విడుదల చేసే సమయానికి 130,000 దాటిన టెస్లా మోడల్ 3 బుకింగ్స్
టెస్లా మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా తమ అతి చిన్న మోడల్ 3 సెడాన్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారుగా 35,000 అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు.
టెస్లా మోడల్ 3 కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ధర వివరాలు
టెస్లా మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా తమ అతి చిన్న మోడల్ 3 సెడాన్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారుగా 35,000 అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు.

వేగం
మోడల్ 3 సెడాన్ కారు కేవలం 6 సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మైలేజ్
ఇందులోని బ్యాటరీను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారుగా 346 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

బ్యాటరీ వివరాలు
టెస్లా మోటార్స్ దీని విడుదల సమయంలో ఇందులో వినియోగించిన బ్యాటరీకు చెందిన వివరాలను వెల్లడించలేదు. అయితే ఇందులో ధీర్ఘకాలిక ఎనర్జీని ఇచ్చే సామర్థ్యం గల బ్యాటరీని అందించిన విషయం దీని విడుదల ప్రారంభం సమయంలో తెవలిపారని ఒక పాత్రికేయుడు తెలిపాడు.

అంతే కాకుండా ఈ బ్యాటరీలకు సింగిల్ మరియు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లను అందించినట్లు తెలిపారు

ఈ టెస్లా మోడల్ 3 కారును కాలిఫోర్నియాలోని ఫ్రిమోంట్ లో గల టెస్లా ఫ్యాక్టరీలో తయారు చేశారు.

టెస్లా మోటార్స్‌కు చెందిన మోడల్ ఎస్ సెడాన్ మరియు ఎక్స్ ఎస్‌యుల కాంబిషేన్లను వినియోగించుకుని ఈ మోడల్ 3 కారులో హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ను డిజైన్ చేశారు.

టెస్లా మోటార్స్ ఈ మోడల్ 3 సెడాన్ కారులో సన్‌రూఫ్‌ను కూడా అందించింది.

మోడల్ 3 సెడాన్‌లో ట్యాబ్లెట్ ద్వారా ఆపరేట్ చేసుకునే అవకాశం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ఇందులో ఐదు మంది వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

దీనిని ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాక ముందే దాదాపుగా 13,000 మంది ఈ మోడల్ 3 కారును బుక్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ టెస్లా మోడల్ 3 కారును బుక్ చేసుకున్న వినియోగదారులకు 2017 చివరిలోపు డెలివరీ ఇవ్వనున్నారు.

అమెరికాలో ఈ టెస్లా కార్లకు చెందిన ఛార్జింగ్ సెంటర్లలో ఉచితంగా తమ టెస్లా మోడల్ 3 కారుకు ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

2017 సంవత్సరం చివరికల్లా ప్రస్తుతం ఉన్న టెస్లా మోటార్స్ ఛార్జిగ్ సెంటర్లు రెట్టింపు కానున్నట్లు తెలిపారు.

- విమాన వసతుల్ని తలదన్నే అత్యంత విలాసవంతమైన కారు
- ఖరీదైన ఆడి కారు కొన్న జబర్దస్త్ యాంకర్ అనసూయ


Click it and Unblock the Notifications








