సంచలనాత్మక విజయంలో టాటా టియాగో: భారీ బుకింగ్స్ కారణంగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్
భారత దేశపు విభిన్న వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల తయారీ రంగంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నంలో మంచి విజయాన్ని సాధించింది. తమ భవిష్యత్ డిజైన్ భాషను పరిచయం చేస్తూ ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన టియాగో ఊహించని రీతిలో సంచలన విజయాలను సాధిస్తోంది.

టాటా మోటార్స్ వారి టియాగో హ్యాచ్‌బ్యాక్ సుమారుగా 50,000 బుకింగ్స్ నమోదు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలైన టియాగోకు కస్టమర్ల నుండి అపారమైన స్పందన లభించింది.

ప్రస్తుతం టియాగోలోని కొన్ని వేరియంట్ల మీద వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలల వరకు ఉంది.

మంచి విజయాన్ని అందుకున్న టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్‌లు కలవు.

పెట్రోల్ వెర్షన్ టియాగో 83.8బిహెచ్పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా డీజల్ వెర్షన్ టియాగో 69బిహెచ్పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లోని రెండు వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనుంది.

టియాగో ద్వారా తననుతాను నిరూపించుకున్న టాటా మోటార్స్ ఇప్పుడు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో మరిన్ని నూతన ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం టాటా మోటార్స్ లోని ఇంజనీర్ల బృందం టియాగో హ్యాచ్‌బ్యాక్ కోసం ప్రత్యేకమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అభివృద్ది చేస్తున్నారు.

టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్‌ను అందించి టియాగో స్పోర్ట్ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది.

టాటా మోటార్స్ లైనప్‌లో 4,000 అమ్మకాలు మైలురాయిన దాటిన అతి కొద్ది ఉత్పత్తుల్లో టియాగో ఒకటి. గడిచిన 2016 సెప్టెంబర్‌లో 4,557 యూనిట్ల టియాగో కార్లు అమ్ముడుపోయి 24 శాతం వృద్దిని సాధించింది.

టియాగో పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 3.20 లక్షల నుండి 4.81 లక్షల మద్య అదే విధంగా డీజల్ టియాగో ధర రూ. 3.94 నుండి 5.60 లక్షల మద్య (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి.

- టాటా టియాగో కొనాలనుకుంటున్నారా ? టియాగో యొక్క ప్రతికూలతలు మరియు ప్రయోజనాలు: సవివరంగా


Click it and Unblock the Notifications








