టాటా మోటార్స్ 2016 ఏప్రిల్ అమ్మకాల్లో బెస్స సెల్లింగ్ కారు టాటా టియాగో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వారు ఇండియన్ మార్కెట్లోకి అందించిన టాటా టియాగో కారు మొదటి నెలలో ఆశించిన స్థాయిలో ప్రజాదరణను పొందుతోంది. కేవలం నెల రోజుల కాలంలోనే టియాగోకు సంభందించి లక్ష వరకు విచారణలు వచ్చాయి మరియు 3,022 యూనిట్ల కార్లు అమ్ముడుపోయాయి.

టాటా మోటార్స్ గత నెలలో తమ మొత్తం మోడల్స్ జరిపిన అమ్మకాల్లో టాటా టియాగో అమ్మకాలే ఎక్కువ. గడిచిన 2016 ఏప్రిల్ నెలలో టాటా మోటార్స్ యొక్క ఉత్పత్తుల అమ్మకాలు క్రింది విధంగా ఉన్నాయి.
- టాటా టియాగో - 3,022
- టాటా ఇండియా విస్టా - 1,694
- టాటా ఇండిగో మాంజా - 1,581
- టాటా జెస్ట్ - 1,419
- టాటా నానో - 1,100
- టాటా సుమో - 814
- టాటా సఫారీ స్టార్మ్ - 539
- టాటా బోల్ట్ - 290
- టాటా అరియా - 0
టాటా మోటార్స్ ఈ స్థాయిలో టియాగో అమ్మకాలు సాధించడానికి కారణం టియాగో కార్ల ధరలు బాగా చవకగా ఉండటం వలన అనిపిస్తుంది. టాటా టియాగో పెట్రోల్ ప్రారంభ ధర రూ. 3.2 లక్షలు మరియు టాటా టియాగో డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.94 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
Also Read: భారత దేశపు డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎన్ని దేశాలలో డ్రైవింగ్ అనుమతి ఉందో తెలుసా ?
టాటా మోటార్స్ ఈ టియాగో మూడు సిలిండర్ల 1.2-లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.05-లీటర్ రివోటార్క్ డీజల్ ఇంజన్ ఆప్షన్లో అందించారు. రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో కలవు. త్వరలో టాటా మోటార్స్ ఈ రెండింటిని కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందివ్వాలనే ఆలోచనలో ఉంది.


Click it and Unblock the Notifications