స్పోర్ట్స్ అవతారంలో టాటా జెస్ట్: అన్ని వేరియంట్లపై అదనపు ధరలే...

By Anil

టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ సుమారుగా 50 వేల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మైలు రాయిని సాధించడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ టాటా మోటార్స్ తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను స్పోర్ట్ ఎడిషన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

టాటా మోటార్స్ స్పోర్ట్స్ వేరియంట్లో అందించిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ లోని అన్ని మోడళ్లలో స్పోర్టీ బాడీ కిట్, గ్రాఫిక్స్, రెయిన్ విసర్స్ మరియు అల్లాయ్ చక్రాలను అందించారు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

అయితే స్పోర్ట్స్ వేరియంట్లో అందుబాటులో ఉన్న జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ల ధరలు కూడా వాటికి అనుగుణంగా పెరిగినట్లు టాటా మోటార్స్ తెలిపింది.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

డిజైన్ పరంగా ముందు వైపు బంపర్, ప్రక్క వైపు స్కర్ట్ మీద మరియు వెనుక వైపు బంపర్‌లను అత్యంత ఆకర్షణీయంగా రెడ్ కలర్ పెయింటింగ్‌ను అందించారు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

వెనుక వైపును గమనించేందుకు అందించిన అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్‌లను ఎరుపు రంగులో అందించారు. స్పోర్టివ్ అవతారంలో కనబడేందుకు కారుకు ఇరువైపులా వికర్ణంగా (Diagonally) మూడు రంగుల్లో (రెడ్, గ్రే మరియు బ్లాక్) స్టిక్కర్లను అంటించారు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

టాటా మోటార్స్ ఈ స్పోర్ట్స్ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ల మీద ఆఫర్లు మరియు బెన్ఫిట్లతో పాటు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌లు కూడా ప్రకటించారు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్ క్రింద 30,000 రుపాయలు, దీనితో పాటు 33,000 రుపాయల విలువైన ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తున్నారు. టాటా మోటార్స్ నుండి గరిష్టంగా 68,000 రుపాయల వరకు లాభపడే అవకాశాలు ఉన్నాయి. మరియు దీనిని కేవలం 3,999 లకే ఇన్‌స్టాల్‌మెంట్‌తో అందిస్తున్నారు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ వేరియంట్ టాటా జెస్ట్‌లో అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

ఇందులోని రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గల గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు. ఇందులోని కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తున్నారు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

టాటా జస్ట్‌లోని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 17.6 కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

టాటా జెస్ట్ స్పోర్ట్స్

అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న టాప్ 5 మేడిన్ ఇండియా కార్లు

ఫ్యూచర్ మొత్తం ఎస్‌విలదే !! వరుసగా విడుదలకు సిద్దమైన SUVలు

More from DriveSpark

Article Published On: Monday, August 22, 2016, 10:37 [IST]
English summary
Tata Zest Sportz Launched At Additional Cost Across Variants
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+