భలే దొంగలు, షోరూమ్ కొల్లగొట్టి 7 క్రెటా కార్లు దొంగలించారు

By Anil

హ్యుందాయ్ మోటార్స్ సరిగ్గా ఏడాది క్రితం క్రెటా ఎస్‌యువిని అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటి నుండి నేటి వరకు కూడా దీని డిమాండ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. భారీ అమ్మకాలను నమోదు చేసుకుంటున్న క్రెటా యొక్క డెలివరీ కూడా చాలా అలస్యంగా ఉంది. దీనికి ఇప్పటకీ వెయిటింగ్ పీరియడ్ ఉంది అంటే అతిశయోక్తి లేదు.

హ్యుందాయ్ క్రెటా

ఇండియన్ మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉండటం మరియు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉండటం వలన దొంగలు క్రితం రోజు తెల్లవారుజామున ఈ క్రెటా కార్లనే టార్గెట్ చేసి దొంగలించారు.

ఈ సంఘటన చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న మనపాక్కం లోని ఉన్న హ్యుందాయ్ షోరూమ్‍‌లో చోటు చేసుకుంది. ముందుగా దొంగలు షోరూమ్‌లోని ప్రవేశించడానికి ముందున్న గేట్లను రాళ్లతో బద్దలు కొట్టి తెల్లవారుజామున సుమారుగా 4 గంటల సమయంలో లోనికి ప్రవేశించారు.

ఆ సమయానికి భద్రతా సిబ్బంది పూర్తి నిద్రలోకి జారుకున్నారు. వెంట తెచ్చుకున్న ఇంధనాన్ని ఏడు క్రెటా కార్లలో నింపి నకిలీ తాళాలతో ఉడాయించారు.
Also Read: భారతదేశంలో అతిగా దోపిడీకి గురవుతున్న కార్లు
అయితే ఈ సంఘటన జరిగన మూడు గంటల తరువాత సుమారు ఐదు కొత్త కార్లకు వలసారవక్కంలో గంగాయ్ అమ్మన్ కోయిల్ వీధిలో నకిలీ నెంబర్ ప్లేట్లను ఫిట్టింగ్ చేస్తుంటే గమనించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే సంభందిత ప్రాంతానికి చెందిన పోలీసులు దొంగరాయుళ్లను వెతికే పనిలో పడ్డారు.

Article Published On: Friday, June 10, 2016, 10:24 [IST]
English summary
Fearless Thieves Raid Hyundai Showroom, Drive Off With 7 New Cretas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+