జెనీవా మోటార్ షో వేదిక మీద పది అగ్ర కార్లు
జెనీవాలోని 2016 మోటార్ షో ప్రతినిధుల ప్రదర్శన తరువాత ఇప్పుడు ప్రజలను సందర్శన కోసం ఆటో షోలోనికి అనుమతిస్తున్నారు. చీసల గుపులా వస్తున్న జనాలు అన్నింటిని కాకుండా కొన్ని మోడల్ కార్లను మాత్రమే తిలకిస్తున్నారు.
ఈ ఆటో షో లో ఎక్కువగా యూరోపియన్ సంస్థలు అత్భుతమైన కార్లను ప్రదర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే వీటి మధ్య యుద్దం జరిగిందనే అనొచ్చు. అయితే ఎక్కువ మంది తిలకించడానికి ఆసక్తి చూపిన మరియు జెనీవా మోటార్ షో మొత్తానికి ఉత్తమంగా నిలిచిన టాప్-10 కార్ల గురించి క్రింది కథనం ద్వారా అందివ్వడం జరిగింది.

10. ఆడి క్యూ2
ఆడి క్యూ సిరీస్ కార్లలో క్యూ2 మోడల్ అన్నింటి కన్నా ఎంతో చిన్నగా మరియు చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది.అంతే కాకుండా ఈ క్యూ2 కారు ఐదు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. అతి చిన్న ఇంజన్ 1.4-లీటర్ టిఎస్ఐ 148 బిహెచ్‌పవర్, 2.0-లీటర్ కెపాసిటితో రెండు టిఎఫ్ఎస్ఐ ఇంజన్లు కలవు, ఇవి 187 మరియు 248 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. అదే విధంగా 1.6, 2.0-లీటర్‌తో రెండు టిడిఐ ఇంజన్లు కలవు, ఇవి వరుసగా 115 మరియు 148 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

ఆడి తమ క్యూ2 కారును 2012 లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ప్రదర్శించారు. ఇందులో ఆంబియంట్ లైటింగ్ కోసం ఎల్‌ఇడి వెలుగులు వెదజల్లే లైటింగ్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 8.4-అంగుళాల తాకే తెర కలదు.

09. మసెరాటి లెవంతే
మసెరాటి ప్రదర్శించిన లెవంతే కారును రెండు ఇంధన వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. అవి 3.0-లీటర్ కెపాసిటి గల వి6ఎస్ టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌తో వచ్చాయి. పెట్రోల్‌లోని బేస్ వేరియంట్ 350 బిహెచ్‌పి పవర్ మరియు ఎస్ వేరియంట్ 430 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజల్ ఇంజన్ దాదాపుగా 275 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే మసెరాటి ఈ వేరియంట్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకువస్తోంది.

08. పోర్షే 911 ఆర్
పోర్షే తమ రేసింగ్ కారుకు చెందిన 50 వ జన్మదిన వేడుకల సంధర్బంగా జెనీవా మోటార్ షో వేదిక మీద 911 ఆర్ అనే పేరు ప్రదర్శించారు. పోర్షే ఈ 911 ఆర్ కార్లను 1967 నుండి అందిస్తున్నారు.

ఇందులో 911 జిటి3ఐఆర్‌ఎస్ కారులో వినియోగించిన 4.0-లీటర్ ఇంజన్‌ను అందించారు. ఇది దాదాపుగా 493 బిహెచ్‌పి పవర్ మరియు 460 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 1370 కిలోల బరువున్న ఇది గంటకు 323 కిలోమీటర్లు అత్యధిక వేగంతో పరుగులు పెడుతుంది.

07. ఫెరారి జిటిసి4 లుస్సో
ఫెరారి సంస్థ తమ ఎఫ్ఎఫ్ కారుకు మార్పుగా ఫెరారి లైనప్ ఈ జిటిస4 లుస్సో కారును ప్రవేశ పెట్టింది. ఇందులో 6.3-లీటర్ కెపాసిటి గల వి12 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 681 బిహెచ్‌పి పవర్ మరియు 697 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

నాలుగు చక్రాలకు పవర్ అందడానికి ఇందులోని ఇంజన్‌కు 87-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. మరియు వెనుక చక్రాలను స్టీరింగ్ కంట్రోల్ చేయవచ్చు. ఈ కారు కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 335 కిలోమీటర్లుగా ఉంది.

06. ఆస్టన్ మార్టిన్ డిబి11
జేమ్స్ బాండ్ సరికొత్త కారును తీసుకున్నాడు, దాని పేరు ఆస్టన్ మార్టిన్ డిబి11. ఇది డిజైన్ పరంగా ఎంతో అత్భుతంగా మరియు పనితీరు పరంగా ఎంతో చురుకైనది.

ఆస్టన్ మార్టిన్ డిబి11 కారులో 5.2-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో వి12 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 600 బిహెచ్‌పి మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

05.పినిన్ఫారినా హెచ్2 స్పీడ్
మహీంద్రాకు చెందిన ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ పినిన్ఫారినా జెనీవా మోటార్ షోలో హైడ్రోజన్‌తో శక్తివంతమైన హెచ్2 స్పీడ్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది.

ఇందులో శక్తివంతమైన హైడ్రోజన్ సెల్స్ కలవు. ఇవి దాదాపుగా 496 బహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1420 కిలోల బరువున ఇది కేవలం 3.4 సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

04. పగాని
పగాని సంస్థ జెనీవా మోటార్ షోలో Huayra BC అనే కారును ప్రదర్శించింది. దీనిలో 6.0-లీటర్ కెపాసిటి గల వి12 మెర్సిడెస్ ఇంజన్‌ను అందించారు. ఇది దాదాపుగా 789 బిహెచ్‌పి పవర్ మరియు 1000 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

కేవలం 1218 కిలోలు బరువును మాత్రమే మోయగల ఈ కార్లను 20 వరకు మాత్రమే తయారు చేస్తున్నారు. అందులో వీటిలో ఒక్క దాని ధర దాదాపుగా 2.5 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

03. ల్యాంబోర్గిని సెంటెనేరియా
ల్యాబోర్గిని వ్యవస్థాపకుడు ఫెర్రుసియో ల్యాంబోర్గిని గారి 100 సంవత్సరాలు జన్మదిన వేడుకల సందర్భంగా సెంటెనేరియా కారును ప్రదర్శించినట్లు తెలిపారు. ల్యాంబోర్గిని ప్రస్తుతం వీటిని కేవలం 40 మాత్రమే తయారు చేస్తోంది. అయితే ఇందులో 20 కూపేలు మరియు 20 కన్వర్టిబుల్ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే అన్ని అమ్ముడుపోయాయి.

ఇందులో 6.5-లీటర్ కెపాసిటి గల వి12 ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 759 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 2.8 సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లుగా ఉంటుంది.

02. కోయింగ్‌సెగ్ రిగెరా
కోయింగ్‌సెగా కారును రిగికా గత ఏడాదిలో జరిగిన ఇదే మోటార్ షో వేదిక మీద కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. మరియు దీనిని గత వారంలో జరిగిన మోటార్ షో వేదిక మీద ప్రొడక్షన్ రెడీ కారును ప్రదర్శించింది.

ఇందులో గల ఇంజన్ దాదాపుగా 1479 బిహెచ్‌పి పవర్ మరియు 2000 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇది కేవలం 2.8-సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్లు మరియు 3.9 సెకండ్ల లోపు 150 నుండి 250 కిలోమీటర్లు వరకు చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం 400 కిలోమీటర్ల వరకు ఉంది.

01. బుగాటి చిరాన్
జెనీవా మోటార్ షోలో అన్నింటికన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ చిరాన్ కారు. ఇందులో గల ఇంజన్ దాదాపుగా 1479 బిహెచ్‌పి పవర్ మరియు 1500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కేవలం 2.5 సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని అత్యధిక వేగం గంటకు 420 కిలోమీటర్లు. ప్రస్తుతం బుగాటి కేవలం 500 చిరాన్ కార్లను మాత్రమే తయారు చేస్తోంది. మీరు కూడా దీనిని తీసుకోవాలంటే 2.6 మిలియన్ అమెరికన్ డాలర్లు వెచ్చించాల్సిందే.

- పాత వాటికి ప్రాణం పోస్తే ఇలాగే ఉంటాయి మరి
- లీఫ్ నెలలో టాప్ లేపిన కార్ల అమ్మకాలు
- బొగ్గు గనులలో బయల్పడిన రహస్యమైన కార్లు అవశేషాలు


Click it and Unblock the Notifications








