టయోటా నుండి పెట్రోల్ వేరియంట్లో ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్
ఢీల్లీలో ప్రస్తుతం 2000 సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల డీజల్ వాహనాల రిజిస్ట్రేన్‌లను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా వరకు డీజల్ వాహనాలను అందిస్తున్న సంస్థలు నష్టపోతున్నాయి. ఇందుకోసం కొన్ని సంస్థలు తమ డీజల్ వాహనాలను పెట్రోల్ వేరియంట్లో అందివ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే టయోటా మోటార్స్ వారు వారి ఇన్నోవా మరియు డీజల్ కార్లను పెట్రోల్ వేరియంట్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read: 682 భోగీలు, 8 ఇంజన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు
టయోటా వారి 2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి డీజల్ ఇంజన్ గల కార్లు ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ కావడంతో ఢిల్లీలో వీటి అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. టయోటా తిరిగి వీటి అమ్మకాలు పుంజుకోవడానికి వీటిని పెట్రోల్ వేరియంట్లో ప్రవేశ పెట్టనుంది.
Also Read: 2016 ఇండియన్ ఎక్స్ పో లో మెరవనున్న హోండా జాజ్ ఆర్‌ఎస్
సొసైటి ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వారి సమాచారం ప్రకారం 2015 ఎప్రిల్ నుండి నవంబర్ వరకు దాదాపుగా 91,588 టయోటా కార్లు అమ్ముడుపోయాయి. వీటిలో దాదాపుగా 50,771 కార్లలో ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయి. డీల్లీ వాటా దాదాపుగా 14 శాతం ఉంది.
Also Read: 2000సీసీ పైబడి ఉన్న డీజల్ కార్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించిన సుప్రీం కోర్టు



Click it and Unblock the Notifications








