ఈ కార్లు ఇండియన్ మార్కెట్లో విలవిల అంతర్జాతీయ మార్కెట్లో కలకల

By Anil

కొన్ని వందల సంఖ్యలో వివిధ రకాల మోడల్ కార్లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాని అన్నీ కూడా ఆశించినంత స్థాయిలో అమ్మకాలు సాధించలేకపోతున్నాయి. కాని ఇవే కార్లు అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. అందుకు నిదర్శనం ఇప్పుడు మేము అందిస్తున్న జాబితాలో ఉన్న కార్లు. ఇవి మన మార్కెట్లో తక్కువ అమ్మకాలు సాధించినప్పటికీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా ఎగుమతులైన టాప్-10 కార్లలో వరుసగా ఉన్నాయి. క్రింది కథనంలో ఆ కార్లు ఉన్నాయి.

10. హ్యుందాయ్ క్రెటా

10. హ్యుందాయ్ క్రెటా

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ గత ఏడాది మలి సగంలో క్రెటా ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదలయిన అనతి కాలంలోనే ఇండియన్ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గత ఆర్థిక ఏడాదిలో ఇండియా నుండి అత్యధికంగా ఎగుమతైన వాటిలో 19,442 యూనిట్లు ఎగుమతి అయ్యి పదవ స్థానంలో నిలిచింది ఈ క్రెటా ఎస్‌యువి

09. హ్యుందాయ్ ఐ10

09. హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్‌కు చెందిన మరొక కారు ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారు గడిచిన ఆర్థిక ఏడాది ఫలితాలలో ఐ10 21,133 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే ఎగుమతులలో ఐ10 12 శాతం వృద్దిని కోల్పోయింది.

08. హ్యుందాయ్ జెంట్

08. హ్యుందాయ్ జెంట్

హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన మరొక కారు జెంట్ కాంపాక్ట్ సెడాన్ కారు కూడా ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.సుమారుగా 29,540 యూనిట్లు ఎగుమతి చేసి 48 శాతం వృద్దిని సాధించింది.

07. నిస్సాన్ సన్నీ

07. నిస్సాన్ సన్నీ

ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ అమ్మకాలు సాధించిన వాటిలో నిస్సాన్ సన్నీ కారు స్థానం సంపాదించుకుంది. ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ అమ్మకాలు సాధించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధిస్తోంది. గడిచిన ఆర్థిక ఏడాదిలో సుమారుగా 31,027 సన్నీ కార్లను ఎగుమతి చేసింది నిస్సాన్

06. షేవర్లే బీట్

06. షేవర్లే బీట్

ఇండియన్ మార్కెట్లో ఓ మోస్తారు స్థాయిలో మాత్రమే అమ్మకాలు సాధిస్తోంది ప్రముఖ కార్ల తయారీ సంస్థ షెవర్లేకు చెందిన బీట్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 37,082 యూనిట్ల బీట్ కార్లు ఎగుమతి అయ్యాయి.

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన నాలుగవ ఉత్పత్తి గ్రాండ్ ఐ10 కారు ఎక్కువ ఎగుమతులు సాధించిన జాబితాలో 44,672 యూనిట్లు ఎగుమతి చేసి ఐదవ స్థానంలో నిలిచింది. ఐ10 కారుకు కొనసాగింపుగా గ్రాండ్ ఐ10 కారును అభివృద్ది చేసింది హ్యుందాయ్.

04. మారుతి సుజుకి ఆల్టో

04. మారుతి సుజుకి ఆల్టో

ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధించే ఏకైక కారు మారుతి సుజుకి ఆల్టో అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే స్థాయిలో అమ్మకాలు సాధిస్తోంది. గడిచిన ఆర్థిక ఏడాదిలో సుమారుగా 54,656 యూనిట్లు ఎగుమతులు నమోదయ్యాయి. ఎగుమతుల వృద్దిలో ఆల్టో 73 శాతం వృద్దని సాధించింది.

03. వోక్స్‌వ్యాగన్ వెంటో

03. వోక్స్‌వ్యాగన్ వెంటో

వోక్స్‌వ్యాగన్ వారి వెంటో సెడాన్ ఇండియన్ మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధించలేకపోయినప్పటికీ అంతర్జాతీ మార్కెట్లో భారీగా ఫలితాలనే సాధిస్తోంది. గడిచిన 2016 ఆర్థిక ఏడాదిలో సుమారుగా 63,157 వెంటో కార్లు ఎగుమతి అయ్యాయి.

02. నిస్సాన్ మైక్రా

02. నిస్సాన్ మైక్రా

దేశీయ ఎంట్రీ లెవల్ కార్లలో మైక్రా భారీ స్థాయిలో పోటీని ఎదుర్కుంటూ సరైన ఫలిచాలను సాధించలేకపోతోంది. కాని అంతర్జాతీయ మార్కెట్లో తనకంటూ ఓ పేరు తెచ్చుకుని భారీ అమ్మకాలు బాట పట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 75,456 యూనిట్ల మైక్రా కార్లు ఎగుమతి అయ్యాయి.

01. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

01. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఇండియన్ మార్కెట్ నుండి ఎక్కువ ఎగుమతులు సాధిస్తున్న జాబితాలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మొదటి స్థానంలో ఉంది. సుమారుగా 83,325 యూనిట్ల ఎగుమతులు సాధించి 51 శాతం వృద్దిని నమోదు చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం మారుతి సుజుకి అందుబాటులోకి తీసుకువచ్చిన వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువితో తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది.

ఎక్కువ మంది చదివిన కథనాల కోసం...

కొత్త కారు కొంటున్నారా? డిస్కౌంట్లలో లభ్యమవుతున్న 11 కార్లు

మీరు చెల్లించే డబ్బుకు సరైన విలువ గల బెస్ట్ కార్లు

ఎక్కువ మంది చదివిన కథనాల కోసం...

శిథిలమైన నానో జీవితం: ఊహించిన చిత్రాలతో టాటా నానో ప్లాంట్

రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

More from DriveSpark

Article Published On: Friday, May 6, 2016, 10:13 [IST]
English summary
Top 10 Cars Exported From India In Fy16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+