భారీగా పెరుగుతున్న టియాగో బుకింగ్‌లు, పెరిగిన వెయిటింగ్ పీరియడ్
టాటా మోటార్స్ ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన టియగోకు విపరీతమైన స్పందన లభిస్తోంది. గడిచిన నాలుగు నెలల కాలంలో సుమారుగా 40,000 బుకింగ్స్ నమోదైనట్లు టాటా అధికారికంగా తెలిపింది. మార్కెట్లోకి విడుదలైన అనతి కాలంలో ఇలాంటి స్పందన రావడం టాటా మోటార్స్ సంస్థకు చాలా అరుదు. మంచి బుకింగ్స్ నమోదవ్వడం వలన వెయింటింగ్ పీరియడ్ కూడా పెరిగిందని పేర్కొన్నారు.

టాటా టియాగోను ఎంచుకునే నగరాన్ని బట్టి వెయింటింగ్ పీరియడ్ సుమారుగా మూడు వరకు ఉన్నట్లు తెలిసింది.

గడిచిన 2016 జూలైలో టాటా సుమారుగా 5,114 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

గడిచిన రెండేళ్ల గణాంకాలను తిరగేస్తే 4,000 యూనిట్లు అమ్మకాలు సంస్థ చరిత్రలో గరిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా రెండేళ్ల తరువాత టియాగో ద్వారా విజయాన్ని అందుకుంది టాటా.

టాటా మోటార్స్ మొత్తం అమ్మకాల్లో టియాగో నుండి 35 శాతం అమ్మకాలు ఉన్నట్లు తెలిసింది.

టియాగో అమ్మకాల్లో ఎక్కువగా 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ టియాగోలు ఉన్నాయి. ఇది సుమారుగా 84బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

టియాగో ఎంట్రీ లెవల్ వేరియంట్ (పెట్రోల్ ఇంజన్) ధర రూ. 3.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దీని మీద 6,000 రుపాయలు అదే విధంగా టియాగోలోని ఇతర శ్రేణి వాహనాల మీద గరిష్టంగా 8,000 రుపాయల వరకు ధరను పెంచారు.

టియాగోలో పెట్రోల్‌తో పాటు డీజల్ కూడా మోస్తారు అమ్మకాలు జరుగుతున్నాయి. టియాగో డీజల్ లో 1.05-సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 69 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల సేల్స్ అధికారి ఎస్ ఎన్ బుర్మాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం టాటా మోటార్స్ అమ్మకాల్లో టియాగో మరియు జెస్ట్ మంచి ఫలితాలను సాధిస్తూ సంస్థ వృద్దికి తోడ్పడుతున్నాయని తెలిపారు.

గత ఏడాది జూలై అమ్మకాల్లో వృద్ది 7 శాతంతో పోల్చుకుంటే ఈ ఏడాది జూలైలో అమ్మకాల వృద్ది 35 శాతానికి పెరిగింది.

- ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక


Click it and Unblock the Notifications








