క్యామ్రీ హైబ్రిడ్ ధరలను తగ్గించిన టయోటా మోటార్స్
టయోటా మోటార్స్ యొక్క క్యామ్రీ హైబ్రిడ్ కారు మీద ఢిల్లీ పరిధిలో అందుబాటులో ఉండే కార్ల ధరలను తగ్గించింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం హైబ్రిడ్ వాహనాల మీద ఎక్సైజ్ సుంకాన్ని దగ్గించింది. దీనికి అనుగుణంగా తమ క్యామ్రీ హైబ్రిడ్ కార్ల ధరలను తగ్గించినట్లు టయోటా మోటార్స్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం హైబ్రిడ్ వాహనాల యొక్క ఎక్సైజ్ సుంకాన్ని 24 శాతం నుండి 12.5 శాతం వరకు తగ్గించింది. టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ధరలు మరియు మరిన్ని వివరాల కోసం....

టయోటా క్యామ్రీలోని హైబ్రిడ్ వెర్షన్ కారు యొక్క ధర రూ. 30.9 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఎక్సైజ్ సుంకం తగ్గడం కారణం చేత సుమారుగా 2.3 లక్షల రుపాయల వరకు దీని ధర తగ్గింది. క్యాబ్రీ లోని సాధారణ మరియు హైబ్రిడ్ మోడళ్ల ధరలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి.

క్యామ్రీ హైబ్రిడ్ కారులో 2.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కలదు.

ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్ రెండూ కూడా సంయుక్తంగా 202.20 బిహెచ్‌పి పవర్ మరియు కేవలం పెట్రోల్ ఇంజన్ మాత్రమే 213 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 270 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టయోటా క్యామ్రీలోని కేవలం ఎలక్ట్రి ఇంజన్‌ను మాత్రమే వినియోగించుకుని కారును నడపవచ్చు.

భద్రత పరంగా ఇందులో
- ఏడు ఎయిర్ బ్యాగులు
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- బ్రేక్ అసిస్ట్
- లేన్ చేంజ్ ఇండికేటర్
- వెహికల్ స్టెబిలిటి కంట్రోల్
- హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
- 1,388 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 33 లీటర్ల డీజల్‌తో ఛేదించిన రెనో లాజీ
- ఇండియన్ రైల్వేలో గరిష్ట దూరం ప్రయాణించే పది రైళ్లు

తాజాగా మారుతి సజుకి కూడా తమ సియాజ్ ఎస్‌హెచ్‌విఎస్ మోడల్స్ మీద ధరలను తగ్గించింది. సియాజ్ ధర మరియు ఇతర వివరాలకు....

సాధారణ డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లతో పోల్చుకుంటే హైబ్రిడ్ వాహనాలు ఎక్కువ మైలేజ్ మరియు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి.

ఈ కారణం చేత ఎక్కువ మంది ఇలాంటి కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది



Click it and Unblock the Notifications