భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఐదు సెడాన్ కార్లు

By Anil

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న కొన్ని కార్ల సంస్థలు అమ్మకాల పరంగా తీవ్ర మందగమనంలో ఉన్నాయి. చాలా వరకు కొత్త కార్లు వస్తుండటం వలన కొద్దిగా పాత మోడళ్లు సరైన అమ్మకాలు సాధించలేకపోతున్నాయి. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కార్లు వస్తుండటం వలన ముందు నుండి అందుబాటులో ఉన్న కొన్ని సెడాన్ కార్లు అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఎలాగైనా సరే వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని సంస్థలు తమ సెడాన్ కార్ల మీద అత్భుతమైన ఆఫర్లను ఇస్తున్నాయి. 2016 జూన్‌లో ఉత్తమ డిస్కౌంట్లను ప్రకటించి ఐదు సెడాన్ కార్ల గురించి క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము.

5. హోండా సిటి

5. హోండా సిటి

హోండా మోటార్స్‌కు చెందిన సిటి సెడాన్ కారులోని పెట్రోల్ మరియు డీజల్ రెండింటి మీద కూడా డిస్కౌంట్లను ప్రకటించారు. 2015 కు చెందిన సిటి మోడల్ మీద గరిష్టంగా 60,000 ల వరకు లాభాలను ప్రకటించారు.

భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఐదు సెడాన్ కార్లు

హోండా తమ పెట్రోల్ సిటి కారు మీద కూడా 15,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది. మరియు ఎక్స్‌చ్ఛేంజి బోనస్‌గా 15,000 వరకు లాభపడవచ్చు.

4. నిస్సాన్ సన్నీ

4. నిస్సాన్ సన్నీ

జపాన్‌కు చెందిన నిస్సాన్ సంస్థ సన్నీ కారును కాస్త అప్‌డేట్ చేశారు. అయినప్పటికీ వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. నిస్సాన్ ఈ సన్నీ మీద సుమారుగా 70,000 ల వరకు డిస్కౌంట్లను ప్రకిటించింది.

భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఐదు సెడాన్ కార్లు

నిస్సాన్‌ సన్నీ లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద సమానంగా ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

3. హ్యుందాయ్ వెర్నా

3. హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తమకున్న పోటీదారులను ఎలాగైనా అధిగమించాలనే ప్రయత్నం చేస్తోంది. వెర్నా సెడాన్‌ అందుబాటులో ఉన్న పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద ఆఫర్లు ఉన్నాయి. అధికంగా 80,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఐదు సెడాన్ కార్లు

హ్యుందాయ్ తమ వెర్నా మీద ప్రకటించిన మొత్తం ఆఫర్లలో లోయల్టీ బోనస్ 10,000, క్యాష్ బ్యాక్ క్రింద 20,0000 మరియు ఎక్స్‌ఛ్చేంజ్ క్రింద 50,000 రుపాయలను ఆఫర్లుగా ప్రకటించింది.

2. ఫియట్ లీనియా

2. ఫియట్ లీనియా

ఫియట్ సంస్థ లీనియా మరియు లీనియా క్లాసిక్ రెండింటి మీద కూడా డిస్కౌంట్లను ప్రకటించారు. ఫియట్ లీనియా మీద సుమరుగా రూ. 65,000 లు వరకు లాభాలను ప్రకటించారు.

భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఐదు సెడాన్ కార్లు

ఫియట్ వారి లీనియా క్లాసిక్ సెడాన్ మీద సుమారుగా 95,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు. అంతే కాకుండా రెండు వేరియంట్ల మీద కూడా మొదటి ఏడాది ఇన్సూరెన్స్ ఉచితంగా అందిస్తున్నారు.

1. హ్యుందాయ్ ఎలంట్రా

1. హ్యుందాయ్ ఎలంట్రా

డిస్కౌంట్లను అందిస్తున్న టాప్-5 సెడాన్ కార్లలో హ్యుందాయ్ వారి మరొక కారు ఎలంట్రా ఈ జాబితాలో నిలిచింది. హ్యుందాయ్ తమ ఎలంట్రా మీద ఏకంగా 1.30 లక్షల రుపాయల వరకు ఆఫర్ ప్రకటించింది.

భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న ఐదు సెడాన్ కార్లు

భారీ ధరతో డిస్కౌంట్‌ను ప్రకటించిన హ్యుందాయ్ ఎలంట్రాలోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు రెండింటి మీద కూడా డిస్కౌంట్లు వర్తిస్థాయని తెలిపింది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

2016 జూన్‌లో కొత్త కార్ల మీద ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు

20 వేల టియాగో బుకింగ్‌లు: ఈ విజయం వెనకున్న ముఖ్య కారణాలు

More from DriveSpark

Article Published On: Thursday, June 16, 2016, 18:29 [IST]
English summary
Here Are The Top 5 Sedans With Huge Discounts For June 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+