ఈ మాసంలో కార్లు కొనేవారికి అదిరే ఆఫర్లు ప్రకటించిన సంస్థలు

By Anil

దేశ వాప్తంగా ఉన్న కార్ల తయారీ దారులు ఇండియన్ మార్కెట్లోకి ఎంపిక చేయబడిన కార్ల మీద ఆఫర్లను ప్రకటించాయి. 2016 మే నెలకు గాను కొన్ని సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఒక వేల ఈ నెలలో కారును కొనుగోలు చేయాలనుకుంటే ముందు ఇక్కడ ఉన్న పది కార్లు మరియు వాటి ఆఫర్లను గమనించండి.

10. హ్యుందాయ్ ఇయాన్

10. హ్యుందాయ్ ఇయాన్

కొరియా ఆధారిత కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వారి ఎంట్రీ లెవల్ కారు ఇయాన్ మీద ఎక్స్‌‌ఛ్చేంజ్ ఆఫర్ క్రింద 10,000 వరకు తగ్గింపును మరియు సంభందిత డీలర్ నుండి ఈ కారును కొనుగోలు చేసే వారు సుమారుగా 20,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

09. టాటా నానో

09. టాటా నానో

టాటా మోటార్స్ వారు తమ నానో లోని మ్యాన్యువల్ జెన్‌ఎక్స్ వేరియంట్ మీద ఎక్స్‌చ్చేంజ్ బోనస్‌గా రూ. 20,000 లు మరియు అదనపు ఆఫర్‌గా 15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా నానో సిఎన్‌జి వేరియంట్ మీద 50,000 వరకు ఆఫర్లను ప్రకటించారు.

08.హ్యుందాయ్ ఎలైట్ ఐ20

08.హ్యుందాయ్ ఎలైట్ ఐ20

ఇండియన్ మార్కెట్లో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్లోకి తీవ్ర పోటీని సృష్టిస్తున్న ఎలైట్ ఐ20 కారు మీద హ్యుందాయ్ మోటార్స్ 20,000 ల రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది. ఎలైట్ ఐ20 పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ ఆప్షన్లలో అందుబాటులో కలదు. ఈ రెండు ఆప్షన్ల మీద కూడ ఆఫర్ అందుబాటులో ఉంది.

07. నిస్సాన్ సన్నీ

07. నిస్సాన్ సన్నీ

నిస్సాన్ సంస్థ తమ సన్నీ కారు మీదు సుమారుగా 65,000 రుపాయల వరకు ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంచుకోదగ్గ డీలర్ మరియు ప్రత్యేకమైన సన్నీ వేరియంట్ల మీద మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ సన్నీ కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లో అందుబాటులో ఉండనుంది.

06. టయోటా ఫార్చ్యూనర్

06. టయోటా ఫార్చ్యూనర్

టయోటా మోటార్స్ వారి ఫార్చ్యూనర్ కారుకు మొత్తానికి ఇండియన్ మార్కెట్లో పోటి మొదలైంది. తాజాగా ఫోర్డ్ ఎండీవర్, మిత్సుబిషి పజేరో స్పోర్ట్ మరియు షెవర్లే ట్రయల్ బ్లేజర్ వంటి వాహనాలు దీనికి పోటీగా నిలిచాయి. ప్రస్తుతం మే 2016 గాను ఫార్చ్యూనర్ మధ్య శ్రేణి వాహనాల మీద 50 వేల వరకు మరియు హెచ్చు శ్రేణి వాహనాల ఫార్చ్యూనర్‌ల మీద 75,000 ల రుపాయల వరకు ఆఫర్ ప్రకటించింది.

05. స్కోడా ర్యాపిడ్

05. స్కోడా ర్యాపిడ్

స్కోడా ఆటో సంస్థ దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద ఉన్న ర్యాపిడ్ ఉత్పత్తులను ఎలాగోలా అమ్మేయాలనే ఉద్దేశ్యంతో భారీ స్థాయిలో తగ్గింపును ప్రకటించింది. స్కోడా ర్యాపిడ్ సెడాన్‌లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద కూడా లక్ష రుపాయల వరకు తగ్గింపును ప్రకటించింది.

04. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ

04. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ

మెర్సిడెస్ బెంజ్ తాజా ఎమ్‌ఎల్ పేరుతో ఉన్న కారును జిఎల్‌ఇ లగ్జరీ ఎస్‌‌యువిగా కొత్త పేరుతో విడుదల చేసిది. జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈ జిఎల్‌ఈఇ 350డి కారు మీద సుమారుగా 2 లక్షల వరకు డిస్కౌంటును ప్రకటించింది.

03. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

03. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

ఇండియన్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ వారి ఎంట్రీ లెవల్ వేరియంట్. 2016 ఏడాదికి గాను మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈ ఏ-క్లాస్‌ హ్యాచ్‌బ్యాక్‌ను కొన్ని అప్ డేట్స్‌తో అందించింది. దీని మీద మే 2016 ఆఫర్ల క్రింద సుమారుగా 2.5 లక్షల వరకు డిస్కౌంటును ప్రకటించింది.

02. ఆడి క్యూ5

02. ఆడి క్యూ5

ఆడి క్యూ5 కారు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 మరియు ల్యాండ్ రోవర్ వారి డిస్కవరీ స్పోర్ట్‌ లను పోలి ఉంటుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా అందుబాటులో ఉన్న ఈ క్యూ5 కారు మీద ఆడి సుమారుగా 4 లక్షల వరకు అఫర్లను ప్రకటించింది.

01. బిఎమ్‌‌డబ్ల్యూ ఎక్స్3

01. బిఎమ్‌‌డబ్ల్యూ ఎక్స్3

బిఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్3 కారు ఎస్‌యువి మీద 4 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో ఎక్స్1 నుండి ఎక్స్5 శ్రేణి వరకు కార్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కేవలం కొన్ని ఎంపిక చేసిన డీలర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నట్లు బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.

-మే 2016, లో కార్లు కొనే వారికి అత్బుతమైన ఆఫర్లు

ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు

కార్ల కోసం భవిష్యత్తులో రానున్న పది టెక్నాలజీలు

Article Published On: Monday, May 16, 2016, 18:44 [IST]
English summary
Top 10 New Car Discounts For May 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+