20,000 ల బుకింగ్ మార్క్ దాటిన టియాగో: ఈ విజయం వెనకున్న ముఖ్య కారణాలు
ఇండియన్ మార్కెట్లో వినియోగదారుల మన్ననలను పొందడానికి టాటా మోటార్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నూతన ఉత్పత్తులను విడుదల చేస్తూనే వచ్చింది. కాని చాలా వరకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అయితే చివరికి వినియోగదారులను మెప్పించగలిగే సరైన ఉత్పత్తిని టియాగో పేరుతో విడుదల చేసి సంచలనాలు సృష్టిస్తోంది.
విడుదలయిన అతి కొద్ది కాలంలోనే విపరీతమైన డిమాండు పొందిన టాటా వారి ఉత్పత్తులలో ఏకైక మోడల్ టియాగో. ఏప్రిల్ 6, 2016 మార్కెట్లోకి విడుదలయిన టియాగో భారీ బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది. అంతే కాకుండా సుమారుగా 1,40,000 మందికి పైగా టియాగో గురించి టాటా డీలర్ల వద్ద విచారణలు చేశారు. అంచనాలకు మించి ఫలితాలను సాధిస్తున్న టాటా టియాగో వెనకున్న అతి ముఖ్యమైన కారణాలను క్రింది కథనంలో చూద్దాం రండి....

బుకింగ్స్
టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసిన కేవలం నెల రోజుల కాలంలోనే 15,000 బుకింగ్స్ నమోదయ్యాయి. దీనికున్న విపరీతమైన ఆదరణతో వీటి బుకింగ్స్ జోరు ఇలాగే కొనసాగుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 20,000 లకు పైగా టయాగో కార్లను బుక్ చేసుకున్నారు. టటా మోటార్స్ చరిత్రలో ఇదో రికార్డ్ కాగా, ప్రస్తుతం టాటా మోటార్స్ వారి బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

డిజైన్
ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువ గమనిస్తున్న అంశం డిజైన్. దీని విజయం వెనకున్న కారణాలలో డిజైన్ ఎంతో ముఖ్యమైనది. బడ్జెట్ విభాగంలోకి అడుగుపెట్టినపప్పటికీ అంతర్జాతీయ డిజైన్ ప్రమాణాలతో టాటా మోటార్స్ దీనిని రూపొందించారు. డిజైన్ ద్వారా పోల్చుకున్నప్పటికీ దీని శ్రేణిలో ఉన్న వాహనాలలో ఇది ఎంతో ఉత్తమంగా నిలుస్తుంది.

ఇంటీరియర్
టాటా మోటార్స్ టియాగో ఇంటీరియర్‌ను డిజైన్ చేసిన శైలి మరెందులోను కనిపించదు. ఇందులో కారు యొక్క ఎక్ట్సీరియర్ రంగును పోలి ఉండేవిధంగా ఎ/సి వెంటులు కలవు. మొదటి సారిగా ఇందులో హార్మన్ వారి ఎమిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఈ సిస్టమ్‌లో ఒకే సారి పది ఫోన్‌లను కనెక్ట్ చేయవచ్చు. తద్వారా ఎవరికి నచ్చిన పాటలను వారు ప్లే చేసుకోవచ్చు, దీని కోసం ఈ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థలో జూకీ మొబైల్ యాప్‌ను అందించారు.

సౌకర్యం
టాటా మోటార్స్ ఇంటీరియర్ స్పేస్‌ను చక్కగా అందింవ్వడంలో ఎన్నడూ వినియోగదారులతో రాజీ పడింది లేదు. అదే తరహాలో ఈ టాటా టియాగో లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉండే విధంగా సీటింగ్ సామర్థ్యాన్ని కల్పించారు. అదే విధంగా తల మరియు కాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఇందులో ప్రయాణించవచ్చు.

ఎంచుకోదగ్గ ఇంజన్ రకాలు
టాటా మోటార్స్ వినియోగుదారులు ఎంచుకుని విధంగా మూడు సిలిండర్లు గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించారు. అందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదేవిధంగా 1.05 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 69 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

డ్రైవింగ్ మోడ్స్
టాటా మోటార్స్ ఈ టియాగోలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లను కూడా రెండు డ్రైవింగ్ మోడ్‌లను పరిచయం చేశారు. అవి, సిటి మరియు ఎకో. సిటి డ్రైవింగ్ మరియు హై వే డ్రైవింగ్‌లకు అనుగుణంగా డ్రైవింగ్ మోడ్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఇందులో కల్పించారు.

మైలేజ్
ఎంట్రీ లెవల్ బడ్జెట్ కార్లు సామాన్యువలను ఎక్కువగా ఆకర్షించడానికి గల ముఖ్య కారణాలు ధర, ఫీచర్లు డిజైన్ మరియు మైలేజ్. వీటిలో ఎక్కువ శాతం మైలేజ్‌ను పరిగణలోకి తీసుకుని కార్లను ఎంచుకుంటారు. అందుకోసం టాటా మోటార్స్ టియాగో కార్లను మైలేజ్‌కు పెట్టింది పేరుగా అభివృద్ది చేశారు. టాటా టియాగో కార్ల మైలేజ్ వివరాలు
- పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 23.84 కిమీలు
- డీజల్ వేరియంట్ లీటర్‌కు 27.28 కిమీలు ఇవ్వగలవు.
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- కార్నరింగ్ స్టెబిలిటి కంట్రోల్
- ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగులు
- టర్న్ బై టర్న్ న్యావిగేషన్
- హర్మాన్ సంస్థ వారి ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్
- జూకి కనెక్టివిటి యాప్ ద్వారా ఒకే సారి 10 స్మార్ట్ ఫోన్‌లను కనెక్ట్ చేయవచ్చు

ప్రత్యేకమైన ఫీచర్లు
టాటా మోటార్స్ వీటిలో ఊహించని స్థాయిలో అత్భుతమైన ఫీచర్లను అందించింది. అవి,

ధర
దీని విజయానికి ఉన్న కారణాలలో ధర అంశం ఎంతో ముఖ్యమైనది. టాటా మోటార్స్ ఎన్నో ప్రత్యేకతలతో అందించిన టియాగో కార్లను అతి తక్కువ ధరకు విడుదల చేసింది. టాటా టియాగో పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 3.32 లక్షలు మరియు టియాగో డీజల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.09 లక్షలుగా ఉంది. టియాగో పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 3.88 లక్షలు మరియు టియగా డీజల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 4.75 లక్షలుగా ఉంది.
(అన్ని ఎక్స్ షోరూమ్ మరియు ఆన్ రోడ్ ధరలు హైదరాబాద్ నగరం లో ఉన్నవి)

వేల కారణాలు
ఇది పట్టణ మరియు పల్లె ప్రాంతాల వాసులకు ఎంతో బాగా సరిపోతుంది ఎందుకంటే ఇందులో అధికంగా 165 ఎమ్ఎమ్ వరకు కల్పించారు. విశాలమైన ఇంటీరియర్, చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థ, డబ్బుకు సరైన విలువ, అత్భుతమైన ఫీచర్లు వంటి ఎన్నో అంశాలు దీని విజయానికి కారణం అయ్యాయి. ఎంతో మంది ఎంచుకుంటున్న దీనిని మరి మీరు ఎంచుకుంటున్నారా ? ఇది కనుక మీకు నచ్చనట్లయితే దానికి గల కారణాలను మాతో పంచుకోండి.....

డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్
మీరు చెల్లించే డబ్బుకు సరైన విలువ గల బెస్ట్ కార్లు

పట్టిందల్లా బంగారమే : మారుతి సుజుకి
లీటర్‌కు 42 కిమీల మైలేజ్: ఇవి పాటిస్తే మీ కారు కూడా ఇస్తుంది


Click it and Unblock the Notifications