నమ్మశక్యంగాని నిజం: టాటా జెస్ట్ సేఫ్ కారు
నమ్మశక్యం కాని నిజమే... ఎందుకంటే టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ కు గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో 4-స్టార్ రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఉన్న కాంపాక్ట్ సెడాన్‌లలో ఇదే సేఫ్ కారు
టాటా మోటార్స్ కు చెందిన కాంపాక్ట్ సెడాన్ జెస్ట్ కు అంతర్జాతీయ ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది అందరినీ విస్మయానికి గురిచేసింది. టాటా జెస్ట్ లోని రెండు వేరియంట్లు, స్టాండర్డ్ నాన్-ఎయిర్ బ్యాగ్ మరియు ఆప్షనల్ ఎయిర్ బ్యాగులు ఉన్న వేరియంట్ లకు క్రాష్ పరీక్షలు నిర్వహించింది.

టాటా లైనప్‌లో ఉన్న ఎయిర్ బ్యాగులు లేని స్టాండర్డ్ వేరియంట్‌కు భద్రత పరీక్షలు నిర్వహించగా పెద్దల భద్రత పరంగా జీరో స్టార్ మరియు పిల్లల భద్రత పరంగా జరిపిన పరీక్షల్లో వన్-స్టార్ రేటింగ్ పొందింది.

అయితే గ్లోబల్ ఎన్‌సిఎపి టాటా మోటార్స్ లైనప్‌లో ఉన్న మరో జెస్ట్ వేరియంట్ (భద్రత ఫీచర్లను కలిగిన) ను పరీక్షించడానికి మరో అవకాశం కల్పించింది.
టాటా మోటార్స్ తమ జెస్ట్ రేంజ్ లో ఉన్న వేరియంట్లలో కూడా అత్యంత నాణ్యమైన నిర్మాణం గల బాడీని అందించినట్లు గ్లోబల్ ఎన్‌సిఎపి తెలిపింది. ఎయిర్ బ్యాగులు ఉన్న కొత్త వర్షెన్ పరీక్షలు...

టాటా జెస్ట్ లోని డ్యూయల్ ఎయిర్ బ్యాగులు మరియు రెండు ప్రిటెన్షనర్లతో పాటు డ్రైవర్ సీటుకు ఉన్న సీట్ బెల్ట్ రిమైండర్ వంటి గణనీయమైన ఫీచర్ల ద్వారా పెద్దల భద్రత పరంగా జెస్ట్ నాలుగు స్టార్ల రేటింగ్ పొందింది.
ఎయిర్ బ్యాగులు గల కొత్త వర్షన్ జెస్ట్ పిల్లల భద్రత పరంగా రెండు స్టార్ల రేటింగ్ ను పొందినట్లు గ్లోబల్ ఎన్‌సిఎపి తెలిపింది.

క్రాష్ పరీక్షల ప్రకారం టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లు (జెస్ట్ లోని అన్ని వేరియంట్లు) అత్యంత నాణ్యమైన నిర్మాణ శైలిలో ఉన్న బాడీలు కలిగి ఉన్నట్లు తేలింది. ఈ జెస్ట్ లోని డిజైన్ అంశాలను పాటిస్తూ తమ టాటా లైనప్‌లోనికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

గ్లోబల్ ఎన్‌సిఎపి సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ, టాటా మోటార్స్ డిజైన్ శైలి మంచి భద్రతతో కూడుకుని ఉంది. గతంతో పోల్చితే భద్రత అంశాలను మెరుగుపరిచే విషయంలో టాటా మోటార్స్ విజయాన్ని సాధించిందని తెలిపాడు.

భారత దేశానికి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ తమ మోడల్స్ లో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌కు నిర్వహించిన క్రాష్ పరీక్షలు అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు.

గతంలో టాటా మోటార్స్ జెస్ట్ స్టాండర్ట్ వేరియంట్ కు క్రాష్ పరీక్షలు నిర్వహించగా సున్నా ఫలితాలు వచ్చాయి. అయితే భద్రతను పెంపొందించే దిశగా టాటా చేసిన మార్పుల్లో రెండు ఎయిర్ బ్యాగులు మరియు ధృడమైన బాడీ ద్వారా మంచి ఫలితాలను సాధించింది.

టాటా మోటార్స్ లోని జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌కు గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన భద్రత పరీక్షల ఫలితాలు...

- విమాన ఇంజన్ తో నడిచిన ప్రపంచపు మొదటి రైలు:
- జెనాన్ ఫేస్‌లిఫ్ట్ ను 2017 నాటికి విడుదల చేయనున్న టాటా మోటార్స్
- హ్యుందాయ్ ఐ10 స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త శాంట్రో


Click it and Unblock the Notifications








