టియాగో క్రాసోవర్‌ను అభివృద్ది చేస్తున్న టాటా మోటార్స్
భారతీయుల నుండి సానుకూల స్పందను గ్రహించిన టాటా వారి తాజా మోడల్ టియాగో. సరికొత్త టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లోకి 2016 ఏప్రిల్‌లో విడుదల చేసింది. అప్పటి నుండి సుమారుగా 20,000 లకు పైగా బుకింగ్‌లను నమోదు చేసుకుంది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఈ టియాగో విజయాన్నివేదికగా చేసుకుని మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక టాటా మోటార్స్ సందర్శకుల కోసం ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసుకుంది. అందులో చాలా వరకు టాటా కార్లు కొలువుదీరాయి. వాటిలో జికా క్రాసోవర్ కూడా ఒకటి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఝికా వైరస్ అనేది వ్యాప్తి చెందడంతో జికాకు బదులుగా టియగో అనే పేరును మార్చారు. అంటే అప్పటికే ఈ టియాగో క్రాసోవర్ ప్రాణం పోసుకుందన్నమాట.
అయితే ప్రస్తుతం టాటా మోటార్స్ ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును క్రాసోవర్ రూపంలో అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. క్రితం రోజుల్లో చాలా వరకు తయారీ దారులు అమ్మకాలను పెంచుకునేందుకు కొన్నింటిని క్రాసోవర్ సరహాలో కూడా అందించారు. అందులో వోక్స్‌వ్యాగన క్రాస్ పోలో, ఫియట్ అవెంచురా మరియు టయోటా ఎటియోస్ క్రాస్ వంటి ఉత్పత్తులు.
REVIEw: టాటా "జికా" రివ్యూ:
ఇంజన్, పనితీరు వంటి అంశాల పరంగా టియాగో క్రాసోవర్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌తో సమానంగా ఉంటుంది. క్రాసోవర్ ముసుగులో రానున్న టియోగా ఎక్ట్సీరియర్ పూర్తిగా ఆఫ్ రోడ్ వాహనం తరహాలో ఉంటుంది. అదే విధంగా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications