భారీగా నమోదైన టయోటా ఇన్నోవా క్రిస్టా బుకింగ్‌లు: పెరిగిన వెయిటింగ్ పీరియడ్
టయోటా మోటార్స్ ఈ 2016 మే ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి తమ ఇన్నోవా ఎమ్‌పివి వాహనం స్థానంలోకి ఇన్నోవా క్రిస్టాను ప్రవేశపెట్టారు. అప్పటి నుండి నేటి వరకు వీటి బుకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ వర్గాలు ఏ మాత్రం అంచనా వేయలేనంతగా ఏకంగా 18,000 ల క్రిస్టా వాహనాలు బుక్ అయ్యాయి.

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అకితో టచిబానా చెనైలోని టయోటా డ్రైవింగ్ స్కూల్‌లో మాట్లాడుతూ టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనం అనతి కాలంలోనే భారతీయుల నుండి సానుకూల స్పందన లభించిందని తెలిపారు.
Also Read: టయోటా ఇన్నోవా క్రిస్టా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
ప్రస్తుతం టయోటా ఇన్నోవాకు చెందిన వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలుగా ఉంది. టయోటా నెలకు 7,000 యూనిట్ల వరకు ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. డిమామండ్ ఎక్కువగా ఉన్నందున ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా పెంచనున్నట్లు తెలిపారు.
Also Read: ఇండియన్ మార్కెట్లో అధిక మైలేజ్ ఇవ్వగల టాప్-10 ఎస్‌యువిలు
టయోటా ఇన్నోవా క్రిస్టా అతి తక్కువ కాలంలో భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదు చేసుకుంది అనే విశయం అశ్ఛర్యాన్ని కలిగిస్తే, దీని కన్నా ఆశ్చర్యంగా ఇన్నోవా క్రిస్టాలోని టాప్ ఎండ్ వేరియంట్‌ను ఎక్కువ మంది బుక్ చేసుకున్నారు. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్పాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు. దీని ధర రూ. 20.79 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉంది.
టయోటా ఇన్నోవా క్రిస్టా కు చెందిన ఫోటోలు


Click it and Unblock the Notifications









