సౌత్‌లోకి అడుగుపెట్టిన టాటా టియాగో ప్రారంభం ధర 3.32 లక్షలు
టాటా మోటార్స్ నుండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టియాగో హ్యాచ్‌బ్యాక్ కారు ఈ నెల 6 వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి విడుదలయింది. అయితే టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ ను బెంగళూరు వేదికగా దక్షిణ భారతదేశానికి పరిచయం చేసింది. విడుదల సమయంలో దీని ప్రారంభ ధర రూ. 3.32 లక్షలు ఎక్స్ షోరూమ్ (బెంగళూరు)గా ప్రకటించారు.
టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

టియాగో పెట్రోల్ వేరియంట్ ధర వివరాలు
- ఎక్స్‌బి ధర రూ. 3,32,282లు
- ఎక్స్‌ఎఇ ధర రూ. 3,72,484 లు
- ఎక్స్‌ఎమ్ ధర రూ. 4,02,154 లు
- ఎక్స్‌టి ధర రూ. 4,32,694 లు
- ఎక్స్‌జడ్ ధర రూ. 4,89,019 లు
- ఎక్స్‌బి ధర రూ. 4,08,242లు
- ఎక్స్‌ఎఇ ధర రూ. 4,43,864 లు
- ఎక్స్‌ఎమ్ ధర రూ. 4,83,527 లు
- ఎక్స్‌టి ధర రూ. 5,14,073 లు
- ఎక్స్‌జడ్ ధర రూ. 5,69,409 లు
- పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 23.84 కిలోమీటర్లు
- డీజల్ వేరియంట్ లీటర్‌కు 27.28 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- కార్నరింగ్ స్టెబిలిటి కంట్రోల్
- ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగులు
- టర్న్ బై టర్న్ న్యావిగేషన్
- హర్మాన్ సంస్థ వారి ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్
- జూకి కనెక్టివిటి యాప్ ద్వారా ఒకే సారి 10 స్మార్ట్ ఫోన్‌లను కనెక్ట్ చేయవచ్చు
- పియర్ల్‌సెంట్ వైట్
- ప్లాటినమ్ సిల్వర్
- ఎస్‌ప్రెస్సో బ్రౌన్
- బెర్రీ రెడ్
- సన్‌బరస్ట్ ఆరేంజ్
- స్ట్రైకర్ బ్లూ

టియాగో డీజల్ వేరియంట్ ధర వివరాలు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ బెంగళూరుగా ఉన్నాయి.

ఇంజన్ వివరాలు
టాటా టియాగో రెండు ఇంధన వేరియంట్లలో అందుబాటులో కలదు. అవి పెట్రోల్ మరియు డీజల్.

పెట్రోల్ ఇంజన్
ఇందులో 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల రివట్రోన్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 84 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

డీజల్
టియాగోలో 1.05 లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల రివోటార్క్ డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 69 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

మైలేజ్

డ్రైవింగ్ మోడ్స్
టియాగోలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా ఎకో మరియు సిటి అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ కలవు. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి.

యువతను లక్ష్యంగా చేసుకుని
టాటా మోటార్స్ ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును ముఖ్యంగా యువతను ఉద్దేశించి రూపొందించారు. ముందు ఎంతో ఆకర్షణీయంగా పదునుగా డిజైన్ చేశారు.

ఫ్రంట్ డిజైన్
ముందు వైపున ఉన్న హెడ్ లైట్లను మలిచిన తీరులో ఉన్నాయి. మరియు రెండు హెడ్ ల్యాంప్స్‌ను అనుసంధానం చేస్తూ మధ్యలో చిన్న ఫ్రంట్ గ్రిల్‌ను రూపొందించారు. ఈ ఫ్రంట్ గ్రిల్ క్రింది భాగంలో ఫాగ్ ల్యాంప్స్ కలవు.

ప్రక్క మరియు వెనుక వైపు డిజైన్
దీనికి ముందు వైపున ఉన్న హెడ్‌లైట్ల నుండి ప్రక్క వైపుల మీదుగా వెనుక వరకు అలల వంటి నిర్మాణ శైలి ఉన్న డిజన్ చేశారు. మరియు వెనుక వైపున యాంగులర్ టెయిల్ ల్యాంప్స్ కలవు.

ఇంటీరియర్
ఇంటీరియర్‌లో ముఖ్యంగా ఏ/సి వెంట్‌లు కారు ఎక్ట్సీరియర్ రంగులో ఉంటాయి. మరియు చిల్డ్ గ్లూవ్‌బాక్స్ ఇందులో కలదు.

టియాగోలోని ఫీచర్లు

టియాగోలోని ఫీచర్లు

లభించు రంగులు
టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆరు విభిన్న రంగుల్లో లభించును.

పోటి
టాటా వారి టియాగో హ్యాచ్‌బ్యాక్ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగో మరియు మారుతి సుజుకి వారి సెలెరియో వంటి కార్లకు గట్టి పోటిగా నిలవనుంది.

2016 టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ బెంగళూరు లాంచ్ ఫోటోలు

ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికా
శబ్దానికన్నా 6 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ ప్లేన్
నాగసాకి, హిరోషిమా నగరాల నాశనానికి కారణం ఇదే

Click it and Unblock the Notifications