2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో విడుదలకు సిద్దమైన టాప్-10 ఎస్‌యువీలు
2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ఫిబ్రవరి 3 వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న సంగతి మనకు ఇదివరకు తెలిసిందే. అయితే ఈ ఎక్స్ పో వేదిక మీద చాలా వాహన సంస్థలు తమ ఎస్‌యువీలను మరియు క్రాసోవర్ కార్లను ప్రదర్శించడానికి తెగ పోటీ పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ వేదిక మీద విడుదల కానున్న టాప్ -10 ఎస్‌యువీ మురియు క్రాసోవర్ కార్ల గురించి ప్రత్యేక కథనం అందిస్తున్నాము. వీటి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

10. డాట్సన్ గో-క్రాస్
డాట్సన్ గో-క్రాస్ కాన్సెప్ట్ కారును డాట్సన్ వారు 2015 లో జరిగిన టోక్యో మోటార్ షోలో ప్రదర్శించారు. ఇప్పుడు దీనిని 2016 ఇండియన్ అటో ఎక్స్ పోలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

09. మారుతి సుజుకి వైబిఎ కాంపాక్ట్ ఎస్‌యువి
ఎంతో కాలంగా మారుతి సుజుకి మార్కెట్లోకి తమ కాంపాక్ట్ ఎస్‌యువి ని విడుదల చేయాలని అనుకుంటోంది. ఈ ఇండియన్ ఎక్క్ పో ద్వారా దీని కోరిక తీరనుంది. నాలుగు మీటర్లు గల ఈ ఎస్‌యువీ కారు మారుతి సుజుకి అంతర్జాతీయ కాంపాక్ట్ ఎస్‌యువీ వితారా యొక్క డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇది మార్కెట్లోకి విడుదల అయితే ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా టియువి3OO మరియు టాటా వారి అప్ కమింగ్ నెక్సాన్ కారుకు పోటిగా నిలవనుంది.

08. 2016 రెనో డస్టర్ ఫేస్ లిఫ్ట్
రెనో వారికి మంచి విజయాన్ని సాధించి పెట్టిన ఎస్‌యువి రెనో డస్టర్. అందుకే రెనో ఇండియా ప్రస్తుతం ఉన్న డస్టర్ ఎస్‌యువికి కొన్ని మార్పులు చేసి మన ముందుకు ఫేస్ లిఫ్ట్ రూపంలో విడుదల చేయనుంది. అందుకోసం రెనో 2016 ఇండిన్ ఆటో ఎక్స్ పో ను వేదికగా చేసుకోనుంది.

07. టాటా నెక్సాన్
టాటా వారు ఈ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి 2014 లో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం ఉత్పత్తికి సిద్దమైన నెక్సాన్ కారును ప్రదర్శించనున్నారు. ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా టియువి3OO మరియు మారుతి సుజుకి వైబిఎ వంటి వాహనాలకు పోటిగా నిలవనుంది. ఆస్ప్రే అనే కోడ్ పేరుతో పరిచయం అయిన ఈ నెక్సాన్ ఎస్‌యువి 1.3-లీటర్ డీజల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ లో అందుబాటులో ఉండనుంది.

06. టాటా హెక్సా
టాప్ -10 లో రెండవ ఉత్పత్తితో వచ్చిన టాటా మోటార్స్ వారు తమ హెక్సా ఎస్‌యువీ కారుతో హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ ల మీద ప్రతి కారం కోసం అన్నట్లు దీనిని రూపొందించింది. అయితే దీనికంటే ముందుగానే టాటా హెక్సా ఎస్‌యువి 2015 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించబడింది. ఇది 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

05. నిస్సాన్ ఎక్స్-ట్రయల్
జపాన్ కు చెందిన నిస్సాన్ కార్ల సంస్థ ఈ ఎక్స్ -ట్రయల్ ఎస్‌యువీ కారును 2013 లో జరిగిన ఫ్రాంక్ ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శించారు. ఏడు సీట్ల సామర్థ్యం గల ఈ ఎక్స్-ట్రయల్ ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. ఇది 138బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

04. శాంగ్‌యాంగ్ టివోలి
మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ సంస్థ తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యువి టివోలిని దేశీయ మార్కెట్లోకి ఎక్స్ పో వేదిక ద్వారా పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లోకి ఇది రెక్ట్సాన్ అనే వాహనాన్ని మాత్రమే అందబాటులో ఉంచింది.

03.వోక్స్‌వ్యాగన టైగన్
వోక్స్‌వ్యాగన్ వారు దేశీయ మార్కట్లోకి టైగన్ ఎస్‌యువిని విడుదల చేయడానికి సిద్దమైపోయింది. ఈ న్యూజనరేషన్ టైగన్ ఎస్‌యువి 60మీటర్ల పొడవు, 30 మీటర్లు వెడల్పు మరియు 33 మీటర్ల ఎత్తులో కలదు. అయితే ఇది 7-సీటింగ్ కెపాసలో రా
నుంది.

02. హోండా బిఆర్-వి
హోండా మోటార్స్ వారు ప్రస్తుత దేశీయంగా కేవలం సిఆర్-వి అనే ఒక్క ఎస్‌యునే అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 3, 2016 న ప్రారంభం కానున్న ఆటో షోలో దీనిని ప్రదర్శించారు. అయితే దీనికంటే ముందే ఇండోనేషియాలో ఈ బిఆర్-వి ఎస్‌యుని ప్రదర్శించారు. దీని గురించి మరిన్ని వివరాలు కోసం

01. జాగ్వార్ ఎఫ్-పేస్
జాగ్వార్ వారు తమ మొదటి క్రాసోవర్ ను 2015లో జరిగిన ఫ్రాంక్ ఫర్ట్ మోటార్ షో లో ప్రదర్శించారు. అయితే జాగ్వార్ మోటార్స్ సంస్థ ఈ క్రాసోవర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి ఆసక్తి చూపుతోంది. అందుకోసమే దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ప్రదర్శింటచడానికి సిద్దమైపోయింది. ఇది 2.0-లీటర్, 3.0-లీటర్ గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లో అందుబాటులో ఉండనుంది.

- ఫిబ్రవరి 3, నుండి ప్రారంభం కానున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో: మరిన్నివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








