టాటా జికా కారు విడుదల తేదిని అధికారికంగా ప్రకటించిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ నుండి మార్కెట్లోకి విడుదల అవుతున్న లెటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు యొక్క విడుదల తేదిని టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. జికా కారును 2016 జనవరి 20 న లాంఛనంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని టాటా కార్ల శ్రేణిలో ఉన్న టాటా బోల్ట్‌కు క్రింది స్థానంలో ఉంటుందని తెలిపారు.
Also Read: భారతీయ మార్కెట్లో విప్లవం సృష్టించనున్న టాటా "జికా": ఫస్ట్ డ్రైవ్ వివరాలు
టాటా మోటార్స్ వారి సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కారులో మూడు సిలిండర్లు గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు కలవు. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 84బిహెచ్‌పి పవర్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 69 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉండనున్నాయి.
Also Read: టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి వచ్చేసిందోచ్....!!
టాటా జికా కారులో హార్మాన్ మ్యూజిక్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటి, న్యావిగేషన్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు ఇంకా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత పరంగా టాటా మోటార్స్ వారు మంచి ఫీచర్లనే జికా కారులో అందించారు.ఇందులో రెండు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్ మరియు రీయింన్‌ఫోర్స్‌డ్ బాడి వంటి కలవు.
Also Read: టాటా జికా వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10: ఇందులో ఏది ఉత్తమం?
టాటా జికా కారును విడుదల చేయు సమయానికి ధర దాదాపుగా రూ. 4 లక్షల వరకు ఉండవచ్చు. ఇది మార్కెట్లోకి విడుదల అయితే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లకు గట్టి పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications








