ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా విడుదల కానున్న టాటా టియాగో

By Anil

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును దేశవ్యాప్తంగా మే 6, 2016 న అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. టాటా మోటార్స్‌కు చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి దీనికి చెందిన సమాచారాన్ని విడుదల చేశారు. వారి సందేశం ప్రకారం టాటా టియాగో కారును బుక్ చేసుకున్న వారు ప్రపంచ ఫుట్ బాల్ ఛాంపియన్ లియొనెల్ మెస్సీను కలుసుకునే అవకాశం పొందొచ్చని తెలిపారు. టియాగో బుకింగ్ ధర రూ. 10,000 గా ఉంది.

టాటా ఈ టియాగోలో రెండు నూతన ఇంజన్‌లను అందించింది. అందులో 1199సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు 1.05-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ 69 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్లను నాలుగు నుండి ఐదు లక్షలు మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఏప్రిల్ ఆరు న జరిగే విడుదల వరకు డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.
టాటా టియాగొ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: మా ప్రతినిధి నుండి సేకరించిన సమాచారం క్రింది కథనంలో....

డిజైన్

డిజైన్

టాటా వారు చరిత్రలో ఈ టియాగొ కారుకు అందించిన రూపం అత్యధ్బుతం. ముఖ్యంగా దీనిని యువతను ఉద్దేశించి డిజైన్ చేశారు. స్పోక్ట్ లెన్స్ గల హెడ్ ల్యాంప్స్ డిజైన్, వెనుక వైపున గల స్పోర్టివ్ బ్లాక్ జెజిల్ టెయిల్ స్పాయిలర్, డోర్ల మీద అలల వంటి డిజైన్ అన్ని కూడా వినియోగదారుల దీనిని కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తుంది.

ఇంటీరియర్

ఇంటీరియర్

దీనిని ఇంటీరియర్ లోపల ఉన్న కొన్ని ప్రత్యేక పరికరాలు రెండు రంగుల జోడింపుతో వచ్చాయి. ప్రక్కన గల ఫోటోను చూసినట్లయితే మీరు రెండు రంగులను గమనించవచ్చు.

ప్రత్యేకమైన మెటీరియల్‌తో

ప్రత్యేకమైన మెటీరియల్‌తో

ఇందులో గల డ్యాష్‌బోర్డు పూర్తిగా కొత్త రకం ప్లాస్టిక్‌తో తయారు కాబడింది. మీరు గమనించిట్లయితే ఎయిర్ కండీషనింగ్ బటన్స్ చుట్టూ కూడా ప్రీమియమ్ మెటీరియల్‌తో తయారు చేశారు.

మల్టీమీడియా

మల్టీమీడియా

ప్రసిద్ద కార్ ఇన్ఫో‌టైన్‌మెంట్ పరికరాలు అందించే హారమ్యాన్ వారి ఇన్ఫోటైన్‌మెంట్ ఇందులో కల్పించారు. ఎనిమిది స్పీకర్లు గల ఆడియో సిస్టమ్, యఫ్.ఎమ్/ఎయమ్, యుయస్‌బి, ఐప్యాడ్, ఎయుఎక్స్ మరియు బ్లూటూత్ వంటి అవకాశాలు ఇందులో కల్పించారు.

లభించు రంగులు

లభించు రంగులు

టాటా టియాగొ కారు ఆరు విభిన్నమైన మెటాలిక్ రంగుల్లో లభించును. అవి తెలుపు, సిల్వర్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్ మరియి బ్లూ.సన్ బరస్ట్ ఆరెంజ్ మరియు బెర్రీ రెడ్ రంగులు కారులోపల గల ఎయిర్ కండీషనింగ్ దారులకు అంటించారు. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉంది.

ఫీచర్లు

ఫీచర్లు

ఈ టాటా టియాగొ కారులో టాటా వారు అధునాతనమైన ఫీచర్లు కల్పించారు. ప్రతి కారులో ఉండవలసిన ముఖ్యమైన ఫీచర్లు సౌకర్యం మరియు సులభంగా కారును శుభ్రం చేసుకునే అవకాశం.

  • టియాగొ స్పోర్టివ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ పోడ్
  • మల్టీ స్టోరేజ్ స్పేస్
  • 242-లీటర్ కెపాసిటి గల బూట్ స్పేస్
  • అన్ని కంట్రోలింగ్స్ ను స్టీరింగ్ వీల్ మీద మౌంట్ చేయబడి ఉండటం
  • వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చలి కోసం గ్లూవ్స్
  • న్యావిగేషన్ సిస్టమ్

    న్యావిగేషన్ సిస్టమ్

    టాటా వారి కార్లలో మొట్టమొదటి సారిగా న్యావిగేషన్‌కు సంభందించిన ఫీచర్లు కల్పించిన కారు "టియాగొ". ఇందులో టర్న్-బై-టర్న్ మైమ్యాప్‌ఇండియా న్యావిగేషన్ అప్లికేషన్ మరియు జుకి-కార్ అప్లికేషన్ ను కల్పించారు. బ్లూటూత్ ద్వారా ఈ రెండు అప్లికేషన్స్‌ను స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేయడం ద్వారా న్యావిగేషన్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

    ఇంజన్

    ఇంజన్

    ఈ టియాగొ కారుకు మరొక పెద్ద అడ్వాంటేజ్ రెండు ఇంజన్‌ ఆప్షన్‌లలో భించడం. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో ఇది లభించును. రెండు ఇంజన్‌లతో అందుబాటులో ఉన్న మొదటి ఎంట్రీలెవల్ కారు కూడా ఇదే.

     1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

    1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

    • ఇంజన్ రకము: మల్టీ డ్రైవ్ యమ్‌పియఫ్ఐ గల మూడు సిలిండర్ల రివట్రోన్ ఇంజన్
    • క్యూబిక్ కెపాసిటి: 1199సీసీ
    • అత్యధిక శక్తి: 84 బిహెచ్‌పి@6000ఆర్‌పియమ్
    • అత్యధిక టార్క్: 114ఎన్ఎమ్ టార్క్@3500ఆర్‌పియమ్
    • ఇంధన ట్యాంకు పరిమాణం: 35-లీటర్లు వరకు నిల్వ చేసుకుంటుంది.
    • ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
    • 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వివరాలు

      1.5-లీటర్ డీజల్ ఇంజన్ వివరాలు

      ఇంజన్ రకము: మల్టీ డ్రైవ్, మూడు సిలిండర్ల రివోటార్క్ ఇంజన్ కలదు.

      క్యూబిక్ కెపాసిటి: 1047 సీసీ

      అత్యధిక శక్తి: 69బిహెప్‌పి@4000ఆర్‌పియమ్

      అత్యధిక టార్క్: 140ఎన్ఎమ్@1800-3000 ఆర్‌పియమ్

      ఇంధన ట్యాంక్ పరిమాణం: 35-లీటర్ల వరకు నిల్వ చేయవచ్చు.

      ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్

      డ్రైవింగ్ మోడ్స్

      డ్రైవింగ్ మోడ్స్

      ఇది రెండు డ్రైవ్‌మోడ్‌లోల అందుబాటులో కలదు.

      1. ఎకో: ఉత్తమ మైలేజ్ కు ఈ మోడ్ ఎంతో ఉపయోగకరమైనది.
      2. సిటి: ఈ మోడ్ ద్వారా ఇంజన్ పవర్ అత్యధికంగా విడుదల అవుతుంది.
       డ్రైవబిలిటి

      డ్రైవబిలిటి

      టాటా టియాగొ ఇంజనీర్లు దనిని స్టీరింగ్‌ను అధ్బుతంగా రూపొందిచారు. మీరు దీనిని ఎలా తిప్పినా సరే వెంటనే ప్రతిస్పందిస్తుంది. మరి దీనిని హ్యాండిల్ చేయడం ఎంతో సులభం, దీనిని తిప్పడానికి తక్కువ శక్తి చాలు. ఇందులో గల డ్రైవర్ స్థానం ఎంతో బాగుంటుంది. ముందు వైపు క్లియర్‌గా చూసుకుంటూ డ్రైవ్ చేయవచ్చు. ఇక ఇందులో గల డీజల్ ఇంజన్ డ్రైవ్ ఎంతో స్మూత్‌‍గా ఉంటుంది. అంటే హ్యుందాయ్ ఐ10 మరియు సెలెరియో కన్నా ఎంతో ఉత్తమం అని చెప్పవచ్చు.

      భద్రత

      భద్రత

      టాటా టియాగొలో గల భద్రత ఫీచర్లు

      • ఎయిర్ బ్యాగ్: డ్రైవర్, ముందువైపు ప్యాసింజర్‌కు
      • సీట్ బెల్ట్: ముందు-3 పాయింట్, వెనుక-3 పాయింట్, మద్యలో-ల్యాప్
      • సెంటర్ లాకింగ్: రిమోట్ ద్వారా లాక్ చేయవచ్చు
      • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్
      • క్లచ్ లాక్
      • ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
      • టాటా టియాగొ ధర

        టాటా టియాగొ ధర

        టియాగొ యొక్క పెట్రోల్ ఎంట్రీలెవల్ ధర దాదాపుగా రూ. 4 లక్షలు ఎక్స్-షోరూమ్ వరకు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర దాదాపుగా 4,75,000 నుండి 5 లక్షల వరకు ఉండవచ్చు. మార్కెట్లో ఈ ధరకు గల హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు మారుతి సుజుకి సెలెరియో లను ఇది వెనక్కు నెట్టగలదు. ఇది వచ్చే ఏడాది అమ్మకాలకు సిద్దం కానుంది.

        అనుకూలతలు

        అనుకూలతలు

        • ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగ్‌లు
        • ఆకర్షణీయమైన ఇంటీరియర్
        • యువతను ఉద్దేశించి తయారు చేసిన డిజైన్
        • అందరిని ఆకట్టుకునే పెట్రోల్ ఇంజన్
        • ఉత్తమ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్
        • అనుకూలతలు

          అనుకూలతలు

          • మృదువైన మరియు మంచి జోరు గల డీజల్ ఇంజన్
          • సౌకర్యవంతమైన క్యాబిన్ మరియు మంచి ఎయిర్ కండీషనర్
          • హార్మాన్ వారి ఆడియో సిస్టమ్ మరియు జుకి కార్ యాప్
          • స్మార్ట్ ఫోన్‌తో కనెక్ట్ కాగల టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ సిస్టమ్
          • టాటా టియాగొ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
            • ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో చూపగల రియర్ పార్కింగ్ సెన్సార్లు.
            • క్లచ్ లాక్ సౌకర్యం
            • డీజల్ ఇంజన్ యొక్క శబ్దం, కుదుపులు పెద్దగా ఉండవు
            • ఆరు మెటాలిక్ రంగుల్లో లభించడం
            • ప్రతికూలతలు

              ప్రతికూలతలు

              • దీని డిజైన్‌లో కొన్ని చోట్ల అలసత్వం ప్రదర్శించారు.
              • స్టార్ట్ చేస్తున్నపుడు ఎక్కువ శబ్దం ఇచ్చే పెట్రోల్ ఇంజన్.
              • ఇందులో గల ఎయిర్ కండీషన్ దారులు కారులోని అన్ని ప్రదేశాలకు గాలిని విస్తరించలేదు.
              •  తీర్పు

                తీర్పు

                మా డ్రైవ్ స్పార్క్ ప్రతినిధి ఈ రెండు కార్లను స్వయంగా నడిపాడు. అతని మాటల్లో: నేను టియాగొ లోని డీజల్ మరియు పెట్రోల్ రెండు వేరియంట్లను కూడా నడిపాను. డీజలా కారును పెద్దగా గుడ్ ఫీలింగ్ రాలేదు. కాని ఈ రెండు కార్లను నడిపిన తరువాత అసలు ఇవి టాటా వారి కార్లేనా అని అనుమానం వచ్చింది. టాటా వారి కార్లలో ఈ టియాగొ ఎంతో గొప్ప ఆవిష్కరణ అని చెప్పవచ్చు. అని తెలిపాడు.

                టాటా టియాగొ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
                • 2016 సంవత్సరానికి గాను బేస్ వేరియంట్లలో ఉన్న బెస్ట్ కార్లు

Article Published On: Wednesday, March 30, 2016, 18:59 [IST]
English summary
Tata Tiago Launch Confirmed For April 6, 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+