భారత దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్-10 కార్లు :...టాప్-10 జాబితాలో మారుతి రాజ్యం !

By Anil

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదిలో కూడా స్వల్ప ఒడిదుడుకుల మధ్య కార్ల విక్రయాలు పుంజుకున్నాయి. అందుకు నిదర్శనం గత నెల కార్ల అమ్మకాలు గత ఏడాది జనవరి నెల అమ్మకాలతో పోల్చితే 0.4 శాతం తక్కువ వృద్ది నమోదు అయ్యింది. అయితే ఈ జనవరి 2016 లో అమ్ముడైన టాప్-10 కార్లలో చాలా వరకు కొత్త కార్లు సంపాదించుకున్నాయి.
Also Read: 2016 ఏడాదిలో వరుసగా విడుదల కానున్న 20 కార్లు
దాదాపుగా పదుల సంఖ్యలో కార్ల సంస్థలు భారితీయ మార్కెట్లోకు తమ కార్లను అందిస్తున్నాయి. అయితే టాప్-10 లిస్ట్‌లో అత్యధికంగా మారుతి సుజుకి వారి ఉత్పత్తులు స్థానం సంపాదించుకున్నాయి. వరుసగా ఆరు కార్లు వరకు వీటివే. అయితే టాప్-10 జాబితాలో చోటు సంపాదించుకున్న కార్ల వివరాలు మరియు వాటిని వినియోగదారులు ఎంపిక చేసుకోవడానికి దోహదపడిన అంశాలు గురించి క్రింది కథనంలో ప్రతి రెండు స్లైడర్ల ద్వారా వివరించడం జరిగింది.

10. హ్యుందాయ్ క్రెటా

10. హ్యుందాయ్ క్రెటా

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీదారులు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి విభిన్న ఉత్పత్తులను తీసుకువచ్చి తమదైన ముద్ర వేసుకుంటోంది. అందుకు నిదర్శనం సెడాన మరియు హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు పోటి పడి టాప్-10 జాబితాలో చోటు సంపాదించుకున్న మొదటి ఎస్‌యువి క్రెటా హ్యుందాయ్ వారి ఉత్పత్తే. గడిచిన నెలలో దాదాపుగా 6,589 క్రెటా వాహనాల అమ్మకాలు జరిపింది.

క్రెటాలోని ముఖ్యమైన అంశాలు.

క్రెటాలోని ముఖ్యమైన అంశాలు.

దేశ వ్యాప్తంగా చాలానే ఎస్‌యువి వాహనలు దీనితో పోటి పడుతున్నాయి. కాని దీనినే ఎక్కువ మంది వినియోగదారులు ఎంపిక చేసుకోవడానికి కారణం, దీని డిజైన్, చక్కటి ఇంజన్ ఆప్షన్లు మరియు అన్నింటికన్నా డీజల్ ఇంజన్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించిన ఏకైక ఎస్‌యువి ఇదే కాబట్టి.

09. మారుతి సుజుకి సెలెరియో

09. మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి వారి బడ్జెట్ కార్లలో ఒకటైన సెలెరియో కారును గత నెలలో దాదాపుగా 7,141 మంది ఎంపిక చేసుకున్నారు. ఈ సెగ్మెంట్లో దీనికి ఇదే పోటీగా నిలవడంతో మంచి అమ్మకాలను నమోదు చేసుకుందని చెప్పవచ్చు.

ఎక్కువ మంది ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు

ఎక్కువ మంది ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు

మారుతి సుజుకి వారు ఈ సెలెరియో కారులో డీజల్ వెర్షన్‌ను అందించిన తరువాత వీటి అమ్మకాలు మరింత ఊపందుకున్నయని తెలిసింది. అంతే కాకుండా ఈ సెలెరియోలో పరిచయం చేసిన ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిసి వచ్చినట్లు తెలిసింది.

08. మారుతి సుజుకి బాలెనొ

08. మారుతి సుజుకి బాలెనొ

మారుతి సుజుకి వారు తమ బాలెనొ కారును పరిచయం చేసి మరొక సరికొత్త శకాన్ని సృష్టించారని చెప్పవచ్చు. మారుతి సుజుకి గడిచిన జనవరి నెలలో దాదాపుగా 7,698 యూనిట్ల అమ్మకాలు జరిపి టాప్-10 లో ఎనిమిదవ స్థానంలో నిలిపారు.

 ముఖ్యమైన అంశాలు

ముఖ్యమైన అంశాలు

మారుతి సుజుకి వారి కార్లలో డిజైన్ మరియు చక్కటి ఇంజన్ అందివ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ రెండింటి అంశాలతో రూపుదిద్దుకున్న కారు బాలెనొ, జపాన్ మరియు యూరోపియన్ మార్కెట్‌కు దేశీయంగా తయారైన బాలెనొ కార్లను ఎగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడం వలన ఇది ఇంతటి విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు.

07. హోండా సిటి

07. హోండా సిటి

భారతీయ మార్కెట్లో మిడ్ హై సెడాన్ సెగ్మెంట్లో రాజ్యాన్ని ఏలుతున్న ఏకైక కారు హోండా సిటి. గత కొద్ది నెలల క్రితం హోండా సిటి టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో స్థానం కోల్పోయింది. అయితే గత జనవరి అమ్మకాలతో ఏకంగా 8,037 యూనిట్లను విక్రయించి టాప్-10 లోని ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది

హోండా సిటి గురించి మరిన్ని వివరాలు

హోండా సిటి గురించి మరిన్ని వివరాలు

ప్రస్తుత దేశీయ మార్కెట్లో ఉన్న సెడాన్ కార్లలో హోండా సిటి కారుతో హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి వారి సియాజ్ కార్లు పోటీ పడుతున్నాయి. కాని వినియోగదారులు ఈ సిటి కారు పట్ల మక్కుల చూపడానికి కారణం మోడిఫైడ్ డిజైన్ మరియు ఉత్తమ ఇంజన్, మైలేజ్‌ని కలిగి ఉండటం అని తెలిసింది.

06. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

06. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

గత ఏడాదిలో బెస్ట్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన కారు ప్రతి నెల కూడా 9,000 నుండి 10,000 మధ్య అమ్మకాలు సాధిస్తోంది. గత నెలలో జరిగిన అమ్మకాలలో దాదాపుగా 9,604 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకుని ఆరవ స్థానంలో నిలిచింది.

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గల హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి వారి స్విఫ్ట్ తరువాత ఇదే అత్యధిక అమ్మకాలు సాధిస్తోంది. మరియు హ్యుందాయ్ వారు దీనిని విడుదల చేసినప్పటి నుండి అత్యధిక అమ్మకాలు సాధించిన కారు కూడా ఇదే. హ్యుందాయ్ వారి చక్కటి డిజైన్, పగటి పూట వెలిగే లైట్లు మరియు ధరకు తగ్గ ఫీచర్లుతో ఉన్న ఏకైక కారుగా దీని అభివర్ణించారు.

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ నుండి టాప్-10 లోని ఐదవ స్థానంలో నిలిచిన మరొక విజయవంతమైన ఉత్పత్తి గ్రాండ్ ఐ10 కారు గడిచిన జనవరి నెలలో 9,934 యూనిట్ల అమ్మకాలు జరిపింది. డిసెంబర్ 2015 లో ప్రకటించిన డిస్కౌంట్ల ఫలితంగా 12,749 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

హ్యాచ్‌బ్యాక్‌లలో అతి తక్కువ ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న కారు ఇదే. కేవలం 4.8 లక్షలు ప్రారంభ ధరతో దాదాపుగా లీటర్‌కు 24 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

04. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్

04. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్

దేశీయ మార్కెట్లో టాల్ బాడీ కలిగిన ఏకైక కారు మారుతి సుజుకి వారి వ్యాగన్-ఆర్. ఒక విధంగా చెప్పాలంటే టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాకు రెగ్యులర్ కస్టమర్ ఈ కారు అనవచ్చు. ప్రతి నెల కూడా 14,000 మార్క్ వరకు అమ్మకాలు జరిరపేది. అయితే జనవరి 2016 లో 12,744 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

దీనిని ఎక్కుమంది ఎంపిక చేసుకోవడానికి ముఖ్యమైన కారణం టాల్ బాడీ, దీని వలన డ్రైవింగ్ అంటే బయపడే వారు దీనిని సులభంగా డ్రైవ్ చేయవచ్చు. కారణం ముందు వైపున క్లియర్‌గా కనపడటానికి క్లియర్ పాయింట్ వ్యూ అనే ఆప్షన్‌తో తయారు చేశారు.

03. మారుతి సుజుకి స్విఫ్ట్

03. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి వారి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి నెల కూడా టాప్-10 జాబితాలో మూడవ నెంబర్‌లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది. మారుతి సుజుకి ప్రతి నెల కూడా 17,000 వరకు స్విఫ్ట్ కార్ల అమ్మకాలు చేపట్టేది. అయితే బాలెనొ కారును ప్రవేశపెట్టిన తరువాత దీని అమ్మకాలలో స్వల్ప తగ్గుముఖం పట్టింది. అయితే 14,057 యూనిట్ల విక్రయాలు జరిపి ఎప్పటిలాగే మూడవ స్థానంలోనే ఉంది.

 ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

భారతీయ రోడ్ల మీద ఎక్కువగా పరుగులు పెడుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో స్విప్ట్ మొదటిది, దీనికి కారణం చక్కటి మైలేజ్, ఇంజన్ మరియు ఆకర్షణీయమైన ధరలతో అత్భుతమైన విశాలమైన ఇంటీరియర్ కలిగి ఉండటం దీని విజయానికి దోహదపడిన అంశాలు అని చెప్పవచ్చు.

02. మారుతి సుజుకి డిజైర్

02. మారుతి సుజుకి డిజైర్

హ్యాచ్‌బ్యాక్ కార్ల కన్నా సెడాన్ కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. కాని భారతీయులు డిజైర్ కారును రెండవ స్థానంలో నిలిపి డబ్బు అనేది ముఖ్యమైన విషయం కాదు అని స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మూడవ స్థానానికి పరిమితం చేశారు. గడిచిన జనవరి 2016 లో 17,587 యూనిట్ల డిజైర్ అమ్మకాలు జరిగాయి.

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

డిజైన్ ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు, ముందు వైపు డిజైన్‌తో పాటు డిజైర్ సెడాన్ కారులో వెనుక వైపున బూట్ క్యాబిన్‌కు అందించిన డిజైన్ చక్కగా ఉంది. ఇక ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలు అన్ని కూడా స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌తో సమానంగా ఉన్నాయి

01. మారుతి సుజుకి ఆల్టో

01. మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి వారి వరుసగా ఆరవ కారు టాప్-10 జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఆల్టో కారు గత నెలలో దాదాపుగా 21,462 యూనిట్లు అమ్మకాలు సాధించింది. దీని ప్రస్థానం ఇప్పటిది కాదు దాదాపుగా దీనిని దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సమయం నుండి ప్రతి ఏడాది, ప్రతి నెలలో టాప్-10 అమ్మకాలలో మొదటి స్థానంలో కొనసాగుతూనే వస్తోంది.

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ఎక్కువ మంది ఎంచుకోవడానికి దోహదపడిన అంశాలు

ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని సామాన్యుల బ్రాండ్ అని అనవచ్చు. తక్కువ ధర, విశిష్టమైన ఫీచర్లు, అత్భుతమైన మైలేజ్ మరియు దేశ వ్యాప్తంగా అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్న డీలర్‌షిప్‌లు మరియు సర్వీసింగ్ పాయింట్లు ఇలాంటి ఎన్నో కారణాలు దీనిని టాప్-10 సెల్లింగ్ కార్లలో మొదటి స్థానానికే పరిమితం చేశాయి.

భారతీయ మార్కెట్లో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి

భారతీయ మార్కెట్లో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందుకు నిదర్శనం గత నెల అమ్మకాలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఉత్పత్తులు టాప్-10 జాబితాలో చోటు సంపాదింతచుకున్నాయి. ఓ వైపు విపకరీతమైన పోటీని ఎదుర్కుంటూ, మరో వైపు నూతన ఉత్పత్తులను తీసుకు వస్తూ మంచి ఫలితాలను నమోదుచేసుకుంటోంది. మారుతి సుజుకి తమను తాము నిరూపించుకుంటోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Article Published On: Monday, February 22, 2016, 16:51 [IST]
English summary
Top 10 Best Selling Cars In January 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+