మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌గా కార్ స్టార్ట్
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మొబైల్ యాప్ ద్వారా కార్లను స్టార్ట్ చేసే సాంకేతికతను అభివృద్ది చేసింది.
టయోటా మోటార్స్ స్మార్ట్ కీ బాక్స్ పేరిట అభివృద్ది చేసిన మొబైల్ అప్లికేషన్ ద్వారా కారు డోర్లను తెరవడం మరియు కారును స్టార్ట్ చేయడం వంటివి చేయవచ్చు.

వ్యక్తిగతంగా కార్లను వినియోగించే వారికి కాకుండా వ్యాపార కోణంలో కార్లను అద్దెకు ఇచ్చే వారికి మరియు అద్దె కార్లలో ప్రయాణించే వారి సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసినట్లు టయోటా తెలిపింది.
Also Read: పాకిస్తాన్‌కు బుజ్జగింపు చర్యలుండవు: ఇక ప్రతిదాడులే...!!
సొంత కారును వినియోగించని తరుణంలో తమ కార్లను అద్దెకు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించే శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత "గెట్అరౌండ్" అనే సంస్థలో మొబైల్ యప్ ద్వారా కార్లను స్టార్ట్ చేసే సాంకేతికతను పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఈ ఏడాది జనవరిలో ప్రారంభించడం జరిగింది.


Click it and Unblock the Notifications








