350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు
సంక్రాంతి గాని లేదా రామ నవమి వచ్చిందంటే అబ్బో ఆ సంబరమే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా బండెనక బండి గట్టి ఎందుల బండ్ల పరుగుపందేలు చూసుంటాం. కాని ఈ మహానుబావులు ఏం చేశారో తెలుసా ? నిటారుగా ఉన్న 350 అడుగుల ఎత్తైన కొండ మీదకు, క్రిందకు జీపులు నడిపారు. నడవాలంటేనే గుండెలోని ప్రాణం గాల్లోకి వెళుతుంది. అలాంటిది ఏకంగా జీపులనే నడిపారు.

వీళ్లు చేసేది సరదాగా అనిపించినా, ఇలాంటి చేయాలంటే ఎవరూ సాహసించలేరు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒకదాని వెంట ఒకటి మూడు వాహనాలతో కొండ మీదకు వరుస కట్టారు.

ఇందులో మొత్తం మూడు జీపులున్నాయి. అందులో నాలుగు మరియు రెండు డోర్లున్న జీపులు ఉన్నాయి.

మూడింటిలో వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ వంటి జీపులున్నాయి.

నేల నుండి 65 డిగ్రీల కోణంతో ఉన్న 350 అడుగుల బండరాయి మీదకు మూడు ఒకదాని వెంట మరొకటి వెళ్లాయి.

ఆ తరువాత మూడు కూడా ఒక దాని వెంట మరొకటి క్రిందకు వచ్చాయి. అయితే వీరు చేసిన సాహసంలో ఎటువంటి అపశృతి చోటు చేసుకోలేదు.

జీప్ సంస్థ తమ 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇదిగో ఇలాంటివి చేసినట్లు తెలిసింది.

మూడు జీపులు కొండ పైకి వెళ్లి క్రిందకు రావడాన్ని వీడియోలో వీక్షించాలనుకుంటే కథనం క్రింది భాగంలో వీడియో కలదు....

విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
ఇన్నోవా క్రిస్టాను ఇష్టపడేవారి కోసం మాత్రమే: విమర్శ


Click it and Unblock the Notifications








