గరిష్ట మైలేజ్ ఇవ్వగల టాప్-10 డీజల్ ఎస్‌యువి వాహనాలు

By Anil

టూ వీలర్ నుండి బారీ కార్లు మరియు ఎస్‌యువిల వరకు అన్నింటి విజయం విజయం వెనకున్న ముఖ్యమైన అంశం మైలేజ్. కార్లను తయారు చేసే తయారీదారుల నుండి కొనుగోలు చేసే వినియోగదారుల వరకు దాదాపుగా అందరు దాని యొక్క మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇండియన్ మార్కెట్లో ఎస్‌యువిల సెగ్మెంట్ బాగా పుంజుకుంటోంది. చాలా వరకు భారతీయులు ఎస్‌యువిల వైపు ఎక్కవగా మొగ్గు చూపుతున్నారు. అందుకోసం ఎస్‌యువిల విభాగంలో ఎక్కువ మైలేజ్‌ ఇవ్వగల టాప్-10 వాహనాల గురించి క్రింది కథనంలో అందిస్తున్నాము.

10. మహీంద్రా టియువీ300

10. మహీంద్రా టియువీ300

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎస్‌యువి విభాగం మీద ఎక్కువ శ్రద్ద పెట్టింది అని చెప్పవచ్చు. కెయువి100 మరియు నువోస్పోర్ట్ వాహనాల రేంజ్‌లకు మధ్యలో అందుబాటులోకి తెచ్చిన టియూవీ300 ఈ జాబితాలో 10 స్థానంలో నిలిచింది. ఇందులో 1.5-లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌ కలదు.

మహీంద్రా టియూవీ300 మైలేజ్, ధర వివరాలు

మహీంద్రా టియూవీ300 మైలేజ్, ధర వివరాలు

మైలేజ్: 18.50 కిలోమీటర్/లీటర్

ధర : రూ. 7.36 - 9.64 లక్షలు

09. మహీంద్రా థార్

09. మహీంద్రా థార్

చాలా మంది యువత ఎక్కువగా ఈ మహీంద్రా థార్‌న ఎంచుకుంటున్నారు. ఎస్‌యువి మరియు ఆఫ్ రోడర్‌ ‌గా బాగా పేరు తెచ్చుకుంది. ఇందులో 2.5-లీటర్ డీజల్ మరియు 2.6-లీటర్ డీజల్ ఇంజన్‌‌లు కలవు. ఈ రెండింటిలో 2.6-లీటర్ ఇంజన్ గల థార్ వాహనం ఉత్తమ మైలేజ్ ఇవ్వగలదు.

మహీంద్రా థార్ మైలేజ్, ధర వివరాలు

మహీంద్రా థార్ మైలేజ్, ధర వివరాలు

  • మైలేజ్: 18.60 కిలోమీటర్/లీటర్
  • ధర : రూ. 5.79 - 8.71 లక్షలు
  • 08. రెనో డస్టర్

    08. రెనో డస్టర్

    రెనో ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చిని డస్టర్ ఎస్‌యువి ఇండియన్ మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ డస్టర్ అప్‌డేటెడ్ వర్షెన్‌లో విడుదలయింది. ఇందులో ఉన్న గరిష్ట క్యాబిన్ స్పేస్ ఇప్పుడు మరింత మందిని మెప్పించనుంది. ఈ డస్టర్‌లో మూడు ఇంజన్‌ రకాలు ఉన్నాయి. 1.6-లీటర్ పెట్రోల్ (103బిహెచ్‌పి), 1.5-లీటర్ డీజల్(84బిహెచ్‌పి) మరియు 1.5-లీటర్ (108 బిహెచ్‌పి) వరుసగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

     రెనో డస్టర్ మైలేజ్, ధర వివరాలు

    రెనో డస్టర్ మైలేజ్, ధర వివరాలు

    • ఉత్తమ మైలేజ్ ఇవ్వగల ఇంజన్: 1.5-లీటర్ డీజల్
    • మైలేజ్ : 19.87 కిలోమీటర్/లీటర్
    • ధర : రూ. 8.46 నుండి 13.56 లక్షలు
    • 07. నిస్సాన్ టెర్రానో

      07. నిస్సాన్ టెర్రానో

      నిస్సాన్ టెర్రానో ఎస్‌యువిలో శరీరం నిస్సాన్‌ది మరియు ప్రాణం రెనో డస్టర్. ఎందుకంటే ఇందులో రెనో డస్టర్‌లో ఉన్న అన్ని ఇంజన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న 1.5-లీటర్ డిసిఐ డీజల్ ఇంజన్‌ ఎక్కువ మైలేజ్‌ను ఇవ్వగలదు.

      నిస్సాన్ టెర్రానో మైలేజ్, ధర వివరాలు

      నిస్సాన్ టెర్రానో మైలేజ్, ధర వివరాలు

      • మైలేజ్: 20.45 కిలోమీటర్/లీటర్
      • నిస్సాన్ టెర్రానో ధర : 9.99 నుండి 12.17 లక్షలు
      • 06. హ్యుందాయ్ క్రెటా

        06. హ్యుందాయ్ క్రెటా

        దేశీయంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎస్‌యువిలలో క్రెటా వాటా ఎక్కువగా ఉంది. క్రెటా ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. అయితే క్రెటాలోని 1.4-లీటర్ డీజల్ ఇంజన్ ఉత్తమ మైలే‌జ్‌ని ఇవ్వగలదు.

        హ్యుందాయ్ క్రెటా మైలేజ్, ధర వివరాలు

        హ్యుందాయ్ క్రెటా మైలేజ్, ధర వివరాలు

        • మైలేజ్: 21.38 కిలోమీటర్/లీటర్
        • హ్యుందాయ్ క్రెటా ధర: రూ. 9.15 నుండి 14.40 లక్షలు
        • 05. హోండా బిఆర్‌-వి

          05. హోండా బిఆర్‌-వి

          హోండా మోటార్స్ యొక్క లేటెస్ట్ ఎస్‌యువి బిఆర్ వి ఈ జాబితాలో ఐదవ స్థానంలో చోటు దక్కించుకుంది. ఆ బిఆర్-వి వాహనం 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఉత్తమ మైలేజ్ ఇవ్వగలదు.

          హోండా బిఆర్‌-వి మైలేజ్, ధర వివరాలు

          హోండా బిఆర్‌-వి మైలేజ్, ధర వివరాలు

          • మైలేజ్: 22.90 కిలోమీటర్/లీటర్
          • ధర: రూ. 6.68 నుండి 9.75 లక్షలు
          • 04. ఫోర్డ్ ఎకో స్పోర్ట్

            04. ఫోర్డ్ ఎకో స్పోర్ట్

            ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన ఎకో స్పోర్ట్ ఎస్‌యువిలోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ గల వేరియంట్ అధిక మైలేజ్ ఇవ్వగలదు. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజల్ మరియు 1.0-లీటర్ ఎకోబూస్ట్ వంటి ఇంజన్ రకాలు కలవు.

            ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మైలేజ్, ధర వివరాలు

            ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మైలేజ్, ధర వివరాలు

            • మైలేజ్: 22.30 కిలోమీటర్/లీటర్
            • ధర: రూ. 6.68 నుండి 9.75 లక్షలు
            • 03. మారుతి సుజుకి ఎస్-క్రాస్

              03. మారుతి సుజుకి ఎస్-క్రాస్

              మారుతి సుజుకి సంస్థ యొక్క దాదాపు అన్ని ఉత్పత్తులు అత్బుతమైన మైలేజ్‌ని ఇవ్వగలవు. మారుతి ఎస్-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యువి అమ్మకాల పరంగా కాస్త తడబడుతున్నప్పటికీ మైలేజ్ పరంగా ఎంతో ఉత్తమంగా ఉంది. ఎస్-క్రాస్‌లో 1.3-లీటర్ డిడిఐఎస్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లు కలవు. ఈ రెండింటిలో 1.3-లీటర్ ఇంజన్ ఉత్తమ మైలేజ్ ఇవ్వగలదు.

              మారుతి సుజుకి ఎస్-క్రాస్ మైలేజ్, ధర వివరాలు

              మారుతి సుజుకి ఎస్-క్రాస్ మైలేజ్, ధర వివరాలు

              • మైలేజ్: 23.65 కిలోమీటర్/లీటర్
              • ధర: రూ. 8.03 నుండి 12.03 లక్షలు
              • 02. మారుతి సుజుకి వితారా బ్రిజా

                02. మారుతి సుజుకి వితారా బ్రిజా

                మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో సబ్-నాలుగు మీటర్ల ఎస్‌యువి సెగ్మెంట్లో నెం. 1 గా నిలిచిపోయింది. ప్రస్తుతం మారుతి సుజుకి తమ వితారా బ్రిజా ఎస్‌యువిలో ఫియట్ వారి 1.3 లీటర్ డిడిఐఎస్ ఇంజన్‌ను వినియోగిస్తోంది.

                మారుతి సుజుకి వితారా బ్రిజా మైలేజ్, ధర వివరాలు

                మారుతి సుజుకి వితారా బ్రిజా మైలేజ్, ధర వివరాలు

                • మైలేజ్: 24.3 కిలోమీటర్లు
                • ధర: రూ. 6.99 నుండి 9.68 లక్షలు
                • 01.మహీంద్రా కెయు‌వి100

                  01.మహీంద్రా కెయు‌వి100

                  మహీంద్రా అందిస్తున్నఎస్‌‌యువిలలో అత్యంత సరసమైన ఉత్పత్తి ఈ కెయువి100. చూడటానికి ఎంతో చిన్నగా అనిపించినా ఇందులో సుమారుగా ఆరు మందిక కూర్చునే అవకాశం కలదు. ఈ కెయువి100లో మహీంద్రా దేశీయంగా అభివృద్ది పరిచిన 1.2-లీటర్ జి80 పెట్రోల్ మరియు 1.2-లీటర్ డి75 డీజల్ అనే ఎమ్‌ఫాల్కన్ ఇంజన్‌లను అందించింది. ఈ రెండింటిలో 1.2-లీటర్ డి75 డీజల్ ఇంజన్ ఉత్తమ మైలేజ్‌ను ఇస్తుంది.

                  మహీంద్రా కెయు‌వి100 మైలేజ్, ధర వివరాలు

                  మహీంద్రా కెయు‌వి100 మైలేజ్, ధర వివరాలు

                  • మైలేజ్: 25.3 కిలోమీటర్/లీటర్
                  • ధర: రూ. 4.56 నుండి 7.02 లక్షలు
                  • అధిక మైలేజ్ ఇవ్వగల మరిన్ని వాహనాలు....

                    ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

                    150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు

                    మీరు చెల్లించే డబ్బుకు సరైన విలువ గల బెస్ట్ కార్లు

More from DriveSpark

Article Published On: Friday, May 27, 2016, 12:48 [IST]
English summary
Ten Most Fuel Efficient Diesel SUVs in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+