10 లక్షలలోపు బడ్జెట్‌తో ఉత్తమ భద్రత ఫీచర్లు కలిగిన టాప్-10 కార్లు!
భారతీయ మార్కెట్లోకి అత్యంత వేగంతో దూసుకెళ్లే కార్లు చాలానే విడుదల అవుతున్నాయి. అంతే ఎక్కువగా ఘోరమైన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే కార్లలో భద్రతపరమైన మంచి ఫీచర్లు ఉన్నంత వరకు ఎలాంటి భయం అవసరం లేదు. కాని ఏ కారులో మంచి భద్రత ఫీచర్లు ఉన్నాయి, మార్కెట్లో చాలా కార్లు ఉన్నాయి ఇందులో ఏవి ఉత్తమమైన కార్లు అనే సందేహంలో ఉన్నారా ?
భారతీయ మార్కెట్లో 10 లక్షలలోపు బడ్జెట్‌తో మంచి భద్రత ఫీచర్లు ఉన్న టాప్-10 కార్ల గురంచి క్రింది కథనంలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ కారు కావాలో ఎంచుకోండి.

10.వోక్స్‌వ్యాగన్ వెంటో
వోక్స్‌వ్యాగన్ వారి భద్రత అంశాలు మీరు వెంటో కారును ఎంచుకున్నప్పుడు దాని డ్రైవ్‌లోని నాణ్యతను మీరు గ్రహిస్తారు. 10 లక్షలలోపు బడ్జెట్‌తో మార్కెట్లోకి మంచి భద్రత అంశాలతో వెంటో కారును వోక్స్‌వ్యాగన్ అందిస్తోంది.

09. స్కోడా ర్యాపిడ్
స్కోడా వారు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కేవలం నాలుగు మోడల్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే ఇవి ఎంతో ఖరీదుతో కూడుకుట్టప్పటికి స్కోడా వారు తమ ర్యాపిడ్ కారును మంచి సేఫ్టి ఫీచర్లతో 10 లక్షల రుపాయలలోపు ధరతో అందించింది.

08. వోక్స్‌వ్యాగన్ పోలో
వోక్స్‌వ్యాగన్ సంస్థలో లెజెండ్ ఏదంటే పోలో అని నిక్కచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో మంచి ధృడమైన బాడీ, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు రెండు ఎయిర్ బ్యాగ్‌లు కలవు.

07. హ్యుందాయ్ ఐ20 ఆక్టివ్
హ్యుందాయ్ వారి కార్లలో ఎక్కువ మంది ఎంచుకుంటున్న కార్లలో ఐ20 ఆక్టివా కారు ఒకటి. ఇది చూడటానితి క్రాసోవర్ తరహా డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇందులో ముందువైపు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు కలవు.

06. హ్యందాయ్ ఎలైట్ ఐ20
హ్యుందా మోటార్స్ వారు కేవలం ఒక్క నెలలోనే దాదాపుగా 20,000 వేల ఎలైట్ ఐ20 కార్ల అమ్మకాలు జరిపారు. ఇందులో దాదాపుగా ఐ20 ఆక్టివా కారులో గల ఫీచర్లు ఉన్నాయి.

05. టయోటా ఎటియోస్
టయోటా వారి 10 లక్షలలోపు బడ్జెట్ కార్లలో మంచి సేఫ్టి ఫీచర్లు కలగిన కారు టయోటా ఎటియోస్. ఇందులో విశాలమైన క్యాబిన్ స్థలం కలదు మరియు ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

04. టయోటా లివా
టయోటా వారి చక్కటి హ్యాచ్‌బ్యాక్ కారు లివాలో మంచి ఫీచర్లు ఉన్నాయి. అది కూడా పది లక్షలలోపు బడ్జెట్‌లో. ఇందు ముందువైపు రెండు ఎయిర్ బ్యాగులు మరియు యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కలవు.

03. ఫిగో ఆస్పైర్
మంచి డిజైన్ మరియు చక్కటి ఇంధన సామర్థ్యం గల కార్లను అందించడంలో ఫోర్డ్ కార్ల సంస్థ ఇప్పుడు ముందు స్థానంలో ఉంది. ఈ సెడాన్ కారులో రెండు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఇందులో

02. ఫోర్డ్ ఎకోస్పోర్ట్
పోర్ట్ వారి మరొక కారు కాంపాక్ట్ యస్‌యువి ఎకో స్పోర్ట్ ఇందులో కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ మరియు వీటికి అదనంగా ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగ్‌లు కలవు. అన్నింటికంటే ఇది రోడ్ల మీద చక్కటి పనితీరును కనబరుస్తుంది.

01. ఫోర్డ్ ఫిగో
ఫోర్డ్ నుండి టాప్-10 లిస్ట్‌లో వరుసగా మూడు కార్లు ఉన్నాయి. సెడాన్, యస్‌యువి మరియు ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర బ్యాగ్‌లు, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

- 2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు, వాటి వివరాలు
- ధరలు పెంచిన టాప్-10 కార్ల సంస్థలు: ఏ మేరకు పెరిగాయో తెలుసా ?
- 2016 లో విడుదల కానున్న స్కూటర్లు మరియు వాటి వివరాలు


Click it and Unblock the Notifications








