హెక్సా క్రాసోవర్: టాటా మోటార్స్ నుండి అత్భుతమైన ఉత్పత్తి
టాటా మోటార్స్ ఈ పదం తెలియని భారతీయుడు ఉండడ. ఎందుకంటే దేశీయ ఆటోమొబైల్ రంగానికి ఆజ్యం పోసింది ఇదే కాబట్టి. ఇలాంటి టాటా మోటార్స్ వారు మార్కెట్లోకి హ్యాచ్‌బ్యాక్, సెడాన్ వంటి కార్లతో ఒకరకమైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఎస్‌యువిల మార్కెట్లో టాటా మోటార్స్ వారి ఉత్పత్తులు పెద్దగా స్థానం సంపాదించలేకపోయాయి.
దీనిని కూడా చదవండి: యుద్దానికి సిద్దమవుతున్న ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ
అయితే తాజాగా గత వారంలో ముగిసిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక తమ హెక్సా ఎస్‌యువి క్రాసోవర్‍ను ప్రదర్శించింది. ఇది డిజైన్ పరంగా అత్బుతంగా ఉంది. దీని ఫోటోలను చూస్తే తెలిసిపోతుంది. మరి దీని సాంకేతిక వివరాలు చూస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఎస్‌యువిలు కూడా టాటా హెక్సా దెబ్బకు కుదేలవడం ఖాయం.
మరింత చదవండి: నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిని ప్రదర్శించిన టాటా మోటార్స్
మరి టాటా మోటార్స్ వారి భవిష్యత్తును మార్చనున్న హెక్సా క్రాసోవర్ గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో ఇవ్వబడ్డాయి. ఓ లుక్కేసుకుందాం రండి.

డిజైన్
టాటా మోటార్స్ వారి సొంత ఆఫ్ రోడ్ వాహనాల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆధ్వర్యంలో టాటా హెక్సా క్రాసోవర్‌ను తయారీ చేయనున్నారు. మరియు టాటా జికా హ్యాచ్ బ్యాక్ కారును డిజైన్ ఫ్లాట్ ఆధారంగానే ఈ హెక్సా ఎస్‌యు డిజైన్‌ను అభివృద్ది చేశారు.

టాటా హెక్సా ఇంజన్ వివరాలు
టాటా మోటార్స్ వారు తమ హెక్సా క్రాసోవర్ కారులో 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల వారికోర్ 400 డీజల్ ఇంజన్‌ను అందించారు.

పవర్
ఇందులోని అత్యంత శక్తివంతమైన ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద దాదాపుగా 154.2 బిహెచ్‌పి పవర్ మరియు 1,700 నుండి 2,700 ఆర్‌పిఎమ్ మధ్య దాదాపుగా 400 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
టాటా హెక్సా క్రాసోవర్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్‌గా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను అందించారు. అది ఇంజన్ పవర్‌ను 4-వీల్ డ్రైవ్ ద్వారా నాలుగు చక్రాలకు మరియు స్టాండర్డ్ వేరియంట్లో 2-వీల్ డ్రైవ్ ద్వారా రెండు చక్రాలకు పవర్ అందుతుంది.

డ్రైవింగ్ మోడ్స్ మరియు మైలేజ్
టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది.
- డైనమిక్
- ఆటోమేటిక్
- కంఫర్ట్
- రఫ్ రోడ్
- పొడవు: 4,764 ఎమ్ఎమ్
- వెడల్పు: 1,895 ఎమ్ఎమ్
- ఎత్తు: 1,780 ఎమ్ఎమ్
- వీల్ బేస్: 2,850 ఎమ్ఎమ్
- ఇంస్ట్రుమెంట్ ప్యానెల్
- తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్
- వాయిస్ గుర్తింపు
- న్యావిగేషన్ ఫంక్షన్స్
- ఇంటీరియర్ కలర్
- లెథర్ అప్ హోల్‌స్ట్రే
- లెథర్ తొడుగులు గల స్టీరింగ్ వీల్
- వెనుక కెమెరా అందించే వీయ్ చూసే సౌలభ్యం
- వివిధ రకాల సమాచారాన్ని అందించే కలర్ డిస్ల్పే
- తెలుపు మరియు బ్లాక్ కాంబినేషన్ గల డ్యూయల్ టోన్
- సౌకర్యవంతంగా ఆరు మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం
- ఆటో డిమ్మింగ్ వంటి ఎన్నో అధునాతనమైన ఫీచర్లు కలవు.
- రాత్రి పూట ఇంటీరియర్‌లో లైటింగ్ కోసం ఎల‌్‌ఇడి ఇల్యుమినేటేడ్ ల్యాంప్
- హోండా బిఆర్-వి పూర్తి వివరాల కోసం
- మారుతి సుజుకి వితారా బ్రిజా
- మహీంద్రా ఎక్స్‌యువి ఏరో కాన్సెప్ట్ ఎస్‌యువి మరింత సమాచారం కోసం
హెక్సా లో వినియోగించిన డీజల్ ఇంజన్ దాదాపుగా లీటర్‌కు 13 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

ఎక్ట్సీరియర్ ఫీచర్లు
టాటా మోటర్స్ తమ హెక్సా ఎస్‌యువి లోని ముందు వైపు చక్రాలను ప్రత్యేకంగా 19 అంగుళాలు గల మల్టీ స్పోక్స్ తో తయారు చేశారు, దీనితో పాటు ప్లాట్ బానెట్, హనీ కోంబ్ గల మెష్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రియర్ స్పాయిలర్, బాడీ కలర్‌లో గల డోర్ హ్యాండిల్స్, సైడ్ అద్దాల మీద గల టర్న్ ఇండికేటర్స్, సరికొత్త ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రెండు పొగ గొట్టాలు మరియు అల్యూమినియం స్కిడ్ ప్లేట్లు గల డ్యూయల్ టోన్ బంపర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా హెక్సా క్రాసోవర్ కొలతలు
టాటా మోటార్స్ వారి జికా, కైట్ 5, మరియు నెక్సాన్ అన్ని కూడా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫి ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హెక్సాను ఇదే రీతిలో తయారు చేశారు. హెక్సా కొలతలు ఈ విధంగా ఉన్నాయి.

టాటా హెక్సా ఇంటీరియర్ ఫీచర్లు

టాటా హెక్సా ఇంటీరియర్ ఫీచర్లు

పోటి
టాటా హెక్సా క్రాసోవర్ ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యువి500, రెనో డస్టర్ మరియు నిస్సాన్ వారి టెర్రానో వంటి ఎస్‌యువిలకు ప్రత్యక్షంగా గట్టి పోటిని ఇవ్వనుంది.

ధర
టాటా మోటార్స్ వారు దేశీయంగా తమ క్రాసోవర్ ఎస్‌యువి వాహనాన్ని దాదాపుగా 9.5 లక్షలు ప్రారంభ వేరియంట్ మరియు 15 లక్షలు టాప్ ఎండ్ వేరియంట్ వంటి ధరలతో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications