గత ఆర్థిక సంవత్సరంలో భారీ అమ్మకాలను చవిచూసిన టాప్-10 మోడళ్లు
ప్రతి నెల మరియు ప్రతి ఏడాది అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న టాప్-10 కార్ల గురించి చాలా సార్లు చదువుతూనే ఉంటారు. అందుకే మీకోసం ఇప్పుడు గడిచిన 2015-2016 ఆర్థిక సంవత్సరంలో భారీ అమ్మకాలను చవిచూసిన కార్ల గురించి ప్రత్యేక కథనం.
ఆంగ్లేయుల భవిష్యత్తును సూచించేది ఆంగ్లేయుల నూతన సంవత్సరం, తెలుగు వారి ఏడాది భవిష్యత్తును సూచించేది ఉగాది అధేవిదంగా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ భవిష్యత్తును ప్రభావపరిచేది ప్రతి ఏడాది పరిచయం అయ్యే ఆర్థిక సంవత్సరం. భారతీయుల ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేది ఏప్రిల్ నెలలో. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో గడిచిన 2015-2016 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్మకాలను సాధించిన కార్ల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకోగలరు.

10.హోండా అమేజ్
హోండా మోటార్స్ వారి అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారు 2015 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి 66,703 యూనిట్లు అమ్ముడు పోగా 2016 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి 54,594 యూనిట్ల అమ్ముడుపోయాయి. అయితే రెండు సార్లు కూడా 10 స్థానాన్ని కైవసం చేసుకుంది. వృద్ధిలో 18 శాతం కోల్పోయింది.

హోండా అమేజ్
హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో కలదు. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్లు లీటర్‌కు వరుసగా 17.8 మరియు 25.8 కిలోమీటర్లు ఇవ్వగలదు. మరియు వీటి ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా 5.36 మరియు 6.48 లక్షలుగా ఉంది.

09. హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ మోటార్స్ వారు ఎంట్రీలెవల్ వేరియంట్ కారు ఇయాన్ గత ఏడాది 78,334 యూనిట్ల అమ్మకాలు సాధించి ఆరవ స్థానంలో నిలవగా 2016 ప్రారంభం నాటికి 98,199 యూనిట్ల అమ్మకాలు జరిపి 13 శాతం వృద్ధిని కోల్పోయి తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ వారి ఎంట్రీలెవల్ కారు పెట్రోల్ మరియు ఎల్‌పిజి ఇంధన వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మరియు ఎల్‌పిజి వేరియంట్ల ధరలు వరుసగా 3.24 మరియు 3.91 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. అయితే ఇందులోని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 21.1 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

08. హోండా సిటి
హోండా వారి సెడాన్ కారు సిటి గత ఏడాది ఇదే సమయానికి 77,384 యూనిట్లు సాధించింది మరియు ఇప్పుడు కూడా 77,548 యూనిట్ల అమ్మకాలు జరిపి 0.2 శాతం వృద్ధిని కోల్పోయి ఎనిమిదవ స్థానంలో నిలకడగా నిలిచిపోయింది.

హోండా సిటి
హోండా సిటి సెడాన్ కార్లలో గట్టి పోటిని ఎదుర్కుంటోంది. దీనికి ఇండియన్ మార్కెట్లో ఉన్న ఏకైక పోటిదారు హ్యుందాయ్ వెర్నా. ప్రస్తుతం సిటి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ 7.96 మరియు డీజల్ 9.22 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

07. సెలెరియో
మారుతి సుజుకి వారు ఆల్టో కన్నా కొంచెం ఎక్కువ స్థానంలో అందుబాటులో ఉన్న కారు సెలెరియో ఇది గత ఏడాది ఇదే సమయానికి 68,143 యూనిట్లు అమ్మకాలు సాధించి తొమ్మిదవ స్థానంలో ఉండగా ఏ యేడు ఏకంగా 87,428 యూనిట్లు అమ్మకాలు జరిపి 28 శాతం వృద్దిని నమోదు చేసుకుని ఏడవ స్థానానికి చేరుకుంది.

మారుతి సుజుకి సెలెరియో
ఇందులో పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ల ధరలు 4.03 మరియు 4.82 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

06.హ్యుందాయ్ ఎలైట్ ఐ20
హ్యుందాయ్ మోటార్స్ వారి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎలైట్ ఐ20 గత ఏడాది ఇదే సమయానికి 77,747 యూనిట్ల అమ్మకాలు జరిపి ఏడవ స్థానంలో ఉండగా ప్రస్తుతం 1,26,028 యూనిట్ల అమ్మకాలు జరిపి 62 శాతం వృద్ధిని నమోదు సాధించి ఆరవ స్థానంలో ఉంది.

ఎలైట్ ఐ20
హ్యుందాయ్ వారు ఎలైట్ ఐ20 కారులో శక్తివంతమైన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించింది. అందులో పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.54 లక్షలు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.75 లక్షలుగా ఉన్నాయి.(రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)

05. గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ మోటార్స్ వారి మరొక ఉత్పత్తి గ్రాండ్ ఐ10 కారు గత ఏడాదిలో 99,088 యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో ఉండగా,ఈ ఏడాది ఏకంగా 1,26,181 యూనిట్ల అమ్మకాలు జరిపి 27 శాతం వృద్ధిని సాధించి ఐదవ స్థానంలో ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ వారి గ్రాండ్ ఐ10 కారు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధరలు 4.85 మరియు 5.75 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

04. వ్యాగన్ ఆర్
మారుతి సుజుకి వారి వ్యాగన్ ఆర్ కారు గత ఆర్థిక సంవత్సరంలో 1,61,250 యూనిట్ల అమ్మకాలు సాధించి నాలుగవ స్థానంలో ఉండగా ఈ యేడు దాదాపుగా 1,69,555 యూనిట్ల వ్యాగన్ ఆర్‌లు అమ్ముడుపోయి 5 శాతం వృద్ధితో మళ్లీ నాలుగవ స్థానంలో ఉండిపోయింది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
మారుతి సుజుకి సంస్థ ఈ వ్యాగన్ ఆర్ కారులో 998సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్‌లను అందించింది. ఇవి రెండు 20.5 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. పెట్రోల్ మరియు సిఎన్‌జి ప్రారంభ వేరియంట్ ధరలు 4.08 మరియు 4.63 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

03. స్విఫ్ట్
మారుతి సుజుకి వారి స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ కారు గత ఏడాది 2,01,338 యూనిట్ల అమ్మకాలు సాధించి రెండవ స్థానంలో ఉండగా ఈ యేడు 1,95,043 యూనిట్ల అమ్మకాలు జరిపి 3 శాతం వృద్దిని కోల్పోయి మూడవ స్థానానికి చేరుకుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్
ఈ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు 1197 సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1248 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లు కలవు. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధరలు 4.72 మరియు 5.97 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

02. డిజైర్
మారుతి సుజుకి వారి నాలుగవ ఉత్పత్తి ఈ టాప్-10 జాబితాలో స్థానం సాధించింది. డిజైర్ ఇండియా యొక్క బెస్ట్ కాంపాక్ట్ సెడాన్ కారు అని మరోసారి నిరూపించుకుంది. ఇది గత ఆర్థిక ఏడాదిలో 1,92,010 యూనిట్ల అమ్మకాలు జరిపి మూడవ స్థానంలో ఉండగా, ఈ యేడు 1,99,100 యూనిట్లు అమ్మకాలు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
మారుతి సుజుకి వారు తమ స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారులో 1197సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లను కల్పించింది. ఇవి రెండు కూడా 20.85 మరియు 26.59 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధరలు 5.23 మరియు 26.59 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

01.ఆల్టో
మారుతి సుజుకి వారి మరొక కారు అంటే టాప్-10 లో ఐదవ ఉత్పత్తి. ఇది గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి 2,64,492 యూనిట్లు అమ్మకాలు సాధించగా ఈ యేడు 2,63,422 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అతే అమ్మకాల పరంగా వృద్దిలో స్వల్పంగా 0.4 శాతం కోల్పోయింది.

మారుతి సుజుకి ఆల్టో
ఇందులో 746 సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ కలవు. రెండు కూడా 22.79 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలవు. పెట్రోల్ మరియు సిఎన్‌జి ప్రారంభ వేరియంట్ ధరలు 2.57 మరియు 3.74 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి గత ఏడాదిలో క్రెటా ఎస్‌యువిని విడుదల చేసింది. కేవలం ఎనిమిది నెలల కాలంలోనే దాదాపుగా లక్ష బుకింగ్స్‌ను చేధించింది.ఎస్‌యువిల ద్వారా భారీ అమ్మకాలు సాధించింది. హ్యుందాయ్ క్రెటా గురించి మరింత తెలుసుకోండి.

మారుతి సుజుకి బాలెనో
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన బాలెనో హ్యాచ్‌బ్యాక్ కారు కూడా విశేష ఆదరణ పొందింది. మార్కెట్లోకి విడుదల అయిన అతి కొద్ది కాలంలోనే ప్రతి మాసంలో కూడా టాప్-10 అమ్మకాలు సాధించే విభాగంలోకి చేరిపోయింది. మారుతి బాలెనో గురించి మరింత చదవండి.

రెనో క్విడ్
రెనో క్విడ్, ఎంట్రీ లెవల్ కార్లలో రెనో క్విడ్ ఒక ప్రభంజనం అని చెప్పవచ్చు. ఎంతో కాలం నుండి ఆల్టో తిరుగులేని ప్రయాణం చేసింది. అయికే రాను రాను ఈ పరిస్థితి మారనుంది. ఎందుకంటే క్విడ్ భారీ అమ్మకాలతో మరియు అత్యధిక వెయిటింగ్ పీరియడ్‌ను కూడా ప్రకటించింది. క్విడ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

బేస్ వేరియంట్లలో ఉన్న బెస్ట్ కార్లు
ఏప్రిల్ మరియు మే మధ్య విడుదల కానున్న కొత్త కార్లు
మళ్లీ పుట్టిన నూతనత్వం: టయోటా క్రిస్టా వర్సెస్ టయోటా ఇన్నోవా

ఖరీదైన ఆడి కారు కొన్న జబర్దస్త్ యాంకర్ అనసూయ
గంటకు 200 కి.మీ ల వేగంతో పరుగులు పెట్టే స్పెయిన్ రైలు భారత్‌కు
భయంకరమైన లేజర్ భీమ్ అట్టాక్: కొత్త ముప్పు ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు


Click it and Unblock the Notifications








