రెండేళ్ల సుధీర్ఘ కాలం తర్వాత విజయాన్ని అందుకున్న టాటా మోటార్స్

By Anil

టాటా మోటార్స్ గడిచిన జూన్ 2016 లో 4,205 యూనిట్ల టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలు చేపట్టింది. ఈ లెక్కతో దేశ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు రెండేళ్ల తర్వాత ఉత్తమ అమ్మకాలు సాధించిన ఉత్పత్తిగా నిలిచింది ఈ టియాగో...రెండేళ్ల తర్వాత ఏంటి అని సందేహిస్తున్నారా...? మీ సందేహం తీరాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే...!

టాటా టియాగో

రతన్ టాటా గారి అభీష్టం మేరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌకైన కారు అందివ్వాలనే ఉద్దేశ్యంతో అందుబాటులోకి వచ్చిన టాటా నానో రెండేళ్ల క్రితం 4,000 కన్నా ఎక్కువ అమ్మకాలు సాధించింది.

టాటా టియాగో

ఎప్పటిలాగే ఆశించని స్థాయిలో అమ్మకాలను సాధించలేని టాటా మోటార్స్‌కు మార్చి 2014 లో ఊహించని స్థాయిలో నాలుగు వేలకు పైగా అమ్మకాలను సాధించింది.

టాటా టియాగో

నాలుగు వేలు అనే సంఖ్య టాటా మోటార్స్ వంటి పెద్ద సంస్థలకు ఒక లెక్క కాకపోయినప్పటికీ గరిష్ట అమ్మకాల అనేది ఒక మైలురాయిగా ఉటుంది.

టాటా టియాగో

ఆ తర్వాత రెండేళ్ల వరకు అమ్మకాల్లో ఎటువంటి వృద్దిని సాధించలేకపోయింది. కాని ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన టాటా వారి టియాగో హ్యాచ్‌బ్యాక్ మాత్రం టాటా మోటార్స్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది.

టాటా టియాగో

టియాగో గడిచిన జూన్ 2016 అమ్మకాలలో 4,205 యూనిట్ల అమ్మకాలు జరిపి రెండేళ్ల క్రితం నానో నెలకొల్పిన రకార్డును బ్రేక్ చేసింది.

టాటా టియాగో

టాటా టియాగో విజయం కావడానికి గల ముఖ్య కారణాలు డిజైన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ధర ఈ మూడు అంశాలు ఎంతో కలిసొచ్చాయి.

టాటా టియాగో

టాటా టయాగో 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.05 లీటర్ డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లలో అందుబాటులో కలదు.

టాటా టియాగో

పెట్రోల్ ఇంజన్ 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను మరియు డీజల్ ఇంజన్ సుమారుగా 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాటా టియాగో

పెట్రోల్ మరియు డీజల్ రెండు యంత్రాలకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేసారు. అయితే ఈ రెండింటిలో త్వరలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పరిచయం చేయనుంది.

టాటా టియాగో

టియాగో హ్యాచ్‌బ్యాక్ విజయవంతం అయిన నేపథ్యంలో టాటా మోటార్స్ టియాగో ఆధారిత సెడాన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కైట్5 అనే కోడ్ పేరుతో ఇప్పటికే దీనికి పలుమార్లు రహస్య పరీక్షలు నిర్వహించింది. దీనిని ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారుల కోసం సిద్దం చేయనుంది.

టాటా టియాగో

  • భారతీయ వాహన రంగానికి ఆజ్యం పోసిన రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు

Article Published On: Monday, July 11, 2016, 18:46 [IST]
English summary
Tata Tiago — The New Best Selling Car For Tata Motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+