టయోటా నుండి సి-హెచ్‌ఆర్ హైబ్రిడ్ క్రాసోవర్

By Anil

2014 లో టయోటా సి-హెచ్‌ఆర్ లేదా కూపే హై రైడర్ హైబ్రిడ్ క్రాసోవర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఆ తరువాత 2016 లో కూడా దీనిని ప్రదర్శించనుంది. జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన అదే సి-హెచ్‌ఆర్‌ను మళ్లీ ప్రదర్శించనుంది. దీనిని విడుదల చేసినప్పటి నుండి ఇంటీరియర్‌కు సంభందించిన వివరాలు ఏమాత్రం విడుదల కాలేదు.

అయితే టయోటా సంస్థ పత్రికా సంస్థలకు తమ సి-హెచ్‌ఆర్ హైబ్రిడ్ క్రాసోవర్‌కు చెందిన అధిక రిజల్యూషన్ గల ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలలో సి-హెచ్‌ఆర్ ఇంటీరియర్ యొక్క మొత్తం ఫీచర్లు వెల్లడయ్యాయి. క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఇంటీరియర్ ఫీచర్లను పరిశీలించండి.

టయోటా సి-హెచ్‌ఆర్ హైబ్రిడ్ క్రాసోవర్


ఫోటోలను గమనిస్తే, ఇందులోని ఇంటీరియర్ విభిన్న రంగుల సమ్మేళనంతో ఉంది అని చెప్పవచ్చు. నలుపు, నీలం, బ్రౌన్, మరియు డార్క్ గ్రే వంటి రంగులను గుర్తించవచ్చు. అన్ని సీట్లు కూడా లెథర్‌తో వచ్చాయి, అదే విధంగా స్టీరింగ్ మరియు డోర్ హ్యండిల్స్‌కు పియానో బ్లాక్ తొడుగులు ఉన్నాయి.
డాట్సన్ రెడి గొ గురించి మీకు తెలియని పది ముఖ్యమైన విషయాలు
టయోటా సి-హెచ్‌ఆర్ హైబ్రిడ్ క్రాసోవర్ మూడు పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. అవి 1.2 లీటర్, 1.8 లీటర్ మరియు 2.0 లీటర్ ఇంజన్‌లు. మూడు ఇంజన్‌లు కూడా కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానంతో రానున్నాయి.
Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota C-HR: Hybrid Crossover Interior Images And Details Revealed
Story first published: Tuesday, June 28, 2016, 14:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X