ఇండోనేషియాలో చిన్న ఇన్నోవా కల్యా ను విడుదల చేయనున్న టయోటా
టయోటా మోటార్స్ యొక్క బాగా విజవంతచమైన ఉత్పత్తి ఇన్నోవా ఎమ్‌పివి వాహనం. ఇండియాలో బాగా విజయం సాధించిన ఇన్నోవాకు అదనపు ఫీచర్లు అందించి మరిన్ని మెరుగులు దిద్ది ఇన్నోవా క్రిస్టాగా ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఇలాగే ఇండియాతో పాటు ఇండోనేషియాలో కూడా టయోటా వాహనాలకు మంచి గిరాకీ ఉంది. అందుకోసమే కాబోలు టయోటా మోటార్స్ ఇండోనేషియా మార్కెట్లోకి ఇన్నోవా రూపంలో ఉండే చిన్న ఎమ్‌పివి వాహనం కల్యా పేరుతో విడుదల చేయనుంది. అయితే దీనికి చెందిన కొన్ని వివరాలు మరియు ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి గురించి ఓ స్మార్ట్ లుక్కేసుకోండి.

ఇండోనేషియాలో టయోటా మోటార్స్ ఈ కల్యా మిని ఎమ్‌పివి కారను లో కాస్ట్ గ్రీన్ కారు (LCGC) విభాగంలోకి విడుదల చేయనుంది.

ఇండోనేషియా పత్రికా ప్రతినిధుల సమాచారం ప్రకారం ఇండోనేషియాలోని టయోటా అగయా కారు యొక్క ముందు వైపు రూపంతో మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా వెనుకస వైపు రూపంతో దీనిని డిజైన్ చేసినట్లు తెలిపారు.

టయోటా మోటార్స్ ఇండోనేషియా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్న కల్యా కారు పేరు యొక్క సంస్కృత అర్థం "లోపం లేని" అని వస్తుందని తెలిపారు.

టయోటా మోటార్స్ ఈ కల్యా మిని ఎమ్‌పివి కారులో టయోటా ఎటియోస్‌లో వినియోగించిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించనున్నట్లు తెలిసింది. ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానుంది.

ఇండోనేషియాలోని లో కాస్ట్ గ్రీన్ కార్ల విభాగంలో విడుదలయ్యే కార్లు తప్పకుండా 980 నుండి 1,200 సీసీ మధ్య ఉంటూ లీటర్‌కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల గ్యాసోలీన్ ఇంజన్‌లై ఉండాలి.

టయోటా మోటార్స్ ఈ కల్యా మిని ఎమ్‌పివి వాహనాన్ని ఇండోనేషియాలోనే తయారు చేయనున్నట్లు తెలిసింది.

లీటర్‌కు 42 కిమీల మైలేజ్: ఇవి పాటిస్తే మీ కారు కూడా ఇస్తుంది
దేశీయంగా ఇన్నోవా క్రిస్టా విడుదల: ధర రూ. 13.84 లక్షలు


Click it and Unblock the Notifications