మే 2016 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 కార్లు: టాప్-10లో మారుతివే ఏడు కార్లు
అంతర్జాతీయంగా పోల్చుకుంటే భారతీయ కార్ల పరిశ్రమ అతి పెద్ద మార్కెట్ వాటాతో రూపుదిద్దుకుంటోంది. దేశీయంగా తయారైన కార్లను దేశీయ మార్కెట్లోకే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్‌ను పొందుతున్నాయి. ఎప్పటి లాగే ప్రతి నెలలో కూడా అత్యధిక అమ్మకాలు సాధించిన టాప్-10 కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం అందిస్తోంది.
గత నెల ( మే 2016) లో జరిగిన అమ్మకాల గురించి ప్రస్తావిస్తే, ఎన్నడూ జరగని అత్భుతం చోటు చేసుకుంది. టాప్-10 ఉత్తమ అమ్మకాల సాధించిన జాబితాలో మారుతికి చెందినవి సుమారుగా ఏడు కార్ల చోటు సాధించాయి. వాటి వివరాల క్రింది కథనంలో.....

10. మారుతి సుజకి సియాజ్
మారుతి సుజుకి వారి సియాజ్ కారు ఈ జాబితాలో చోటు సాధించడం కొంచెం అశ్చర్యకరమే అని చెప్పవచ్చు. ఏప్రిల్‌ను టాప్-10 విభాగంలో ఎంటర్ అయ్యింది. 2016 మే నెలలో 5,188 మరియు 2016 ఏప్రిల్ నెలలో 5,012 యూనిట్లు అమ్ముడుపోయాయి.

09. రెనో క్విడ్
చిన్న కార్ల సెగ్మెంట్లో మారుతి నిర్మించుకున్న కోటను బద్దలు కొట్టేసింది ఈ రెనో క్విడ్ ఎంట్రీ లెవల్ కారు, మారుతి వారి అమ్మకాలు తగ్గాయి అని అంటే దానికి గల ఏకైక కారణం క్విడ్ ఎంట్రీ. గడిచిన మే 2016 లో రెనో క్లిడ్ సుమారుగా 5,600 యూనిట్లు అమ్ముడుపోయాయి.

08.మారుతి సుజకి సెలెరియో
మారుతి సుజుకి వారి ఈ సెలెరియో కారు ఫ్రంట్ డిజైన్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా పర్ఫామెన్స్ మరియు ఎఫిషియన్సీ పరంగా మంచి పేరును తెచ్చుకుంది. దీనితో నేడు దేశ వ్యాప్తంగా ధీటైన అమ్మకాలు సాధిస్తోంది. గడిచిన మే 2016 నెలలో 7,379 యూనిట్ల సెలెరియో కార్లు అమ్ముడుపోయాయి.

07. హ్యుందాయ్ ఎలైట్ ఐ20
హ్యుందాయ్ మోటార్స్ వారి బెస్ట్ సెల్లింగ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 8,600 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అంతకు మునుపటి మాసం 2016 ఏప్రిల్ అమ్మకాలు 10,344 లతో పోల్చుకుంటే 17 శాతం అమ్మకాల వృద్దిని కోల్పోయింది. టాప్-10 జాబితాలో 5 నుండి 7 మధ్య నిలుస్తోంది. కారణం మారుతి వారి బాలనొ కారు ఎంట్రీ. ప్రస్తుతం ఈ రెండు ఉత్పత్తుల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది.

06. మారుతి సుజుకి బాలెనొ
మారుతి సుజుకి వారి లేటెస్ట్ ఎంట్రీ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారు సునామి సృష్టించిందని చెప్పవచ్చు. గడిచిన నెలలో సుమారుగా 10,004 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మారుతి ఈ బాలెనొ కారులోని స్టాండర్డ్ వేరియంట్లలో ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఉండటం బాగా కలిసొచ్చిందని చెప్పచ్చు.

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ వారి గ్రాండ్ ఐ10 అమ్మకాలు కాస్త మెరుగుపడి ఏప్రిల్ 2016 లో జరిగిన 10,112 యూనిట్ల కన్నా ఎక్కువ అమ్మకాలు జరిపి మే 2016 లో 19 శాతం అధికంతో 12,055 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారును ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్‌గా ఎంచుకుంటున్నారు.

04. మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి నుండి అధిక అమ్మకాల సాధిస్తున్న కార్లలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. ఏళ్ల కాలంగా రెండవ స్థానంలో కొనసాగినప్పటికీ ఇప్పుడు ఇది నాలుగవ స్థానానికి పరిమితం అయ్యింది. గడిచిన మే 2016 అమ్మకాలలో 12,355 యూనిట్ల స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకు మునుపటి నెల ఏప్రిల్‌లో 17,195 యూనిట్లు అమ్ముడుపోయాయి.

03. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
వ్యాగన్ఆర్ మారుతి సుజుకి వారి ఎవర్‌గ్రీన్ కారు. దీనిని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ ఉత్పత్తి కూడా దీని సామ్రాజ్యాన్ని కదిలించలేకపోయింది. డబ్బుకు సరైన విలువను జోడించి కుటుంబ సమేతంగా మెచ్చే కారు ఇది, గడిచిన మే 2016 నెలలో 13,231 యూనిట్లు అమ్ముడుపోగా అంతకు మునుపు ఏప్రిల్ 2016 లో 12,467 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.

02. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
ఇండియన్ మార్కెట్లో ఉన్న కాంపాక్ట్ సెడాన్ విభాగంలోని అమ్మకాలు పరిశీలిస్తే డిజైర్ అగ్రస్థానంలో ఉంది. ఎన్ని కొత్త ఉత్పత్తులు పరిచయం అయినప్పటికీ దీని ప్రాచుర్యం ఏమాత్రం తగ్గలేదు. గడిచిన మే 2016 లో 16,968 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో 16,473 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

01. మారుతి సుజుకి ఆల్టో
టాప్-10 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఈ ఆల్టో ఇండియాలోనే నెం.1 కారుగా నిలిచింది. మే 2016 లో 19,874 యూనిట్లు అమ్ముడుపోగా అంతకు ముందు ఏప్రిల్ 2016 లో 22,595 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

గత నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 కార్లలో మారుతి సుజుకి చెందిన సుమారు ఏడు ఈ కార్లు ఈ జాబితాలో నిలిచాయి. అంటే మొత్తం ఇండియన్ మార్కెట్లో 70 శాతం వాటా ఒక్క మారుతి సుజుకినే సాధిస్తోంది. దీనితో ఇతర సంస్థలకు చెందిన పోటీ మరింత పెరిగింది.

- 2016 జూన్‌లో కొత్త కార్ల మీద ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు
- ఇండియాలో ఉన్న ప్రముఖ కార్ల కు నిర్వహంచిన క్రాష్ పరీక్షలు, వాటి రేటింగ్
- 20,000 ల బుకింగ్ మార్క్ దాటిన టియాగో: ఈ విజయం వెనకున్న ముఖ్య కారణాలు


Click it and Unblock the Notifications








