ఎన్నో ఏళ్ల తరువాత విజయపు గాలిని పీల్చిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ ఎన్నో ఏళ్ల తరువాత తమ తాజా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో ఎంట్రీతో విజయపు గాలిని ఆస్వాదిస్తోంది. ఎన్నో ఏళ్ల నుండి కార్ల అమ్మకాల పరంగా వెనుక బడిన టాటా మోటార్స్‌కు తమ టియాగో ద్వారా పూర్వ వైభవం వచ్చింది. కేవలం విడుదలయిన నెల వ్యవధిలోనే 15,000 బుకింగ్‌లు నమోదయ్యాయి.

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి వివిధ రకాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని జెస్ట్, బోల్ట్ మరియు నానో అనే ఉత్పత్తులను సమయానికి అనుగుణంగా అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే సుధీర్ఘ కాలం తరువాత విడుదలైన టాటా వారి టియాగో హ్యాచ్‌బ్యాక్ బారీగా భారతీయుల ప్రజాదరణను పొందుతోంది. వినియోహగదారుల కోణంలో నుండి గమనిస్తే టియాగో ఉత్తమ ప్యాకేజీలతో వచ్చిన సరైన ఉత్పత్తి అని తెలుస్తోంది. ఇందుకు సుమారు 15,000 లకు పైగా వినియోగదారులు ఎంచుకున్న ఎంపికే తెలుపుతోంది.
Also Read:టాటా హెక్సా గురించి మీకు తెలియని విషయాలు
టాటా టియాగో ఈ విధమైన బుకింగ్స్ నమోదు చేసుకోవడానికి ముఖ్య కారణం టియాగో యొక్క ప్రారంభ ధర రూ. 3.2 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) తో అందుబాటులోకి రావడం. మరియు రెండు రకాల ఇంజన్ ఆప్షన్‌లతో విభిన్నమైన ఫీచర్లను కలిగి ఉంటూ ఉత్తమ డిజైన్ వంటి అంశాలు కూడా దీని విజయానికి కారణమయ్యాయి.
Also Read: టాటా "జికా" రివ్యూ: భారతీయ మార్కెట్లో ఒక అద్బుతం
టియాగో విజయంతో ఆనందంలో ఉన్న టాటా మోటార్స్ త్వరలో ఇండియన్ కార్ల మార్కెట్లోకి నెక్సాన్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదలచేయనుంది.


Click it and Unblock the Notifications






















