వ్యక్తిగత అవసరాల కోసం అందుబాటులో ఉన్న ఐదు పికప్‌ ట్రక్కులు

By Anil

వ్యాపార మరియు వ్యక్తిగత అవసరాల కోసం రెండింటికి ఉపయోగపడే పికప్ ట్రక్కులు కేవలం కొద్ది సంఖ్యలో మాత్రమే ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రెండు వరుసలలో సీట్లు మరియు వెనుక వైపున కొంచెం సరుకు రవాణా కోసం ట్రాలీ లాంటి నిర్మాణం గల వాహనాలు మీకు రెండు అవసరాలకు ఉపయోగపడతాయి. కుటుంబ సమేతంగా పిక్‌నిక్, టూర్లకు వెళ్లడానికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ పికప్ ట్రక్కుల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇసుజు డి-మ్యాక్స్

ఇసుజు డి-మ్యాక్స్

ఇసుజు మోటార్స్ యొక్క డి-మ్యాక్స్ ట్రక్కు పూర్తిగా వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. సింగిల్ క్యాబిన్‌లో డ్రైవర్ మరియు ప్యాసింజర్ మరియు మిగిలిని ప్రదేశాన్ని లోడ్ చేసుకోవడానికి కేటాయించారు. ఇసుజు మోటార్స్ తాజాగా నెల్లూరులోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించారు.

వ్యక్తిగత అవసరాల కోసం ఉన్న ఐదు ఉత్తమ పికప్ ట్రక్కులు

ఇసుజు మోటార్స్ ఇందులో 2.5 లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందించింది, ఇది సుమారుగా 134 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 14.1 కిమీల మైలేజ్ ఇవ్వగల ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఈ ట్రక్కులోని లోడ్ సామర్థ్యం 1555 కిలోలుగా ఉంది.

2. మహీంద్రా ఇంపీరియో

2. మహీంద్రా ఇంపీరియో

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి ఇంపీరియో పికప్ ట్రక్కును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో సింగిల్ క్యాబిన్ మరియు డబుల్ క్యాబిన్ వేరియంట్లో అందించారు. మీ అవసరాలకు తగ్గట్లు ఎంచుకునే అవకాశాం కల్పించారు.

వ్యక్తిగత అవసరాల కోసం ఉన్న ఐదు ఉత్తమ పికప్ ట్రక్కులు

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఇంపీరియో ట్రక్కులో 2.5 లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జడ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 75 బిహెచ్‌పి పవర్ మరియు 220 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. 13.55 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఈ ట్రక్కులో గరిష్టంగా 1240 కిలోల బరువును రవాణా చేయవచ్చు.

3. మహీంద్రా బొలెరో ఛాంపర్

3. మహీంద్రా బొలెరో ఛాంపర్

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మరొక ఉత్పత్తి బొలెరో ఛాంపర్, క్యాబిన్ మరియు ట్రక్‌ ఆప్షన్‌లో ఉన్న ఇది పూర్తిగా ఎస్‌యువి తరహాలో కూడా అందుబాటులో ఉంది. ఈ బొలెరొ ఛాంపర్ క్యాబిన్‌లో ఆరు మంది వరకు ప్రయాణించవచ్చు మరియు దీని వెనకున్న ట్రాలీలో 945 కిలోల లోడ్‌ను నింపవచ్చు.

వ్యక్తిగత అవసరాల కోసం ఉన్న ఐదు ఉత్తమ పికప్ ట్రక్కులు

బొలెరొ ఛాంపర్ వాహనంలో 2.5 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు, ఇది 62 బిహెచ్‌పి వవర్ మరియు 195 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇంజన్ పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు లేదా నాలుగు చక్రాలకు అందుతుంది. ఇది లీటర్‌కు 13 కిలోమీటర్ల మైలేజ్‌నిస్తుంది.

4. టాటా జెనాన్ ఎక్స్‌టి

4. టాటా జెనాన్ ఎక్స్‌టి

ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన పికప్‌ ట్రక్కులలో ఇది ఒకటి. ఇందులో రెండు వరుసలలో సీట్లున్న క్యాబిన్ కలదు. దీనికి చివరిలో ఉన్న చిన్న ట్రాలీలో కేవలం 260 కిలోల లోడ్ సామర్థ్యాన్ని ఇచ్చారు టాటా మోటార్స్.

వ్యక్తిగత అవసరాల కోసం ఉన్న ఐదు ఉత్తమ పికప్ ట్రక్కులు

జెనాన్ ఎక్స్‌టి వాహనంలో 2.2 లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 138 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ నాలుగు చక్రాలకు లేదా ముందు చక్రాలకు మాత్రమే అందే విధంగా ఆప్షన్‌ను కల్పించారు.

5. మహీంద్రా స్కార్పియో గేట్‌వే

5. మహీంద్రా స్కార్పియో గేట్‌వే

మహీంద్రా అండ్ మహీంద్రా వారి మూడవ ఉత్పత్తి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇది అచ్చం స్కార్పియో ఎస్‌యువిని పోలి ఉంటుంది. కాని దీని చివరి భాగంలో లగేజ్ బాడీని అందించారు. అందుకోసం దీనిని స్కార్పియో గేట్‌వేగా పిలుస్తున్నాం.

వ్యక్తిగత అవసరాల కోసం ఉన్న ఐదు ఉత్తమ పికప్ ట్రక్కులు

ఇందులో 2.6 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 277 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ ద్వారా ఇంజన్ విడుదల చేసే పవర్ ముందు చక్రాలకు అందుతుంది.

వ్యక్తిగత అవసరాల కోసం ఉన్న ఐదు ఉత్తమ పికప్ ట్రక్కులు

భారత్‌లో ఉన్న ఉత్తమ ట్రాక్టర్ కంపెనీలు: మీ ట్రాక్టర్ ఈ జాబితాలో ఉందా..?

More from DriveSpark

Article Published On: Friday, June 3, 2016, 10:53 [IST]
English summary
Best 5 Pick-Up Trucks For Personal Use In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+