

టాటా టియాగో ప్రస్తుతం 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది.

టియాగో పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 23.84 కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 27.28 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

టాటా టియాగో పెట్రలో వేరియంట్ ప్రారంభ ధర రూ. 3.20 లక్షలు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.95 లక్షలు. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

- నమ్మశక్యంగాని నిజం: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ అన్నింటి కన్నా సేఫ్ కారు
- విమాన ఇంజన్ తో నడిచిన ప్రపంచపు మొదటి రైలు
- ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి ? వివరంగా...!!


Click it and Unblock the Notifications








