తొమ్మది అంతస్తుల ఎత్తులో వేలాడుతున్న కారు నుండి తప్పుంచుకున్న డ్రైవర్
గాలిలో అత్యంత ఎత్తులో ఉండే ఒక కారులో మీరు ఉంటే ఏం చేస్తారు ? ఎలా బయటపడతారు ? అక్కడకు మాకేంటి పని అయినా కాని ఇలాంటి సినిమాల్లో జరుగుతాయి కాని నిజజీవితంలో ఎందుకు జరుగుతాయి అని అనుకుంటారు కదా ?
కాని ఒక డ్రైవర్ తేరుకుని చూసేసరికి అతను సుమారుగా తొమ్మిది అంతస్తుల ఎత్తులో ఉన్న ఒక కారులో వేలాడుతున్నాడు. తొమ్మిదవ ఫ్లోర్‌లో కార్ పార్కింగ్ కోసం వెళ్లి ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు.

టెక్సాస్‌లో 24 ఏళ్ల వ్యక్తి తన కారును తొమ్మిదవ అంతస్తులో పార్కింగ్ చేయడానికి వెళ్లాడు. అక్కడకు చేరుకున్న తరువాతం కారు బ్రేకులు పడకుండా మొరాయించాయి. బ్రేకులు పడకపోవడంతో అలాగే ముందుకు వెల్లిపోయిన కారును అద్దాలను ఢీ కొట్టి బిల్డింగ్ బయటకు పడిపోయింది. అయితే అక్కడే పెద్ద లోహపు తీగలు ఉండటం వలన కారు అందులో చిక్కుకుంది. 2004 మోడల్‌కు చెందిన టయోటా 4రన్నర్ కారులో ఉన్న ఆ వ్యక్తి ముందుగానే సీట్ బెల్ట్ ధరించి ఉన్నాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
హుటాహుటిన పోలీసు, అగ్ని మాపక మరియు భద్రతా విభాగానికి చెందిన అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ వ్యక్తి మాత్రం కారుకు ఉన్న సన్‌రూఫ్ తెరుచుకుని అధికారుల సాయంతో సురక్షితంగా బయటపడ్డాడు, ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి తప్పించుకున్న తీరును వీడియో ద్వారా గమనించగలరు.


Click it and Unblock the Notifications








